ఇంటర్‌ తరవాత ఏమి చదవొచ్చు! సైన్స్‌ విద్యార్థుల కోసం!

ABN , First Publish Date - 2022-06-30T19:49:48+05:30 IST

మేథ్స్‌తో ఇంటర్‌ తరవాత తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఎంసెట్‌ రాసి మంచి ర్యాంకుతో ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో చేరవచ్చు. కొన్ని సంస్థలు, యూనివర్సిటీలు ప్రత్యేకమైన కోర్సులు అందిస్తున్నాయి..

ఇంటర్‌ తరవాత ఏమి చదవొచ్చు! సైన్స్‌ విద్యార్థుల కోసం!

ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ

మేథ్స్‌తో ఇంటర్‌ తరవాత తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఎంసెట్‌ రాసి మంచి ర్యాంకుతో ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో చేరవచ్చు. కొన్ని సంస్థలు, యూనివర్సిటీలు ప్రత్యేకమైన కోర్సులు అందిస్తున్నాయి. అవి చేసి ఇంజనీరింగ్‌ టెక్నీషియన్‌, ఎలక్ర్టానిక్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్‌ ఇంజనీర్‌, అగ్రికల్చరల్‌ ఇంజనీర్‌, మైనింగ్‌ అండ్‌ పెట్రోలియం ఇంజనీర్‌, ప్లాస్టిక్‌ అండ్‌ రబ్బర్‌ టెక్నాలజిస్ట్‌, సిరామిక్‌ టెక్నాలజిస్ట్‌, టెక్స్‌టైల్‌ టెక్నాలజిస్ట్‌, ప్యాకేజింగ్‌ టెక్నాలజిస్ట్‌, లెదర్‌ టెక్నాలజి్‌స్టలు కావచ్చు.


హోమ్‌ సైన్స్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ

ఇంటర్‌ బైపీసీతో పూర్తిచేసినవారు ఈ కోర్సుల్లో చేరవచ్చు. హోమ్‌ సైన్స్‌ అండ్‌ హోమ్‌ ఎకనామిక్స్‌, న్యూట్రీషియన్స్‌ అండ్‌ డైటీషియన్స్‌, ఫుడ్‌ టెక్నాలజిస్టులుగా ఉపాధి లభిస్తుంది. (హోమ్‌ సైన్స్‌ను తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిటీ సైన్స్‌గా ఇప్పుడు అందిస్తున్నారు. ఈ కోర్సులోకి  బాలురకూ చేరే అవకాశం కల్పిస్తున్నారు.) ముడి ఆహార పదార్థాలను మనుషులు, జంతువులు ఆసక్తిగా, అవసరమైనప్పుడు తినేట్టు చేయడమే ఫుడ్‌ టెక్నాలజీ కోర్సు. ఇందులో ఆహార పదార్థాలకు కృత్రిమమైన రంగు, తీపి, రుచిని, నిల్వ ఉండేలా చేస్తుంటారు. ఫుడ్‌ టెక్నాలజీ పరిశ్రమలో ఆర్గానిక్‌ కెమిస్టులు, బయోకెమిస్టులు, అనలిటికల్‌ కెమిస్టులు, హౌస్‌ ఎకనమిస్టులు, ఇంజనీర్లు (కెమికల్‌, మెకానికల్‌, ఇండస్టి్ట్రయల్‌, ఎలక్ర్టికల్‌, అగ్రికల్చరల్‌, సివిల్‌, ప్యాకింగ్‌), రీసెర్చ్‌ సైంటిస్టులు, మేనేజర్లు, అకౌంటెంట్‌లు మొదలైన వారికి అవకాశాలు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీతో ఇంటర్‌ పూర్తిచేసి ఈ రంగంలోకి వెళ్లవచ్చు. 


