Marriage bureau cheats woman: పెళ్లి కాకుండానే వివాహితగా మారిన యువతి.. చివరకు మ్యారేజ్ బ్యూరో ఆపరేటర్ నిర్వాకం తెలుసుకుని అంతా షాక్..

ABN , First Publish Date - 2022-07-27T01:32:50+05:30 IST

పెళ్లిళ్ల పేరుతో జరిగే మోసాలను ఇటీవల చాలా చూశాం. అలాగే కొందరు శాడిస్టులు.. పెళ్లి చేసుకోవాలంటూ యువతులను (young women) వేధిస్తుంటారు. తమ దారికి తెచ్చుకునేందుకు..

Marriage bureau cheats woman: పెళ్లి కాకుండానే వివాహితగా మారిన యువతి.. చివరకు మ్యారేజ్ బ్యూరో ఆపరేటర్ నిర్వాకం తెలుసుకుని అంతా షాక్..
ప్రతీకాత్మక చిత్రం

పెళ్లిళ్ల పేరుతో జరిగే మోసాలను ఇటీవల చాలా చూశాం. అలాగే కొందరు శాడిస్టులు.. పెళ్లి చేసుకోవాలంటూ యువతులను (young women) వేధిస్తుంటారు. తమ దారికి తెచ్చుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఒప్పుకోని యువతులపై దారుణాలకు తెగబడుతుంటారు. మహారాష్ట్ర (Maharashtra) లో తాజాగా ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. పెళ్లి కాకుండానే వివాహితగా తన పేరును ఆన్‌లైన్‌లో చూసి అవాక్కయింది. చివరకు బ్యూరో ఆపరేటర్ నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. 


మహారాష్ట్ర పూణే (Pune)లోని చందన్‌నగర్ పరిధికి చెందిన 23 ఏళ్ల యువతికి కుటుంబ సభ్యులు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఫొటో తదితర వివరాలను మ్యారేజ్ బ్యూరో వాళ్లకు ఇచ్చారు. యువతి ఫొటో చూసిన బ్యూరో (Marriage Bureau) ఆపరేటర్ ఆమెపై కన్నేశాడు. ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని యువతికి ఫోన్ చేసి చెప్పాడు. తనను పెళ్లి చేసుకోవాలని రోజూ ఫోన్లు, మెసేజ్‌లు చేసి విసిగించసాగాడు. తనను విసిగించవద్దని యువతి ఎంత చెప్పినా రోజూ ఫోన్లు చేస్తుండేవాడు. చివరికి ఓ రోజు ఆమె సీరియస్ అయింది.

Boy Tortured by Villagers: 10 ఏళ్ల బాలుడిని కొడుతూ ఊరంతా తిప్పి.. చివరకు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు.. అసలేం జరిగిందంటే..


ఇంకోసారి ఫోన్లు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించింది. దీంతో యువతిపై అతను పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను నవ్వులపాలు చేయాలని వివిధ రకాలుగా ఆలోచించాడు. చివరకు ఆమెకు వివాహం అయినట్లుగా స్నేహితుడి సాయంతో ఓ నకిలీ సర్టిఫికెట్‌ను సృష్టించాడు. దాన్ని వివిధ సోషల్ మీడియా (Social media) వేదికల్లో షేర్ చేశాడు. నకిలీ వివాహ ధ్రవీకరణ పత్రంలో తన పేరును చూసుకుని యువతి షాక్ అయింది. వెంటనే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Shocking decision: అత్త చేసిన నిర్వాకం గురించి చెబుతూ గర్భిణి షాకింగ్ నిర్ణయం.. మెసేజ్ చూసిన చెల్లెలు కంగారుగా పరుగెత్తుకుంటూ వెళ్లగా..



Updated Date - 2022-07-27T01:32:50+05:30 IST