మీ కూతురు ఉరి వేసుకుందంటూ.. తల్లిదండ్రులకు స్థానికుల నుంచి ఫోన్.. పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చిన అసలు నిజం..

Published: Sat, 02 Jul 2022 21:08:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మీ కూతురు ఉరి వేసుకుందంటూ.. తల్లిదండ్రులకు స్థానికుల నుంచి ఫోన్.. పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చిన అసలు నిజం..

వివాహేతర సంబంధాలు.. చివరకు వినాశనానికి దారి తీస్తాయని తెలిసినా.. చాలా మంది తప్పు మీద తప్పులు చేస్తుంటారు. చివరకు జ్ఞానోదయం కలిగినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగుంటుంది. భర్తకు తెలీకుండా భార్య, భార్యకు తెలీకుండా భర్త తప్పులు చేసి, చివరకు జైలుపాలవడం.. రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, బీహార్‌లో విషాధ ఘటన చోటు చేసుకుంది. మీ కూతురు ఉరి వేసుకుందంటూ... ఆమె తల్లిదండ్రులకు స్థానికులు ఫోన్ చేశారు. చివరకు పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

మీ కూతురు ఉరి వేసుకుందంటూ.. తల్లిదండ్రులకు స్థానికుల నుంచి ఫోన్.. పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చిన అసలు నిజం..

బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్ పరిధి మలుకి బిఘా అనే గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విరాజ్ రామ్, రాణి(20) దంపతులు. వివాహమైన కొత్తలో వీరి మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. అయితే రాను రాను భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యను కాదని వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. కొన్నాళ్లకు ఈ విషయం భార్యకు తెలిసింది. దీంతో రోజూ ఈ విషయమై వారి మధ్య గొడవలు జరుగుతుండేవి. అయినా భర్త ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. గత శుక్రవారం రాత్రి కూడా దంపతుల మధ్య గొడవ పెద్దదైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. ఆమెను గొంతు నులిమి చంపేశాడు.

మీ భార్య మెట్లపై నుంచి జారి పడింది.. అంటూ స్థానికుల నుంచి ఫోన్.. భర్త కంగారుగా ఇంటికి వెళ్లి చూసేసరికి..

తర్వాత భార్యను ఉరికి వేలాడదీసి, అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి రాణి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రాణి తల్లిదండ్రులు, సోదరుడు.. రాణి మృతదేహంపై పడి బోరున విలపించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో భర్త చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకుని వివాహిత అత్త, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. విరాజ్ రామ్ కోసం గాలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక రాగానే.. తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

పిల్లలను ఆస్పత్రి వద్ద వదిలి.. ప్రియుడితో వెళ్లిన తల్లి.. తండ్రి కూడా ఎంతకీ రాకపోవడంతో.. పాపం చివరకు చిన్నారుల పరిస్థితి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఒకరికొకరు నచ్చడంతో త్వరలో పెళ్లి చేయాలనుకున్నారు. రోజూ కాబోయే భర్తతో మాట్లాడుతున్న యువతి.. చివరకు ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు..కలలో వచ్చిన నంబర్‌‌పై లాటరీ టికెట్ కొన్నాడు.. చివరికి జాక్‌పాట్ కొట్టాడు.. ఇంతకీ అతను ఎంత గెలుచుకున్నాడో తెలుసా..Viral Video: అంత పెద్ద ప్రమాదం జరిగినా.. రోడ్డుపై ఆసనాలు వేస్తున్న యువకుడు.. వీడికేమైనా పిచ్చా.. అంటున్న నెటిజన్లు.. videoదుస్తులు కొని Google Pay ద్వారా డబ్బులు చెల్లించిన బాలిక.. మరుసటి రోజే ‘‘ఐ లవ్ యూ’’ అంటూ యువకుడి మెసేజ్.. చివరకు.. రండి మేడమ్! మేము లిఫ్ట్ ఇస్తాం.. అంటూ తల్లీకూతుళ్లను కారు ఎక్కించుకున్నారు.. కాస్త ముందుకు వెళ్లగానే.. ఓ కర్రకు దుప్పటిని కట్టి.. అనారోగ్యంతో ఉన్న 75 ఏళ్ల తల్లిని అందులో పడుకోబెట్టి.. 5 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లి..!
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.