హోమ్ సైన్స్ అండ్ పుడ్ టెక్నాలజీ

కోర్సు అందించే కొన్ని సంస్థలు

  • Acharya N.G. Ranga Agricultural University, Bapatla, Andhra Pradesh, 
  • Prof. Jayasankar Agricultural University, Rajendra Nagar, Hyderabad-500030, 
  • Central Food Technology Research Institute, Mysore-570020, Karnataka.
  • Central Institute of Fisheries Education, Fisheries University Road, Seven Bungalows, Andheri(W), Mumbai-400061, Maharashtra, Website: www.cife.edu.in
  • College of Agricultural Technology, Marath wada Krishi Vidyapeeth, Parbani-431402, Maharashtra.
  • CSK Krishi Vishwa Vidyalaya, Palamuru-176060, Himachala Pradesh, 
  • Website: www.hillagric.org
  • Govind Ballabh Pant University of Agriculture and Technology, Pantnagar-263145, Distt. Udham Singh Nagar, Uttarakhand, 
  • Website: www.gbpuat.ac.in
  • Guru Nanak Dev University , Department of Food Science & Technology, Amritsar-143005, Punjab, Website: www.gndu.ac.in
  • Harcourt Butler Technological Institute, Nawab Ganj, Kanpur-208002, Uttar Pradesh, 
  • Website: www.hbti.ac.in
  • IIT (Indian Institute of Technology), Kharagpur-721302, West Bengal.
  • Jadhavpur University, Department of Food and Technology and Biochemical Engineering, 188 Raja S.C Malik Road, Kolkata-200032, West Bengal, Website: www.jadavpur.edu
  • Mahatma Gandhi University, Priyadarshini Hills PO, Kottayam-686560, Kerala, Website: www.mguniversity.edu
  • Manipur University, Canchipur, Imphal, Manipur, Website: www.manipuruniv.ac.in
  • M.S.University, Vadodara-390002, Gujarat 
  • Website: www.msuboroda.ac.in
  • National Dairy Research Institute, NDRI Deemed -    
  • University Karnal-132001, Haryana, 
  • Website: www.karnal.nic.in
  • National Sugar Institute, P.O:NSI Kalyanpur, Kanpur-208017, UttarPradesh.
  • SNDT Women's University, 1, Nathibai Thaker sey Marg, Marine Lines, Mumbai - 400022, Maharashtra, Website: www.sndt.ac.in
  • University of Delhi, Delhi-110007, 
  • Website: www.du.ac.in
  • University College of Technology (Osmania University), Hyderabad-500007, Telangana.
  • University Department of Chemical-Technology(U.D.C.T), Nathalal Parikh Marg, Matunga, Mumbai-400019, Maharashtra Website: www.udct.org

అగ్రికల్చర్‌, సంబంధిత రంగాలు

వ్యవసాయానికి సంబంధించిన డిగ్రీ కోర్సుల్లో చేరాలంటే కనీసం 50 శాతం మార్కులతో బైిపీసీ పూర్తిచేయాలి. అగ్రికల్చర్‌ అలాగే సంబంధిత ఇతర కోర్సులను తెలుగు రాష్ట్రాల్లోని ఆయా యూనివర్సిటీలు అందిస్తున్నాయి.

  • అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ 
  • ఎన్విరాన్‌మెంట్‌  - పౌల్ర్టీ ఫార్మింగ్‌
  • ఫారెస్ర్టీ అండ్‌ వైల్డ్‌ లైఫ్‌
  • రూరల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌   
  • వెటర్నరీ సైన్స్‌


