Viral Video: ఏ బిడ్డా.. ఇది మా అడ్డా! మామూళ్లు ఇవ్వకుంటే మామూలుగా ఉండదు.. చెరకు లారీని ఏనుగులు ఏం చేశాయంటే..

ABN , First Publish Date - 2022-07-27T21:16:24+05:30 IST

అటవీ ప్రాంతాల్లో చెక్‌పోస్టుల (Check posts) వద్ద వాహనాలు (Vehicles) ఆపి.. తనిఖీ చేసి పంపడమో, లేక మామూళ్లు తీసుకుని పంపించడమో సాధారణంగా జరిగే విషయమే. ఇది మనుషుల విషయంలో మామూలే...

Viral Video: ఏ బిడ్డా.. ఇది మా అడ్డా! మామూళ్లు ఇవ్వకుంటే మామూలుగా ఉండదు.. చెరకు లారీని ఏనుగులు ఏం చేశాయంటే..

అటవీ ప్రాంతాల్లో చెక్‌పోస్టుల (Check posts) వద్ద వాహనాలు (Vehicles) ఆపి.. తనిఖీ చేసి పంపడమో, లేక మామూళ్లు తీసుకుని పంపించడమో సాధారణంగా జరిగే విషయమే. ఇది మనుషుల విషయంలో మామూలే. అయితే ఇదే సీన్‌ను కాస్త మార్చి.. జంతువులకు అనువదిస్తే ఎలా ఉంటుంది. ఇదేంటీ ఇదెలా సాధ్యం అని అంటారా.. కానీ ఇలాంటి సీన్‌ను ఏనుగులు రిపీట్ చేశాయి. మామూళ్ల కోసం మేమూ డిమాండ్ చేయగలం.. అని నిరూపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


సోషల్ మీడియా (Social media) లో ఏనుగులకు సంబంధించిన ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ అటవీ ప్రాంతంలోని రోడ్డుపై రెండు ఏనుగులు దేనికోసమో ఎదురుచూస్తున్నట్లుగా ఉంటాయి. వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా.. వాటిని పట్టించుకోకుండా చాలా సేపు ఎదురుచూశాయి. అంతలో ఓ చెరకు లారీ అటుగా వచ్చింది. దీంతో వెంటనే.. మన సరుకు వచ్చింది.. ఎటాక్!.. అన్నట్లుగా లారీకి అడ్డుగా వెళ్తాయి. ఏనుగుల డిమాండ్ ఏంటో తెలిసిపోయినట్లుగా ఆ లారీ డ్రైవర్ కూడా లారీని అక్కడే ఆపేస్తాడు. తర్వాత ఓ వ్యక్తి లారీ పైకి ఎక్కి.. కొన్ని చెరకు గడలను కిందకు విసిరేస్తాడు.

Viral Video: చిన్నారిని కిడ్నాప్ చేయాలని చూసిన కోతి.. సినిమా సీన్‌ను తలదన్నేలా ఎంట్రీ ఇచ్చింది.. చివరకు..


అనంతరం ఆ ఏనుగులు చెరకును ఆరగించి, ఇక మీరు వెళ్లొచ్చు..  అనే అర్థం వచ్చేలా రోడ్డు పక్కకు వెళ్లిపోతాయి. ‘మీరు ఈ పన్నును ఏమని పిలుస్తారు’ అని క్యాప్షన్ ఇస్తూ ఈ వీడియోను షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఘటనల వల్ల ప్రమాదాలు జరగొచ్చు.. అని కొందరు అంటుండగా, జంతువులకు ఆహారం అందించడం అభినందనీయం.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

gun Firing: దీని ముందుకెళ్తే.. కాల్చిపారేస్తుంది.. ఆల్రెడీ మార్కెట్‌లోకి కూడా వచ్చేసింది..





Updated Date - 2022-07-27T21:16:24+05:30 IST