Shocking decision: అత్త చేసిన నిర్వాకం గురించి చెబుతూ గర్భిణి షాకింగ్ నిర్ణయం.. మెసేజ్ చూసిన చెల్లెలు కంగారుగా పరుగెత్తుకుంటూ వెళ్లగా..

ABN , First Publish Date - 2022-07-26T23:57:53+05:30 IST

కొన్ని కుటుంబాల్లో కోడలిని అత్త, మరికొన్ని కుటుంబాల్లో అత్తను కోడలు వేధించడం తరచూ చూస్తేనే ఉన్నాం. కొన్నిసార్లు ఇలాంటి ఘటనల్లో షాకింగ్ ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి...

Shocking decision: అత్త చేసిన నిర్వాకం గురించి చెబుతూ గర్భిణి షాకింగ్ నిర్ణయం.. మెసేజ్ చూసిన చెల్లెలు కంగారుగా పరుగెత్తుకుంటూ వెళ్లగా..
ప్రతీకాత్మక చిత్రం

కొన్ని కుటుంబాల్లో కోడలిని అత్త, మరికొన్ని కుటుంబాల్లో అత్తను కోడలు వేధించడం తరచూ చూస్తేనే ఉన్నాం. కొన్నిసార్లు ఇలాంటి ఘటనల్లో షాకింగ్ ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు చిన్న సమస్యలు కూడా చాలా పెద్దవి అవుతుంటాయి. చెన్నైలో ఇలాగే జరిగింది. తన అత్త చేసిన నిర్వాకం గురించి చెల్లెలికి మెసేజ్ చేసిన అక్క.. చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మెసేజ్ చూడగానే చెల్లెలు కంగారుగా పరుగెత్తుకుంటూ వెళ్లింది. చివరకు జరిగిన ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే..


తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఇందుమతి అనే యువతికి ఐదు నెలల క్రితం వివాహమైంది. చాలా మంది కోడళ్ల విషయంలో జరిగినట్లే.. ఈమె విషయంలో కూడా అత్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. పెళ్లయిన కొత్తలో బాగా చూసుకున్న అత్త.. నెలలు గడిచే కొద్దీ వేధించడం మొదలెట్టింది. నువ్వు లావుగా ఉన్నావంటూ ఒకసారి.. దుస్తుల విషయంలో మరోసారి.. ఇలా ఏదో ఒక సాకుతో వేధించడం మొదలెట్టింది. చివరకు ఆహారం విషయంలో కూడా ఆంక్షలు విధించేది. ఇటీవల ఇందుమతి గర్భం దాల్చింది. అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.

Boy Tortured by Villagers: 10 ఏళ్ల బాలుడిని కొడుతూ ఊరంతా తిప్పి.. చివరకు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు.. అసలేం జరిగిందంటే..


ఇన్నాళ్లు సహనంతో ఉన్న ఆమె చివరకు వేధింపుల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ప్రస్తుతం ఆమె వేలచేరిలోని తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం తన చెల్లెలికి మెసేజ్ చేసింది. మా అత్త నన్ను అవమానిస్తోందంటూ జరిగిన విషయం మొత్తం తెలియజేసింది. ఈ మెసేజ్ చూసిన చెల్లెలు కంగారుగా పరుగెత్తుకుంటూ ఇంటికి వెళ్లింది. అయితే అప్పటికే ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల ఆమె ఒంటరిగా ఉంటోందని, ఆత్మహత్య ఎలా చేసుకోవాలి అనే విషయంపై సోషల్ మీడియాలో సెర్చ్ చేసేదని తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Father Risk for Daughters: కూతుళ్ల కోసమే జైలు నుంచి పారిపోయాడు.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ కూతుళ్ల కోసమే లొంగిపోయిన ఓ తండ్రి కథ..!

Updated Date - 2022-07-26T23:57:53+05:30 IST