Advertisement

ఏవీ ఆనాటి అందాలు?

Sep 20 2020 @ 02:55AM

కళావిహీనంగా మారుతున్న నిజాంసాగర్‌ ప్రాజెక్టు

శిథిలావస్థకు చేరిన గోల్‌బంగ్లా, ఛౌత్రినౌక

అలంకార ప్రాయంగా మారిన అతిథిగృహం

నిర్వహణలేక గార్డెన్‌లో మొలుస్తున్న పిచ్చిమొక్కలు

నీటి మూటలుగా మారిన పాలకుల హామీలు


నిజాంసాగర్‌, సెప్టెంబరు 19 : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతమైన నిజాంసాగర్‌ వద్ద ఆనాటి అందాలు కనుమరుగయ్యాయి. ప్రాజెక్టు అందాలను వీక్షించడానికి వ స్తున్న పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేక నిరాశ చెం దుతున్నారు. పాలకులు, అధికారులు మారుతున్నా.. నిజాం కాలం నాటి పర్యాటక స్థలంపై మాత్రం ఎవరూ కన్నెత్తి చూడడం లేదు. సమైక్యాంధ్రలో తెలంగాణ జిల్లాల్లోనే నిజాంసాగర్‌ ప్రాజెక్టు మొట్టమొదటిది. ప్రా జెక్టు నిర్మాణం పూర్తయ్యాక నిజాం ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో ఎత్తైన కొండపై గోల్‌బంగ్లాను నిర్మించి ఎంతో సుందరంగా తీ ర్చిదిద్దారు. కాలక్రమేణా ఈ బంగ్లా శిథిలావస్థకు చేరిం ది. గుల్‌గస్త్‌ 12 వరద గేట్ల సమీపంలో దాదాపు ఐదెక రాల స్థలంలో పర్యాటకుల ఆహ్లాదం కోసం గార్డెన్‌ను ఏ ర్పాటు చేసి.. పర్యాటకులు కూర్చునేందుకు బల్లాలు, నీరు విరజిమ్మే ఫౌంటేన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవన్నీ కనుమరుగై పోతుండడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గుల్‌గస్త్‌ గార్డెన్‌లో నిర్వహణలేని కారణంగా స్వాగతం తోరణాలు కళావిహీనంగా మారు తున్నాయి. 


అలంకార ప్రాయంగా అతిథి గృహం

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దాదాపు కోటి రూపా యల వ్యయంతో గోల్‌బంగ్లా, వీఐపీ అతిథి గృహం, గా ర్డెన్లకు మరమ్మతులు చేశారు. వాటి నిర్వహణకు సిబ్బది లేక గార్డెన్లు, అతిథి గృహాలు అలంకార ప్రాయంగా నే మిగిలిపోయాయి. నేటికీ వాటికి వేసిన తాళాలు వేసి నట్లుగానే కనబడుతున్నాయి. ఎత్తైన కొండపై నిర్మించి న గోల్‌బంగ్లా గత 35 సంవత్సరాల క్రితమే కనుమరుగై పోయింది. ఆ భవనంలో ఉన్న సామగ్రి, పరికరాలు, నా పరాళ్లు దొంగల పాలైనా అధికారులు, పాలకులు పట్టిం చుకున్న పాపాన పోలేదు. 2013లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఈ భవనానికి రూ.38 లక్షలు వెచ్చించి ప ర్యాటకులు సేద తీరేందుకు మరమ్మతులు జరిపారు. కానీ, ఈ భవన పరిసర ప్రాంతాల్లో కనీస సౌకర్యాలతో పాటు విద్యుత్‌ దీపాలు కూడా ఏర్పాటు చేయకపోవడ మే కాకుండా నీటి పారుదల శాఖాధికారులు రాత్రివేళ ల్లో సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో పగలు, రా త్రుల్లో అసాంఘిక కార్యక్రమాలే కాకుండా, పేకాట రా యుళ్లకు అడ్డాగా మారింది. ప్రాజెక్టు అంతర్‌ భాగంలో నిర్మాణం చేసిన ఛత్రీనౌక బంగ్లా పూర్తిగా శిథిలావస్థ కు చేరింది. ప్రాజెక్టు నిండితే ఈ ఛత్రీనౌకా బంగ్లా నుం చి పర్యాటకులు నీటిని ఆస్వాదించే వారు. గుల్‌గస్త్‌ పరిసరాల ప్రాంతంలో ఆవిష్కరించిన సాగునీటి పితా మహుడు నవాబ్‌ అలీ జంగ్‌ మహదూర్‌ సాక్షిగా గార్డె న్‌ అంతా పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది.

Advertisement

కనీస సౌకర్యాలు కరువు

ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో నిజాంసాగర్‌ ప్రాజె క్టును తిలకించేందుకు పర్యాటకులు తండోపతండాలు గా వస్తుంటారు. కానీ, ప్రాజెక్టు వద్ద కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందు లు పడుతున్నా రు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ం తర్వాత ప ర్యాటక ప్రాంతా లకు పూర్వ వైభ వం తెస్తామన్న పాలకులు నిజాం సాగర్‌ పర్యాటక స్థలా లపై నోరు మెదుపకపోవ డం పట్ల ఉభయ జిల్లాల పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వస్తున్న కొద్దిపాటి నీటిని తిలకించేందుకు ఉభయ జిల్లాల పర్యాటకులు సెలవు రో జుల్లో వస్తూనే ఉన్నారు. ఈ స్థలాల్లో కనీసం కూర్చు నేందుకు బల్లాలు కూడా లేకపోవడంతో పచ్చిక బైళ్లలో నే సేదతీరుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారు లు నిజాంసాగర్‌ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాల్సిన అ వసరం ఎంతైనా ఉంది. 

Follow Us on:
Advertisement
Advertisement