భర్తపై కోర్టులో కేసు వేసేందుకు డబ్బులు అవసరమని.. మేనమామ ఇంటికి వెళ్లిన ఆమె.. చివరకు ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-07-22T02:09:06+05:30 IST

కొందరు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలకు పాల్పడుతుంటారు. మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో వివిధ రకాల తప్పులు చేస్తుంటారు. ఇంకొందరు విచిత్రమైన సమస్యలతో...

భర్తపై కోర్టులో కేసు వేసేందుకు డబ్బులు అవసరమని.. మేనమామ ఇంటికి వెళ్లిన ఆమె.. చివరకు ఏం చేసిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలకు పాల్పడుతుంటారు. మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో వివిధ రకాల తప్పులు చేస్తుంటారు. ఇంకొందరు విచిత్రమైన సమస్యలతో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే మహిళకు కూడా విచిత్రమైన సమస్య వచ్చిపడింది. భర్తపై ఫ్యామిలీ కోర్టులో దావా వేసేందుకు ఆమె వద్ద డబ్బు లేదు. దీంతో చివరకు మేనమామ ఇంటికి వెళ్లి ఆమె ఏం చేసిందంటే..


మహారాష్ట్రలోని పూణె పరిధి మావల్‌లోని మాల్వాడి చెందిన వ్యక్తి సోమవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన ఇంట్లో రూ.2.18లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా సంఘటన స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. జూలై 16న బాధితుడి ఇంట్లోకి ఓ మహిళ అనుమానస్పదంగా వెళ్లినట్లు తెలిసింది. చివరకు ఆమె ఫిర్యాదుదారుడి మేనకోడలుగా గుర్తించారు.

పీటలపై వరుడు.. ఎంతకూ పెళ్లి మంటపానికి చేరుకోని వధువు.. ఫోన్ చేస్తే అసలు నిజం తెలిసి షాక్.. చివరకు ఊహించని సీన్..!


దీంతో ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. తన భర్తతో విభేదాలు తలెత్తాయని, దీంతో ఫ్యామిలీ కోర్టులో కేసు వేయాలని అనుకున్నట్లు చెప్పింది. అయితే అందుకు తగ్గ  డబ్బులు తన వద్ద లేకపోవడంతో చోరీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. నకిలీ తాళం చెవి ద్వారా.. తన మేనమామ ఇంటికి వెళ్లినట్లు ఒప్పుకొంది. చివరకు పోలీసులు ఆమె నుంచి నగలను స్వాధీనం చేసుకుని, ఫిర్యాదుదారుడికి అప్పగించారు.

రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడనుకున్న పోలీసులు.. కానీ కుటుంబ సభ్యులకు మాత్రం ఒకరిపై డౌట్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!



Updated Date - 2022-07-22T02:09:06+05:30 IST