బయోలాజికల్‌ సైన్స్‌

ఇందులో చాలా రకాల స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఇంటర్‌, డిగ్రీల్లో బైపీసీ, బీజెడ్‌సీ గ్రూపు తీసుకుని పీజీ, పీహెచ్‌డీలలో ఇక్కడ పేర్కొన్న రకాల్లో స్పెషలైజేషన్‌ చేయవచ్చు. అనాటమిస్టులు(మనుషులు, జంతువుల కణాలు, కణజాలాలు, అవయవాల పరిశీలన), అక్వాటిక్‌ బయాలజిస్టులు(నీటి లోపల జీవించే మొక్కలు, జంతువుల అధ్యయనం), ఆగ్రానమిస్టులు (సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పంటల పెంపకం, పరిశోధన), బయోకెమిస్టులు(జంతువుల జీవరసాయన చర్యల పరిశోధన), బయోఫిజిస్టులు (నరాలు, కణాలు, మెదడు మొదలైన అన్నింటి భౌతిక లక్షణాల పరిశీలన), సైటాలజిస్టులు(మొక్కలు, జంతువుల పెరుగుదల, పనితీరు మొదలైనవి పరిశోధన), క్యూరేటర్‌(మ్యూజియాలలో అతి విలువైన జీవజాలాల పరిరక్షణ), ఎకనామిక్‌ బాటని్‌స్ట(వాణిజ్య పంటల పరిశోధన), ఎకాలజిస్టులు(మనుషులు, జంతువులపై ప్రకృతి ప్రభావం పరిశీలన), ఎంటమాలజిస్టులు(మొక్కలకు హాని కలిగించే కీటకాలపై పరిశోధన), జెనెటిక్స్‌(జన్యు, వంశపారంపర్య లక్షణాలపై పరిశోధన), కీపర్‌ హర్‌బేరియం(మొక్కల్లో లోపించిన ఎరువులను అందిస్తూ-పరిశీలించడం), మైక్రో బయాలజిస్టులు(బ్యాక్టీరియల్‌ స్టడీ), మాలిక్యూలర్‌ బయాలజిస్టులు(మాలిక్యూల్‌ బయాలజీ స్టడీ), మ్యూకాలజిస్టులు (ఫంగ   ్‌సకు సంబంధించి ప్రత్యేక అధ్యయనం), అర్నిథాలజిస్టు(పక్షుల అధ్యయనం), నెమటాలజిస్టు(రౌండ్‌వార్మ్‌ అధ్యయనం), ఫిష్‌ కల్చరిస్టు(చేపల పెంపకం), ఫిజియాలజిస్టు(మొక్కల భాగాల, కణజాలాల పరిశీలన), పేథాలజిస్టు(రోగకారక క్రిముల అధ్యయనం), ఆర్కిడాలజిస్టు(ఆర్కిడ్‌ జాతి మొక్కల సంరక్షణ), పారా సైటాలజిస్టు(పరాన్న జీవుల అధ్యయనం), ప్లాంట్‌ బ్రీడర్‌, పాలి ఎకటాలజీ, ఫార్మకాలజీ, రీజనల్‌ బోటనీ, సిస్టమాటిక్‌ బోటనీ, టాక్సానమీ (జంతు, వృక్ష వర్గీకరణ శాస్త్రం), టాక్సికాలజీ, వైల్డ్‌లైఫ్‌ బయాలజీ, జువాలజీ. బయోటెక్నాలజిస్ట్‌, జెనెటిక్‌ సైంటిస్ట్‌, బయో కెమిస్ట్‌, మైక్రో బయాలజిస్ట్‌, ఆంత్రో పాలజి్‌స్టలుగా ఉద్యోగాలుంటాయి.


నర్సింగ్‌

కనీసం 45 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 40 శాతం) ఇంటర్‌ బైపీసీతో చేసినవారు బీఎస్సీ నర్సింగ్‌ చేయవచ్చు. జనరల్‌ అభ్యర్థులు 17 నుంచి 25 సంవత్సరాలలోపు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 30 సంవత్సరాలలోపు ఉండాలి. 

  • ఫిజికల్‌ అండ్‌ ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్స్‌ 
  • ఆర్థటిక్‌ అండ్‌ ప్రాస్తటిక్‌ టెక్నాలజిస్టులు సైన్స్‌తో ఇంటర్‌ పూర్తి చేసినవారు ఈ కోర్సు చేయవచ్చు. డిప్లొమా అయితే రెండు సంవత్సరాలు, డిగ్రీ అయితే నాలుగున్నర సంవత్సరాలు ఉంటుంది. 
  • స్పీచ్‌ థెరపీ అండ్‌ ఆడియోలజిస్టులు మూగ, చెవిటి సమస్యలతో బాధపడేవారికి ట్రైనింగ్‌ ఇచ్చే కౌన్సిలర్లు వీరు. సైన్స్‌తో ఇంటర్‌ పూర్తిచేసినవారు 3 సంవత్సరాల డిగ్రీ కోర్సులో చేరవచ్చు. 
  • మెడికల్‌ టెక్నాలజిస్టులు/రేడియోగ్రాఫర్లు /ఆప్టోమెట్రిస్ట్‌లు సైన్స్‌తో ఇంటర్‌ పూర్తిచేసినవారు మూడేళ్ళ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. ఒక సంవత్సరం చేసినవారికి సర్టిఫికెట్‌, రెండు సంవత్సరాలు చేసినవారికి డిప్లొమా ఇస్తున్నారు.

