
మరణం అనేది ఎప్పటికీ రహస్యమే. దీనిపై ఎప్పటికప్పుడు పరిశోధకులు, శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. కొంతమంది వైద్యులు కూడా మరణంపై పరిశోధన చేశారు. మరణం ఒక రహస్యం. దాని గురించి తెలుసుకోవడం అంతే ఆసక్తికరం. ది సన్ నివేదికలో డాక్టర్ కాథరిన్ మానిక్స్.. మీరు కోరుకున్నా లేకపోయినా, మరణం గురించి మనం ఆలోచించకుండా ఉండలేమని అన్నారు. ఇది మన జీవితంలో కీలక అంశం. మనమందరం తప్పకుండా ఏదో ఒక రోజు మృతి చెందుతాం. చనిపోయే ప్రక్రియ కూడా భయానకంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఆ స్థితిలో మనకు ఏమి జరుగుతుందో మనకే తెలియదు. అయితే మరణానికి భయపడాల్సిన పనిలేదు.
చనిపోవడం మనం అనుకునేంత చెడ్డది కాదని ఆమె తెలిపారు. పుట్టడం లాగానే చనిపోవడం కూడా ఒక ప్రక్రియ. చాలా సేపు నిద్రపోవడం అని అర్థం. అలసట తీరేందుకు మనం 6-7 గంటల నిద్ర ఎలా తీసుకుంటామో, అలాగే శరీరం బాగా అలసిపోయిన తర్వాత గాఢనిద్రలోకి వెళుతుంది. మరణం గురించి తలెత్తే ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడానికి థామస్ ఫ్లీస్‌మాన్ మరణం అంచులకు చేరిన వారితో మాట్లాడారు. మృత్యువు నోటి నుండి తిరిగి వచ్చిన వారు అనేక అనుభవాలను ఎదుర్కొంటారు. దీని గురించి యాక్సిడెంట్, ఎమర్జెన్సీ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ థామస్ ఫ్లీస్మాన్ మాట్లాడుతూ మరణానికి 5 దశలు ఉన్నాయని. దాదాపు 35 ఏళ్లుగా యాక్సిడెంట్, ఎమర్జెన్సీ డాక్టర్‌గా పనిచేస్తున్న ఆయన తన కళ్ల ముందే 2000 మందికి పైగా చనిపోవడం చూశారు. వారి చివరి దశలోని మాటలను విన్నారు. ఈ అనుభవాల ఆధారంగా మరణంలోని వివిధ దశలను వివరించారు.