18 ఏళ్లుగా పోరాటం.. రిటైర్మెంట్ డబ్బులకై తిరిగీ తిరిగీ విసుగొచ్చి ఆ వృద్ధుడు తీసుకున్న నిర్ణయమిదీ..!

ABN , First Publish Date - 2022-07-15T01:13:18+05:30 IST

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం.. ఆ వృద్ధుడి పాలిట శాపంగా మారింది. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన ఆయన.. తద్వారా వచ్చే డబ్బుల కోసం 18ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయినా..

18 ఏళ్లుగా పోరాటం.. రిటైర్మెంట్ డబ్బులకై తిరిగీ తిరిగీ విసుగొచ్చి ఆ వృద్ధుడు తీసుకున్న నిర్ణయమిదీ..!

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం.. ఆ వృద్ధుడి పాలిట శాపంగా మారింది. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన ఆయన.. తద్వారా వచ్చే డబ్బుల కోసం 18ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయినా అధికారులు కనికరించలేదు. తనకు న్యాయంగా రావాల్సిన డబ్బులు కూడా అందకపోవడం.. ఆ వృద్ధుడిని తీవ్రంగా కలచివేసింది. దీంతో చివరకు అతడు తీసుకున్న నిర్ణయం.. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పరిధి  ప్రైడ్ సిటీ కటారాహిల్స్‌కు చెందిన ఓంప్రకాష్ భార్గవ (57).. 1986 నుంచి అశోక్‌నగర్‌లోని చందేరిలో జల వనరుల శాఖలో పని చేస్తున్నారు. 2003లో అతడి వేతనం రూ.1,882లు ఉండేది. ఇదిలావుండగా, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసే రోజువారీ వేతన జీవులకు ప్రభుత్వం రూ.70,000 అందజేస్తుందని.. అప్పటి గవర్నర్ రామ్ ప్రకాశ్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఓంప్రకాష్ అప్పట్లోనే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ డబ్బులు అందలేదు. గతంలో ఎన్నోసార్లు సంబంధిత అధికారులు, రాజకీయ నేతలకు వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.

ఒకప్పుడు పొలాల్లో పశువుల కాపరి.. ప్రస్తుతం ఈ మహిళ ఏ రేంజ్‌లో ఉందో అస్సలు ఊహించలేరు.. ఒక్కో ఏడాదికి..


దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓంప్రకాష్.. బుధవారం సాయంత్రం నర్మదా భవన్‌కు చేరుకున్నారు. కొద్ది సేపటి తర్వాత సమీపంలోని పొదల్లోకి వెళ్లి, కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు అంబులెన్స్‌కి, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. అతడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో వృద్ధుడు పేర్కొన్న అధికారులు.. ప్రస్తుతం ఇక్కడ పని చేయడం లేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రోడ్డుపై తనమానాన తాను నడుచుకుంటూ వెళ్తున్న మహిళ.. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండదు..!



Updated Date - 2022-07-15T01:13:18+05:30 IST