అతనంటే ఈ ఏనుగులకు ఎంత అభిమానం.. చాలా కాలం తర్వాత చూడడంతో.. ఒక్కసారిగా..

ABN , First Publish Date - 2021-12-27T03:04:47+05:30 IST

సేవ్ ది ఎలిఫెంట్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు డెరెక్ థాంప్సన్‌ అనే వ్యక్తి ఏనుగుల సంరక్షకుడిగా ఉండేవాడు. అయితే కొన్ని కారణాలతో 14 నెలలుగా దూరంగా ఉండేవాడు. అయితే ఇటీవల మళ్లీ ఏనుగుల గుంపు వద్దకు వచ్చాడు...

అతనంటే ఈ ఏనుగులకు ఎంత అభిమానం.. చాలా కాలం తర్వాత చూడడంతో.. ఒక్కసారిగా..

మనుషుల మధ్య ప్రేమాభిమానాలు ఉండడం సహజమే. కానీ మనుషులకు, జంతువులకు మధ్య అనుబంధాన్ని చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి వీడియోలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. సోషల్ మీడియాలో కూడా అలాంటి వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. ఏనుగులకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..


సేవ్ ది ఎలిఫెంట్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు డెరెక్ థాంప్సన్‌ అనే వ్యక్తి ఏనుగుల సంరక్షకుడిగా ఉండేవాడు. అయితే కొన్ని కారణాలతో 14 నెలలుగా దూరంగా ఉండేవాడు. అయితే ఇటీవల మళ్లీ ఏనుగుల గుంపు వద్దకు వచ్చాడు. ఓ సెలఏటి వద్ద ఉన్న అతన్ని.. దూరం నుంచి చూసిన ఏనుగులు.. వేగంగా దగ్గరికొచ్చి తమ మాజీ బాస్‌ను తొండంతో ఆప్యాయంగా నిమరడం గమనించవచ్చు. దూరమైన మనుషులు ఒక్కసారిగా కలిస్తే.. ఎలా ఫీలవుతారో, ఈ ఏనుగులు కూడా అచ్చం అలాగే చేశాయి. ఈ వీడియోను చూసిన వారంతా.. వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

పొయ్యి మీదే స్నానం.. ఈ బుడ్డోడి అతి తెలివి చూస్తే.. అవాక్కవుతారు..



Updated Date - 2021-12-27T03:04:47+05:30 IST