ఈ భార్యాభర్తలిద్దరూ ఐఐటీ టాపర్స్.. America లో కోట్లలో ప్యాకేజీతో జాబ్స్‌కు రాజీనామా చేసి సొంతూరికి తిరిగొచ్చి..

ABN , First Publish Date - 2022-05-17T20:04:20+05:30 IST

బాగా చదువుకుని విదేశాల్లో మంచి జీతానికి ఉద్యోగం చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ క్రమంలో కొందరు తాము అనుకున్నది సాధించి, లక్షలాది రూపాయల వేతనంతో విదేశాల్లో..

ఈ భార్యాభర్తలిద్దరూ ఐఐటీ టాపర్స్.. America లో కోట్లలో ప్యాకేజీతో జాబ్స్‌కు రాజీనామా చేసి సొంతూరికి తిరిగొచ్చి..

బాగా చదువుకుని విదేశాల్లో మంచి జీతానికి ఉద్యోగం చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ క్రమంలో కొందరు తాము అనుకున్నది సాధించి, లక్షలాది రూపాయల వేతనంతో విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం మధ్యలోనే తమ ఆశయాలను పక్కన పెట్టి, అందుబాటులో ఉన్న ఉద్యోగాలను చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతులు అమెరికాలో కోట్ల రూపాయల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ కొట్టేశారు. అయితే జాబ్‌కు రాజీనామా చేసి సొంతూరుకి తిరిగొచ్చారు. ప్రస్తుతం అంతా వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే.. 


రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ ఉజ్జయినిలోని బద్‌నగర్‌లో నివాసం ఉంటున్న అర్పిత్‌.. ముంబై ఐఐటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. ప్రిలిమినరీ పరీక్షలో ఆల్ ఇండియా రెండో ర్యాంక్ సాధించాడు. అలాగే సాక్షి మహేశ్వరి అనే యువతి  ఢిల్లీ ఐఐటీలో పట్టభద్రురాలు. 2007లో ముంబైలోని ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో సాక్షి, అర్పిత్ పాల్గొని బంగారు పతకాలు సాధించారు. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. 2013లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కొన్నాళ్లు బెంగళూరులో పని చేశారు. అనంతర కాలంలో అర్పిత్.. 1.5 కోట్ల ప్యాకేజీతో అమెరికాలో ఉద్యోగం సాధించాడు. ఈ క్రమంలో 2016లో భార్యతో కలిసి దక్షిణ అమెరికా పర్యటనకు వెళ్లాడు. 

ఒకే ఒక్క పొటాటో చిప్ పీస్ ధర ఏకంగా రూ.1.63 లక్షలు.. ఇంత ఖరీదేంటని ఆశ్చర్యపోతున్నారా..?


ఈ క్రమంలో అందమైన అడవులు, ద్వీపాలు, పర్వతాలను సందర్శించారు. అయితే అభివృద్ధి, ఆధునికీకరణ పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారని గుర్తించారు. ఇది వారి మనసులో బలమైన ముద్ర వేసింది. భారత్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందని గ్రహించి.. తమ వంతుగా ఏదైనా మార్పు తేవాలనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా మెరికాలో జాబ్ కు రిజైన్ చేసి.. సొంతూరికి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. ఉజ్జయినిలో ఒకటిన్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసి పార్మా కల్చర్ వ్యవసాయం చేయడం ప్రారంభించారు. వీరి నిర్ణయంపై మొదట స్థానికులంతా హేళనగా మాట్లాడేవారు. అయితే అర్పిత్ దంపతులు మాత్రం అవేవీ పట్టించుకోకుండా తమ పని తాము చేయడం ప్రారంభించారు. 

సివిల్ ఇంజనీర్‌ జాబ్‌కు గుడ్‌బై.. ఇప్పుడు రోజుకు 6 వేల సంపాదన.. ఇంతకీ ఇతడు చేస్తున్న పనేంటంటే..


ఎకరన్నర భూమిలో 75 రకాల మొక్కలు నాటారు. వీటిలో అరటి, బొప్పాయి, జామ, కొత్తిమీర, దానిమ్మ, నారింజ, కరోండా, పల్స, గుజ్జు, మల్బరీ తదితరాలు ఉన్నాయి. భూమిని సారవంతం చేసేందుకు కరంజ్‌ అనే రకం మొక్కలను నాటారు. ఈ మొక్కలు  గాలి నుండి నత్రజనిని తీసుకుని భూమికి బదిలీ చేస్తాయని అర్పిత్ చెబుతున్నారు. అలాగే వీటి కొమ్మలు ఎరువుగా ఉపయోగపడతాయని, ఈ మొక్క ఆకుల రసాన్ని పండ్ల మొక్కలపై పిచికారీ చేయడం వల్ల కీటకాలు నాశనమవుతాయని తెలిపాడు. ప్రస్తుతం వీరు కల్చర్ ఫార్మింగ్ పద్ధతుల ద్వారా పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు పండిస్తున్నారు. పర్మాకల్చర్ అనే ఈ నూతన విధానం ఆస్ట్రేలియా నుండి ప్రపంచమంతటా వ్యాపించిందని చెప్పాడు. భూమిని సారవంతంగా ఉంచడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపాడు. ప్రస్తుతం తమ ఆగ్రో టూరిజం చూసేందుకు ఢిల్లీ, ముంబై, గోవా, మణిపూర్, విదేశాల నుంచి కూడా వస్తున్నారని చెబుతున్నాడు. ప్రస్తుతం ఖర్చుల కోసం రోజూ మూడు గంటల పాటు ఆన్‌లైన్‌లో  పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ మిగతా సమయాన్ని వ్యవసాయానికి కేటాయిస్తున్నామని అర్పిత్ దంపతులు గర్వంగా చెబుతున్నారు. 

డబ్బుల్లేక ఇంటర్‌తోనే చదువుకు పులుస్టాప్.. ఇప్పుడు ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం.. ఈ కుర్రాడు చేసే పనేంటంటే..

Updated Date - 2022-05-17T20:04:20+05:30 IST