పెళ్లయిన ఏడాది తర్వాత ఆ భార్యకు ఓ మహిళ నుంచి ఫోన్‌కాల్.. భర్త గురించి ఆమె చెప్పింది విని..

ABN , First Publish Date - 2021-12-19T00:08:09+05:30 IST

అల్లుడు పోలీసు కావడంతో కూతురును బాగా చూసుకుంటాడనుకుని తల్లిదండ్రులు కూడా నిశ్చింతగా ఉండేవారు. ఈ క్రమంలో గత ఏడాది అనుకోకుండా పోలీసు భార్యకు ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. భర్త గురించి ఫోన్‌లో ఆ మహిళ...

పెళ్లయిన ఏడాది తర్వాత ఆ భార్యకు ఓ మహిళ నుంచి ఫోన్‌కాల్.. భర్త గురించి ఆమె చెప్పింది విని..

అతనో పోలీస్ కానిస్టేబుల్.. మంచి సంబంధం రావడంతో రెండేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. కొత్తగా సంసారం పెట్టి హాయిగా జీవితం గడుపుతున్నారు. అల్లుడు పోలీసు కావడంతో కూతురును బాగా చూసుకుంటాడనుకుని తల్లిదండ్రులు కూడా నిశ్చింతగా ఉండేవారు. ఈ క్రమంలో గత ఏడాది అనుకోకుండా పోలీసు భార్యకు ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. భర్త గురించి ఫోన్‌లో ఆ మహిళ పలు విషయాలను తెలియజేసింది. అజ్ఞాత మహిళ చెప్పిన మాటలు వినగానే ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. తన భర్త గురించి తాను ఊహించినదానికి, ఫోన్‌లో మహిళ చెప్పిన విషయాలకు వ్యత్యాసం ఉండడంతో ఆలోచనలో పడింది. వివరాల్లోకి వెళితే..


బీహార్ ముజఫర్‌పూర్ జిల్లా సీతామర్హి గ్రామ నివాసి అయిన మణి భూషణ్ కుమార్ వృత్తి రీత్యా పోలీసు కానిస్టేబుల్. ఈ క్రమంలో 2019లో మణిభూషణ్‌కి మనియారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామం నుంచి పెళ్లి సంబంధం వచ్చింది. వధువు లవ్లీ తల్లిదండ్రులకు తాను పోలీసునని, తన భార్య అనారోగ్య కారణంగా చనిపోయిందని చెప్పాడు. దీంతో లవ్లీ తల్లిదండ్రులు మణిభూషన్‌కు కూతురుని ఇచ్చేందుకు అంగీకరించారు. ఇలా మణిభూషణ్‌కు, లవ్లీ అనే యువతికి 2019లో మేలో వివాహం జరిపించారు. అనంతరం భార్యను సీతామర్హిలోని తన నివాసానికి తీసుకెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత అహియాపూర్‌ అనే గ్రామంలో గది అద్దెకు తీసుకుని సంసారం పెట్టాడు. మధ్య మధ్యలో ఉద్యోగానికి వెళ్తున్నానంటూ  సీతామర్హికి వెళ్లి వస్తుండేవాడు. ఇలా సాగుతున్న వారి జీవితంతో ఓ రోజు అనుకోని ఘటన చోటు చేసుకుంది.

బాత్రూమ్‌లో మరమ్మతు పనులు చేస్తున్న ప్లంబర్.. గోడలో ఏదో ఉన్నట్లు అనుమానం.. తీరా బద్దలు కొట్టి చూడగా..


ఇలా ఉండగా.. గత ఏడాది లవ్లీకి ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. ‘‘నా పేరు సీమ.. మణిభూషణ్‌కు నేను మొదటి భార్యను. ఒక కూతురు కూడా ఉంది.. నేను బతికుండగానే మళ్లీ రెండో పెళ్లి చేసుకున్నాడు..’’ అని చెప్పింది. దీంతో లవ్లీ ఒక్కసారిగా తీవ్ర మనస్థాపానికి గురైంది. భర్త ఇంటికి రాగానే, మొదటి పెళ్లి గురించి ప్రస్తావిస్తూ గొడవ చేసింది. భార్య చనిపోయిందని అబద్ధాలు చెప్పి, నా జీవితం కూడా నాశనం చేస్తావా.. అంటూ నిలదీసింది.

తల్లి రెండో పెళ్లి గురించి ఫొటోలు, వీడియోలను ట్విటర్లో పెట్టిన కూతురు.. నెటిజన్ల షాకింగ్ రియాక్షన్


భార్య నిలదీయడంతో ఆగ్రహానికి గురైన మణిభూషణ్ లవ్లీపై దాడి చేశాడు. విషయం బయటకు చెబితే చంపస్తానంటూ రివాల్వర్‌తో బెదిరించాడు. కొన్నాళ్లు అలాగే భరించిన లవ్లీ.. తర్వాత తల్లిదండ్రులకు విషయం చెప్పేసింది. అంతా కలిసి ఐజీ గణేష్‌కుమార్‌, ఎస్‌ఎస్పీ జయంతకాంత్‌లను కలిశారు. మొదటి భార్య బతికుండగానే తనను రెండో పెళ్లి చేసుకున్నాడని, అలాగే భర్త ఉద్యోగ విషయంలో కూడా తమకు చాలా అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

41 ఏళ్ల తర్వాత అత్యాచారం కేసులో ప్రారంభమయిన విచారణ.. ప్లీజ్.. ఆపేయండంటూ లేఖ రాసిన బాధితురాలు

Updated Date - 2021-12-19T00:08:09+05:30 IST