ఫార్మసిస్టులు

టెన్త్‌, ఇంటర్‌ అర్హతలతో ఫార్మసీలో డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులు చేయవచ్చు. భారతదేశంలో ఫార్మసీ ఇండస్ట్రీ వంద సంవత్సరాల పురాతనమైనది. దేశవ్యాప్తంగా పాతిక వేలకు పైగా మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లు ఉన్నాయి. వీటిలో ఐదోవంతు బల్క్‌ డ్రగ్‌ యూనిట్లే. ఎంపీసీ లేదా బైపీసీతో ఇంటర్‌ పూర్తిచేసినవారు నాలుగు సంవత్సరాల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీ (బిఫార్మసీ) కోర్సులో చేరడానికి అర్హులు. స్వయం ఉపాధి కోసం మెడికల్‌ షాపుల నిర్వహణ లేదా ఆస్పత్రుల్లో ఫార్మసిస్టుల ఉద్యోగాల అర్హతల కోసం రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్‌ ఫార్మసీ కోర్సు చేయొచ్చు. బిఫార్మసీ చేసినవారు మాస్టర్స్‌ ఇన్‌ ఫార్మసీ కోర్సు చేయొచ్చు. 


పారామెడికల్‌

సాధారణంగా రోగులు డాక్టర్ల దగ్గరికి వెళ్లిన తరవాత పలు రకాలు టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటినీ  డాక్టర్లు నిర్వహించరు. ఈ విషయంలో పారా మెడికల్‌ సిబ్బంది సహాయపడతారు. పారా మెడికల్‌ కోర్సుల్లో ఆప్టోమెట్రీ, ల్యాబ్‌ టెక్నాలజీ, ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్‌ మొదలైనవన్నీ ఉంటాయి. ఈ కోర్సుల్లోని చాలా విభాగాల్లో ఉద్యోగ అవకాశాలతోపాటు, స్వయం ఉపాధికి కూడా అవకాశం ఉంటుంది. 


కంప్యూటర్‌ & ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ

కంప్యూటర్‌ సంబంధిత కోర్సుల్లో చేరాలనుకుంటే డిగ్రీ స్థాయిలో బీసీఏ ఉండేది. అయితే ఇంజనీరింగ్‌, ఎంసీఏ కోర్సుల్లో సీట్లు పెరిగిన తరవాత బీసీఏకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ తగ్గింది. అలాగే ఇంటర్‌లో మేథ్స్‌ చదివి, డిగ్రీ పూర్తిచేసినవారు మాత్రం ఎంసీఏ కోర్సులో చేరవచ్చు. ఏ సబ్జెక్టులతోనైనా డిగ్రీ అర్హతతో పెద్ద సంస్థల్లో కంప్యూటర్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకుని సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌గా, హార్డ్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌గా స్థిరపడుతున్నారు. ఎంబీఏ చేసినవారు అలాగే సాఫ్ట్‌వేర్‌పై మంచి అవగాహన ఉన్నవారు సాఫ్ట్‌వేర్‌ మార్కెటింగ్‌ కూడా చేస్తున్నారు. ఇక కిందిస్థాయిలో టెన్త్‌, ఇంటర్‌ అర్హతతో ప్రైవేట్‌ సంస్థల్లో డీటీపీ నేర్చుకుని డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. కంప్యూటర్‌ ఇండస్ర్టీలో హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ఆపరేటింగ్‌తోపాటు మార్కెటింగ్‌ ఉద్యోగాలు కూడా ఉంటాయి.


