వదినను ఏకాంతంగా కలిసిన మరిది.. మద్యం మత్తులో అతడు చెప్పిన ఒక్క మాటతో.. తెల్లవారుజామున లేచి చూస్తే..

Published: Fri, 07 Jan 2022 20:07:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వదినను ఏకాంతంగా కలిసిన మరిది.. మద్యం మత్తులో అతడు చెప్పిన ఒక్క మాటతో.. తెల్లవారుజామున లేచి చూస్తే..విజయ్

వివాహేతర సంబంధాల విషయంలో వయసు, వరసలు చూసుకోకుండా చివరకు సమస్యలు కొనితెచ్చుకుంటుంటారు. ఆఖరికి చెల్లెలిని అన్న, కూతురును తండ్రి.. వక్రబుద్ధితో చూసే రోజులివి. తమిళనాడులో జరిగిన ఘటన కూడా దాదాపు ఇలాంటిదే. వదినతో మరిది వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఓ రోజు వదినను గదిలోకి తీసుకెళ్లాడు. రాత్రి ఇద్దరూ మద్యం సేవించారు. అయితే మద్యం మత్తులో అతడు చెప్పిన ఒక్క మాట... చాలా వరకు వెళ్లింది. వివారాల్లోకి వెళితే..

వదినను ఏకాంతంగా కలిసిన మరిది.. మద్యం మత్తులో అతడు చెప్పిన ఒక్క మాటతో.. తెల్లవారుజామున లేచి చూస్తే..ప్రతీకాత్మక చిత్రం

తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాకు చెందిన ప్రభు, విజయ్ అన్నదమ్ములు. పెద్దవాడైన ప్రభుకు కొన్నేళ్ల క్రితం మంజు(26) అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ క్రమంలో 2017లో ఉపాధి నిమిత్తం.. ప్రభు విదేశాలకు వెళ్లాడు. దీంతో వారి కుటుంబంలో ఏ అవసరం వచ్చినా తమ్ముడు విజయ్ చూసుకునేవాడు. ఈ క్రమంలో వదినతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. రోజూ ఆమెతోనే గడుపుతూ ఉండేవాడు. ఇటీవల ఓరోజు వదినను తీసుకుని ఏర్కాడ్‌లోని లాడ్జికి వెళ్లాడు.

లేటు వయసులో పెళ్లి చేసుకుంటోందని అంతా హాజరయ్యారు.. పెళ్లి మండపంపై వరుడు స్థానంలో ఎవరున్నారో తెలుసుకుని..

భార్యాభర్తలమని చెప్పి లాడ్జిలో గది తీసుకుని రాత్రి ఇద్దరూ మద్యం సేవించారు. మద్యం మత్తులో తాను జనవరి 23న పెళ్లి చేసుకుంటున్నానని, తర్వాత ఎక్కువగా కలవలేనని వదినతో చెప్పాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటి అనంతరం నిద్రలోకి జారుకున్నారు. అయితే వేకువజాము 3గంటల సమయంలో వదిన కనిపించలేదు. బాత్‌రూం తలుపు వేసి ఉండడంతో డోర్ కొట్టి చూశాడు. ఎంత సేపటికీ తలుపు తీయకపోవడంతో బద్దలుకొట్టి చూడగా.. లోపల ఆమె ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వారిద్దరూ డాక్టర్లు.. సహజీవనం తర్వాత పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోని పెద్దలు.. ఆ ఒక్క కారణంతో..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

లేటు వయసులో పెళ్లి చేసుకుంటోందని అంతా హాజరయ్యారు.. పెళ్లి మండపంపై వరుడు స్థానంలో ఎవరున్నారో తెలుసుకుని.. videoగుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తల్లి.. ఈ ఏడేళ్ల కొడుకు చేసిన పనేంటో తెలిసి అవాక్కైన డాక్టర్లు..!భర్త వేరే ఇంటికి వెళ్లడాన్ని గమనించిన భార్య.. ఓ రోజు స్కూల్‌కి వెళ్లి రిజిస్టర్‌లో చూడగా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..చాలా ఏళ్లుగా యువతిపై వన్‌సైడ్ లవ్.. కాబోయే భర్తతో ప్రియురాలు ఫోన్‌లో మాట్లాడుతుండడం చూసి.. వెనుకే వెళ్లి..పెళ్లయి 11ఏళ్లవుతున్నా పుట్టింటి నుంచి రానంటున్న భార్య.. భర్త వెళ్లి రమ్మని పిలవగా షాకింగ్ సమాధానం.. చివరకు..బంధువు కావడంతో రోజూ స్నేహితుడి ఇంట్లోకి వెళ్లేవాడు.. అతడి భార్యకు దగ్గరై.. చివరకు వారు చేసిన నిర్వాకం..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.