అమెరికా జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయ్!

ABN , First Publish Date - 2021-07-22T10:56:21+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ప్రజల జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

అమెరికా జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయ్!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ప్రజల జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా చేసిన ఒక సర్వే ప్రకారం, 2021లో అమెరికన్ల జీవన ప్రమాణ స్థాయి 1.5 సంవత్సరాలు పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి చూసుకుంటే అమెరికన్ల జీవన ప్రమాణ స్థాయి ఇంతలా తగ్గిపోవడం ఇదే తొలిసారని సీడీసీ అభిప్రాయపడింది. 2019లో ఇది 78.8 సంవత్సరాలుగా ఉందని, కానీ 2020 నాటికి లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 77.3 సంవత్సరాలకు పడిపోయిందని తెలిపింది. 2003 నుంచి చూసుకుంటే ఇంత తక్కువ జీవన ప్రమాణాలు ఉండటం ఇదే మొదటి సారి అని చెప్పిన సీడీసీ.. కరోనా మహమ్మారి కారణంగా ఈ పరిస్థితి తలెత్తి ఉండొచ్చని పేర్కొంది.

Updated Date - 2021-07-22T10:56:21+05:30 IST