మర్చెంట్‌ నేవి

ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులు, దిగుమతులు ఎక్కువ మొత్తం నౌకా రవాణా ద్వారానే జరుగుతున్నాయి. అందుకు కారణం మిగిలిన రవాణాలతో పోలిస్తే ఇది చాలా చౌక. అందుకే ప్రపంచ వ్యాప్తంగా షిప్పింగ్‌ ఇండస్ట్రీకి మంచి ఆదరణ ఉంది. మర్చెంట్‌ నేవీలోకి వెళ్లినవారికి అనుకూలతలు, ప్రతికూలతలు రెండూ ఉన్నాయి. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం వీరికి అనుకూలత. అయితే నెలల తరబడి సముద్ర ప్రయాణంలోనే జీవితం గడిచిపోతుంది. కుటుంబ జీవితం కూడా దూరమవుతుంది. నేవిగేటింగ్‌ ఆఫీసర్‌, రేడియో ఆఫీసర్‌, మెరైన్‌ ఇంజనీర్స్‌ తదితరాల్లో కెరీర్‌ వెతుక్కోవచ్చు. ఇప్పటివరకు ఇందులో మహిళలకు అవకాశాలు లేవు. అయితే షిప్‌ డాక్టర్లు, రేడియో ఆఫీసర్లుగా ఇప్పుడిప్పుడు వారు ఇందులోకి ఎంటర్‌ అవుతున్నారు. కోల్‌కతాలోని మెరైన్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ముంబైలోని ‘చాణక్య’లో చేరాలంటే మాత్రం జేఈఈలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. 

ఇవి కాకుండా...  మర్చెంట్‌ నేవీలో శిక్షణ ఇచ్చే సంస్థలు


  • Indian Maritime University (T.S. Chanakya), Karave Village, Sector 34, Nerul, Navi Mumbai, Maharashtra 400706, Ph: 022 2770 3876.
  • Praveenya Institute of Marine Engineering & Maritime Studies (PRIME), D.No.-1-74-15, Plot No.61/3,Sector 3, MVP Colony, Visakhapatnam, Andhra Pradesh 530017,  
  • AMET UNIVERSITY,  Plot No.135, East Coast Road, Kanathur, Chennai, Tamil Nadu 603112, Ph: 044 2747 2904.
  • Commander Ali's Academy of Merchant Navy, Commander Ali's Estates, Survey No.469, Donthi, Shivampet Mandal, Medak District, Telangana 502334.
  • Dr.B.R.Ambedkar Institute of Technology, Polytechnic Road, Pahargaon,, Junglighat, Port Blair, Andaman and Nicobar Islands 744103, Ph: 03192 259 693.
  • Indian Maritime College,  Masilamani Street, T.Nagar, Chennai-600 0178.  Ph: 044 2433 6953 
  • NUSI MARITIME ACADEMY, NUSIWADO, Sucaldem,Chinchinim, Salcette-Goa-403715, Ph:0832 277 3859

ఫిషరీస్‌ 

సైన్స్‌, ఆర్ట్స్‌, బిజినె స్‌ను ఒక్కచోట చేరిస్తే అది ఫిషరీస్‌గా చెప్పవచ్చు. ప్రపంచంలో మత్స్య సంపదను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న మూడో అతిపెద్ద దేశం భారత్‌. మన దేశానికి 7500 కిలోమీటర్ల విశాలమైన సముద్ర తీరం ఉంది. దీనితోపాటు దేశంలో కూడా అపారమైన నీటి వనరులు ఉన్నాయి. వీటన్నింటి కారణంగా ఈ రంగంలో అవకాశాలు విస్తారంగా కనిపిస్తాయి. ఫిషరీస్‌ రంగంలో ఉద్యోగాల విషయానికి వస్తే ఫామ్‌ మేనేజర్లు, హేచరీ మేనేజ్‌మెంట్‌, పోస్ట్‌ హార్వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌- ప్రాసెసింగ్‌, ఫిషరీ ఇన్‌స్పెక్టర్‌, ఫిషరీ వర్కర్‌ తదితరాలు ప్రధానంగా ఉంటాయి. ఫిషరీ రంగంలోని టెక్నికల్‌ ఫీల్డ్‌లోకి వెళ్లాలనుకునేవారు బైపీసీతో ఇంటర్‌ పూర్తిచేసి ఉండాలి. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని ముత్తుకూరులో గల కాలేజ్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌ ఎప్పటి నుంచో సంబంధిత కోర్సులను అందిస్తోంది.  

