కారులో ఎక్కాలంటే ఇబ్బందిగా ఉందన్న పెళ్లికూతురు.. కాసేపటికే ప్రియుడితో కలిసి ఆమె చేసిన పని..

Published: Wed, 02 Feb 2022 18:04:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కారులో ఎక్కాలంటే ఇబ్బందిగా ఉందన్న పెళ్లికూతురు.. కాసేపటికే ప్రియుడితో కలిసి ఆమె చేసిన పని..

అసలు విషయం బయటపడేవరకూ.. ఎవరి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. పైకి అంతా మంచివారిగానే కనిపిస్తుంటారు.. చివరగా వారు చేసిన ఘనకార్యాలు తెలుసుకుని.. ‘‘అరే, పైకి చూస్తే మంచి వారిలా ఉండేవారు.. ఇలాంటి పని చేశారా’’.. అంటూ ఆశ్చర్యపోతుంటాం.. మధ్యప్రదేశ్‌‌కి చెందిన ఓ యువతి కూడా పైకి మంచి అమ్మాయిలా ఉండేది. తీరా పెళ్లి జరిగే సమయంలో ఆమె చేసిన పని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భంటలయ్య నివాసి అయిన రేణు అలియాస్ సంగీత అహిర్వార్ అనే యువతికి సియోనికి చెందిన దశరథ్ సింగ్ రాజ్‌పుత్‌‌తో వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా వధువుకు కొంత నగదు, బంగారు నగలు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. జిల్లా కోర్టు వద్ద ఉన్న ఆలయంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. అక్కడికి వెళ్లేందుకు కారును కూడా సిద్ధం చేశారు. అయితే పెళ్లి మండపానికి వెళ్లే క్రమంలో తనకు కారులో వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పింది. వేరే వాహనంలో వస్తానంటూ అందరినీ నమ్మించింది. ఆ తర్వాత అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ప్రియుడి బైక్ ఎక్కి పరారైంది.

‘‘ఆ ఒక్క కోరికను నెరవేరిస్తేనే పెళ్లి చేసుకుంటా’’.. ఈ వధువేంటీ! ఇలాంటి కండీషన్ పెట్టింది..

కాసేపటికి పెళ్లి వారికి విషయం అర్థమైంది. దీంతో వధువు అత్తగా పరిచయం చేసుకున్న అర్చన అహిర్వార్‌ను నిర్భందించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి పేరుతో వధువు, ఆమె అత్త నాటకమాడినట్లు తెలిసింది. రూ.2.5 లక్షల విలువైన బంగారు, రూ.50 వేల నగదుతో ఉడాయించినట్లు గుర్తించారు. వధువు అత్తను అదుపులోకి తీసుకున్న కొద్ది సేపటికి.. వధువు కూడా పోలీసుల ఎదుట హాజరైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వధువుకు మోయలేనంత గిఫ్ట్ వచ్చింది.. సోదరులు ఇచ్చిన బహుమతి చూసి బంధువులంతా ఖంగుతిన్నారు..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

అక్కడి ఆలయంలో శివుడికి పీతలతో అభిషేకం.. అదెక్కడో, అలా ఎందుకు చేస్తారో తెలుసా..?15ఏళ్ల తర్వాత భార్యకు విడాకులిచ్చాడు.. అయినా రోజూ ఆమెపైనే నిఘా.. ఓ రోజు ఒంటిరిగా వెళ్తుంటే సడన్‌గా అడ్డుకుని..ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి సడన్‌గా అదృశ్యం.. అంతా కంగారుపడుతుండగా ఇంతలో ఫోన్.. చివరికి అసలు విషయం తెలిసి..పూల దండ విషయంలో గొడవ.. చివరకు ఈ పెళ్లికూతురు చేసిన పని తెలుసుకుని అంతా అవాక్కయ్యారు..మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదట.. వెళ్లి చూసొస్తా.. పెళ్లయిన కొద్ది రోజులకే భార్య కోరిక.. సరేనని ఆ భర్త పంపిస్తే..నా భార్యను కిడ్నాప్ చేశారంటూ ఓ భర్త కేసు.. చివరగా ఇంట్లోనే ఆమె ఫోన్ స్విచాఫ్.. విచారణలో బయపటడిన ఘోరమిది..!
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.