8 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఏం ఒరగబెట్టారో చెప్పాలి: విజయశాంతి

ABN , First Publish Date - 2022-04-29T03:36:37+05:30 IST

8 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఏం ఒరగబెట్టారో చెప్పాలి: విజయశాంతి

8 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఏం ఒరగబెట్టారో చెప్పాలి: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం ఒరగబెట్టారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల్లో ఎన్ని అమలు చేశారు? అని, నిరుద్యోగ భృతి, పోడు భూములకు పట్టాలు, దళితులకు మూడెకరాల భూమి ఎప్పుడిస్తారో చెప్పాలని విజయశాంతి ప్రశ్నించారు. రాములమ్మ సోషల్ మీడియాలో పోస్టు యథాతథంగా..


''ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం ఒరగబెట్టారో చెప్పాలి. 2014 ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల్లో ఎన్ని అమలు చేశారు? నిరుద్యోగ భృతి, పోడు భూములకు పట్టాలు, దళితులకు మూడెకరాల భూమి ఎప్పుడిస్తారో చెప్పాలి. దళిత సీఎం హామీ ఏమైంది? 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందు మీ ఆస్తులు ఎన్ని? ఇప్పుడు మీ ఆస్తులు ఎన్నో ప్రకటించాలి. కేసీఆర్ జమానా... అవినీతి ఖజానా అని తెలంగాణ ప్రజలు ఘోషిస్తున్నరు. టీఆర్ఎస్ పార్టీకి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మేం అడిగే 21 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. బీజేపీని ఎలాగైనా ఓడించాలని రాష్ట్రంలోని పార్టీలన్నీ కలిసి పోటీకి వస్తున్నయి. ఎన్ని గుంటనక్కల పార్టీలు వచ్చినా వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే... ఊట్కూర్, భైంసాల కోసమైనా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి. నిఖార్సయిన హిందువునంటూ పేపర్​లో ప్రకటనలు వేయించుకున్న సీఎం... రాష్ట్రంలో హిందువులపై దాడులు చేస్తున్నడు. ఊట్కూర్ వినాయక నిమజ్జనంలో జరిగిన ఘటనపై 100 మంది సేవకులు, 30 మంది హిందూ యువకులపై రౌడిషీట్​లు ఉన్నయంటే సమాజం ఆలోచించాలి. గ్రామం మీదపడి వేధించిన పోలీసు అధికారులు రిటైర్ అయినా సరే వారిని విడిచిపెట్టే ప్రసక్తేలేదు. తెలంగాణ కోసం ప్రజలు ఆత్మబలిదానాలు చేసుకుంటే... కేసీఆర్ మాత్రం దొంగ దీక్షలు చేశారు. కేవలం అధికార దాహంతోనే కేసీఆర్ ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నడు. మరోవైపు తెలంగాణలో బండి సంజయ్ గారి ఆధ్వ‌ర్యంలో కొనసాగుతున్న‌ ప్రజాసంగ్రామ యాత్రతో బీజేపీ పుంజుకుంటోంది. నిత్యం బీజేపీని తిడుతుండాలని ప్రగతిభవన్ నుంచి గులాబీ శ్రేణులకు అందిన ఆదేశాల గురించి ఇటీవల ప్రముఖ దిన పత్రిక వెలువరించిన కథనం ఒక్కటి చాలు అధికార పార్టీ ఏ స్థాయిలో దిగజారిందో చెప్పడానికి.'' అని విజ‌య‌శాంతి అన్నారు.



Updated Date - 2022-04-29T03:36:37+05:30 IST