ఫిషరీస్‌కి సంబంధించిన కోర్సులు అందిస్తున్న సంస్థలు

  • Central Institute of Freshwater Aquaculture, Kausalyaganga, Bhubaneswar-751002, Orissa, 
  • E-mail: cifa@ori.nic.in, 
  • Website: www.stpbh.soft.net/cifa
  • Central Inland Fisheries Research Institute, Barrackpore-700120, West Bengal, 
  • E-mail: cifri@vsnl.com, Website: www.icar.org.in
  • Central Marine Fisheries Research Institute P.B.No. 1603, P.O.Tatapuram, Kochi-682014, Kerala, 
  • E-mail: mail@cmfri.com, Website: www.cmfri.com
  • Central Institute of Fisheries Technology, Willington Island, Matsyapuri, Kochi-682029, Kerala, 
  • E-mail: root@cift@ker.nic.in
  • Central Institute of Fisheries Education, (Indian Council of Agricultural Research) Seven Bungalows, Versova, Mumbai-400061, Maharashtra, 
  • E-mail: root@cife, bom.nic.in
  • Central Institute of Brackishwater Acquaculture, 141, Marshal's Road, Egmore, Chennai- 600008, Tamil Nadu.  E-mail: ciba@tn.nic.in
  • TamilNadu Veterinary and Animal Sciences University, Vapery High Road, Chennai-600007, Tamil Nadu
  • Madurai Kamaraj University, Madurai-625021, Tamil Nadu
  • Website: www.mkuuniversity.org
  • University of Calcutta, Senate House, 87/1 College Street, Kolkata-700073, West Bengal 
  • E-mail: admin@calcuniv.in 
  • Website: www.caluniv.ac.in
  • National research Centre on Coldwater Fisheries, P.B.No. 28, Roop Nagar, Haldwani, Nainital-263139, Uttarakhand
  • G.B. Pant University of Agriculture & Technology, Faculty of Science, Pantnagar, Udhamsingh Nagar, Uttarakhand-263145, Website: www.ac.in
  • National Bureau of Fish Genetics Resources, Radheswamy Bhavan 351I28, Dariyapur Talkatora Road, Rajendra Nagar Lucknow-226004, Uttar Pradesh
  • Rajendra Agricultural University, Pusa, Samastipur-848125, Bihar
  • Assam Agricultural University, Jorhat, Assam Website: www.aau.ac.in
  • Orissa University of Agriculture and Techonlogy, Bhubaneswar-751003, Orissa E-mail: auatmain@hotmail.com  Website: www.ouat.ac.in
  • School of Industrial Fisheries, Kochi-682016, Kerala.
  • E-mail: indfish@md3.vsnl.net.in
  • University of Mumbai, Mumbai, Maharashtra, Website: www.mu.ac.in


బయో ఇన్ఫర్మాటిక్స్‌

బయో ఇన్ఫర్మాటిక్స్‌ అనేది ఇంజనీరింగ్‌ డిసిప్లిన్‌. 

మాలిక్యులర్‌ బయాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీల సంగమం ఇది.

