Australia: ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగావకాశాలు ఉన్న రంగాలివే..

ABN , First Publish Date - 2022-09-16T01:38:33+05:30 IST

ఆస్ట్రేలియాలో 2022 చివరి నాటికి 5.5 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయట. మరీ ఆ రంగాలు ఏమిటో ఓమారు తెలుసుకుందాం పదండి..

Australia: ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగావకాశాలు ఉన్న రంగాలివే..

ఎన్నారై డెస్క్: భారతీయుల్లో అనేక మంది పైచదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళుతున్న విషయం తెలిసిందే. చదువైపోయాకా అనేక మంది మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. ఇక ఆస్ట్రేలియాలో(Australia) నిపుణులైన ఉద్యోగుల కొరత ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం విదేశీయులకు రెడ్ కార్పెట్‌ పరిచి మరీ ఆహ్వానం పలుకుతోంది. ఒకానొక అంచనా ప్రకారం.. ఆస్ట్రేలియాలో 2022 చివరి నాటికి 5.5 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయట. మరీ ఉద్యోగావకాశాలు(Job Opportunities) పుష్కలంగా ఉన్న టాప్ 5 రంగాలు(Top five sectors) ఏమిటో ఓమారు తెలుసుకుందాం పదండి..

విద్యారంగం..

ఆస్ట్రేలియా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో మంచి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులకూ డిమాండ్ పెరుగుతోంది. ప్రైమరీ టీచర్లు, కౌన్సిలర్లకు అవకాశాలు మెండుగా ఉన్నాయి

హెల్త్‌కేర్ రంగం..

ఆస్ట్రేలియా జనాభాలో వృద్ధుల శాతం అధికంగా ఉండటంతో రాబోయే రోజుల్లో వైద్య సేవలకు డిమాండ్ పెరగనుంది. 

నిర్మాణ రంగం..

ఈ రంగంలో ఏటా పది శాతం మేర అభివృద్ధి చెందుతుందనేది పరిశీలకుల అంచనా. కాబట్టి.. సివిల్ ఇంజినీర్లు, ఇంటీరియర్ డిజైనర్లు, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు ఆర్కిటెక్ట్‌లకు ఉపాధి అవకాశలు మెండుగా ఉంటాయి. 

ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ

ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ మయంగా మారిపోయింది. దీంతో.. ఈ రంగంలోని నిపుణులకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. దీంతో.. ఈ రంగంలోని విద్యార్థులకు త్వరగా ఉపాధి పొందగలుగుతారు. ఆస్ట్రేలియా బిజినెస్ వర్గాల ప్రకారం.. ఐసీటీ రంగం ఏటా 12 శాతం మేర అభివృద్ధి చెందనుంది. 

ఫ్రొఫెషనల్ సర్వీసులు.. టెక్నికల్ అండ్ సైంటిఫిక్

ఆస్ట్రేలియాలో భారీగా ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో దీనిది ప్రథమస్థానం. ఏటా 13 శాతం మేర ఈ రంగం అభివృద్ధి చెందొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఫ్రొఫెషనల్ సర్వీసుల్లో టెక్నికల్ డ్రిగ్రీలు ఉన్న వారికి అవకాశాలు పుష్కలం

Updated Date - 2022-09-16T01:38:33+05:30 IST