ఆ సమయంలో నొప్పితో బాధపడుతున్నా.. పరిష్కారం ఏంటి?

ABN , First Publish Date - 2022-07-14T16:58:24+05:30 IST

డాక్టర్‌! నా వయసు 35. గత కొద్ది రోజులుగా మలవిసర్జన సమయంలో నొప్పితో బాధపడుతున్నాను

ఆ సమయంలో నొప్పితో బాధపడుతున్నా.. పరిష్కారం ఏంటి?

డాక్టర్‌! నా వయసు 35. గత కొద్ది రోజులుగా మలవిసర్జన సమయంలో నొప్పితో బాధపడుతున్నాను. కొన్నిసార్లు మలంలో రక్తం చారికలు కూడా కనిపిస్తున్నాయి. మలబద్ధకం వచ్చి, తగ్గుతూ ఉంటుంది. ఈ సమస్యకు చికిత్స అవసరమా?

- ఓ సోదరి, మిర్యాలగూడ


  • జీవనశైలి మార్పులతో ఆ సమస్యకు చెక్‌

లక్షణాలను బట్టి మీకు ‘ఫిషర్‌’ సమస్య ఉందని అనిపిస్తోంది. ఇది సర్వసాధారణమైన సమస్యే. దీనికి మందులతో కూడిన చికిత్స అవసరం లేదు. జీవనశైలి మార్పులతో ఈ సమస్య తొలగించుకోవచ్చు. ఇందుకోసం రోజు మొత్తంలో కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి. నీళ్లతో పాటు కొబ్బరినీళ్లు, మజ్జిగ, రాగి జావ కూడా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, పండ్లు ఆహారంలో చేర్చుకోవాలి. కొంతకాలం పాటు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అయితే ప్రస్తుతం మీకున్న ఫిషర్‌ సమస్య తగ్గడం కోసం, నొప్పి నుంచి ఉపశమనం కోసం వైద్యులను కలిసి ఆయింట్‌మెంట్లు సూచించమని అడగండి. జీవనశైలి, ఆహారశైలిలో మార్పులు చేసిన తర్వాత కూడా సమస్య తొలగకపోతే మరింత లోతైన పరీక్షలు అవసరమవుతాయి. 

-డాక్టర్‌ సమీరసుశీల హాస్పిటల్‌, హైదరాబాద్‌

Updated Date - 2022-07-14T16:58:24+05:30 IST