అక్కా.. నేను బతకనేమో.. తొందరగా రా.. అంటూ తమ్ముడి నుంచి ఫోన్.. డబ్బుల్లేక మూడు రోజుల తర్వాత ఆమె వచ్చి చూస్తే..

Published: Sat, 25 Jun 2022 20:04:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అక్కా.. నేను బతకనేమో.. తొందరగా రా.. అంటూ తమ్ముడి నుంచి ఫోన్.. డబ్బుల్లేక మూడు రోజుల తర్వాత ఆమె వచ్చి చూస్తే..

అతడు ఉపాధి నిమిత్తం ఇంటికి దూరంగా ఉంటున్నాడు. అయితే ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. పరామర్శించడానికి పక్కన ఎవరూ లేరు. దీంతో ఆస్పత్రిలో చూపించుకుని, అక్కకు ఫోన్ చేశాడు. ‘‘అక్కా నేను బతకనేమో.. తొందరగా రా’’.. అంటూ ఫోన్ చేశాడు. దీంతో కంగారు పడ్డ అక్క.. తమ్మున్ని చూడటానికి వెళ్లాలి అనుకుంది. కానీ ఆమె వద్ద డబ్బులు లేవు. దీంతో అతి కష్టం మీద మూడు రోజుల తర్వాత వెళ్లింది. అయితే అక్కడి దృశ్యం చూసి షాక్ అయింది. వివరాల్లోకి వెళితే..

జార్ఖండ్ రాష్ట్రం  కత్రాస్ బజార్ గ్రామానికి చెందిన సపన్‌కుమార్‌(40).. ఉపాధి నిమిత్తం రాజస్థాన్‌లోని ఆల్వార్‌ పరిధి గూంద్‌పూర్ గ్రామంలో ఉంటున్నాడు. ఇతడికి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వారంతా సొంత ఊర్లోనే ఉంటున్నారు. ఇదిలావుండగా, సపన్‌కుమార్ స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పని చేస్తుండేవాడు. అయితే ఈ ఏడాది జనవరిలో అతడికి టీబీ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. ఇటీవల సమస్య తీవ్రమవడంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సోలంకి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్ 19న తన అక్కకు ఫోన్ చేశాడు. ‘‘అక్కా.. నేను బతకనేమో.. తొందరగా రా’’.. అని చెప్పాడు.

విడాకుల కేసులో షాకింగ్ తీర్పు.. భర్తకు ప్రతీ నెలా రూ.25 వేలు భరణం చెల్లించాలంటూ భార్యకు ఆదేశాలు..!

దీంతో కంగారుపడిన అతడి అక్క పింకి.. తమ్ముడి వద్దకు వెళ్లానుకుంది. అయితే ఆమె వద్ద చార్జీలకు కూడా డబ్బు లేకపోవడంతో ఆగిపోయింది. మూడు రోజుల తర్వాత 22న ఎలాగోలా డబ్బు సర్దుకుని, తమ్ముడి వద్దకు బయలుదేరింది. అయితే అక్కడికి వెళ్లిన పింకీకి.. అదే రోజు తమ్ముడు చనిపోయాడని తెలిసింది. దీంతో బోరున విలపించింది. అయితే తమ్ముడి మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లడానికి కూడా ఆమె వద్ద డబ్బు లేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది సహకారంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.

న్యాయం చేయండంటూ రెండు చేతులూ లేని బాలిక కాళ్లతో రాసిందో లేఖ.. నేరుగా ఇంటికే వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

40 ఏళ్ల వయసులో ఇదేం పోయేకాలం.. 14 ఏళ్ల బాలిక తండ్రికి రూ.30 వేలు ఇచ్చిమరీ..తల్లి ఫోన్లో వీడియోను చూసి తానూ అలా చేయాలనుకున్నాడు.. పదేళ్ల పిల్లాడి మృతి కేసులో షాకింగ్ నిజాలు..!AIDS ఉన్న విషయం దాచి ఓ యువతిని పెళ్లి చేసుకున్న యువకుడు.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటంటే..కాటికి కాళ్లు చాపే వయసులో జిమ్మాస్టర్‌గా ఘనత.. త్వరలో "మిస్టర్ ఆసియా" పోటీల్లో పాల్గొంటున్న ఆ 72 ఏళ్ల వ్యక్తి ఎవరో తెలుసా..ఆలయం వద్ద నదీ స్నానం చేస్తూ.. దంపతుల రాసలీలలు.. విసిగిపోయిన భక్తులంతా కలిసి చివరకు.. videoపెళ్లయి రెండేళ్లయినా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపం.. భార్య నిద్రపోయాక భర్త బలవన్మరణం..!
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.