  • -B.tech (Bio informatics)- Vellore institute of technology, (Deemed university),  www.vit.ac.in. Course: 
  • Sastra, Thanjavur (deemed university) (www.sastra.edu) Course: B.tech and ME (Bio informatics)
  • Post-Graduate Courses: Annamalai university, Annamalai nagar (Tamil Nadu) (www.annamalaiuniversity.ac.in) Course: MSc (Bio informatics). Eligibility: Bachelor’s degree in science. Biochemistry. Microbiology / Bioinformatics.
  • Jawaharlal Nehru university: 
  • Bio informatics centre, New Delhi. 
  • Course: Advanced post-graduate diploma in Bio informatics (reaching & research programme). www.jnu.ac.in.
  • IIT Kharagpur: 
  • Course: Masters in medical sciences & technology (3 years)  www.iitkgp.com
  • University of Pune, Bioinformatics centre, Pune 
  • Course: M.Sc in Bioinformatics entrance test advanced diploma in Bio informatics (1 year). www.bioinfo.ernet.in/1-diploma.
  • Osmania University, PGRR centre for distance education, Hyderabad
  • Course: Post graduate diploma in Bioinformatics: 
  • University of Hyderabad, PO central university, Hyderabad website: (www. uohyd. ernet.nic.in). Cource: Adv. Post-graduate diploma in Bio- informatics (2-sem). 
  • University of Calcutta, Bose Institute, Bioinformatics centre, 93/1 Acharya prafulla chandra road, Kolkata.  
  • Course: M.Sc Biophysics & Bioinformatics, Post-graduate diploma in bioinformatics. 
  • Madhya Pradesh Bhoj open university, Bhopal. 
  • Course: Post - graduate diploma in bioinformatics. 
  • Mahe (deemed university), Manipal (www.manipal.edu). Course: Certifcate in bioinformatics (6 month). Institute of bioinformatics and applied biotechnology, Biotech park, Electronic city, phase-I, Bangalore website: ibab.ac.in/bioinformatics. 
  • Course: advance diploma in bioinformatics (18 months)       
  • Amity institute of biotechnology, Noida. Website: www.amity.edu. Course: B.Tech bioinformatics. Eligibility: 
  • Indian institute of chemical technology, Tarnaka, Hyderabad. website: www.iict.org. Course: Advanced course in bioinformatics. 
  • Jamia millia islamia, D/o bioscience, jamia jagar, New Delhi- 110 025. (www.jmi.nic.in). Course: Masters in bioinformatics.
  • Amity institute of biotechnology, NOIDA (www.amity.edu/aib)
  • South Delhi campus, Course: Post-graduate diploma in bioinformatics (1 year). 
  • Indian institute of chemical technology, Tarnaka, Hyderabad - 500007 (222. cdacindia.com and www.iictindia.org) Course: Advanced diploma in bioinformatics (18 week). 
  • Indian institute of science, Bangalore  Website: www. iisc.ernet.in

డెయిరీ టెక్నాలజీ

భారత దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో డెయిరీ ఒకటి. ప్రపంచ పశు సంపదలో భారత్‌ వాటా ఎక్కువే. మన దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెడుతున్న రంగాల్లో డెయిరీ కూడా ఒకటి. అయితే ఈ రంగం ఇప్పటికీ సంప్రదాయ వ్యక్తుల చేతుల్లోనే ఉంది. చైనా, మెక్సికో లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఇందులో దూసుకుపోతుంటే మనం మాత్రం కొంత వెనకబడి ఉన్నామని చెప్పుకోక తప్పదు. మన దేశంలోని కొన్ని సంస్థలు డెయిరీ టెక్నాలజీలో కోర్సులను అందిస్తున్నాయి. చాలా వాటిలో చేరడానికి ఇంటర్‌ పూర్తి చేసినవారు అర్హులు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ - తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణ - హైదరాబాద్‌(రాజేంద్రనగర్‌)లోని పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్‌ వెటర్నరీ యూనివర్సిటీ డైరీ టెక్నాలజీలో కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. 


డెయిరీ టెక్నాలజీని అందిస్తున్న కొన్ని సంస్థలు

· National dairy research institute (NDRI), Karnal, Haryana. It offers four year B.Tech.

· Seth MC college of dairy science, Gujarat agricultural university, Anand, Gujarat. It offers B.Sc in dairy technology.

· College of dairy science, Rajasthan agricultural university, Udaipur. It offers 5 years B.Tech degree.

· Sanjay Gandhi institute of dairy science and technology, Rajendra agricultural university, Pusa, Bihar. It offers four and a half year B.Sc degree in dairy technology. Being a domicile of Bihar is a must for the 25 seats available.

· Faculty dairy technology, West Bengal university of Animal & Fishery sciences, Mohanpur campus, krishi vishwa vidyalaya. It offers four year B.Tech. in dairy technology. The institute has 30 seats.


మరిన్ని క్యాంపస్‌ల వివరాల కోసం….. 

http://dgshipping.gov.in/Content/ PageUrl.aspx?page_name= Listofallapproved TrainingInstitutes

Updated Date - 2022-06-30T19:49:48+05:30 IST