భర్త చనిపోయిన నెల తర్వాత.. ఓ భార్య షాకింగ్ నిర్ణయం.. నా కూతుర్ని నువ్వే చూసుకో అంటూ లేఖలో తల్లికి రాసి మరీ..

Published: Thu, 30 Jun 2022 17:03:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భర్త చనిపోయిన నెల తర్వాత.. ఓ భార్య షాకింగ్ నిర్ణయం.. నా కూతుర్ని నువ్వే చూసుకో అంటూ లేఖలో తల్లికి రాసి మరీ..ప్రతీకాత్మక చిత్రం

మానసిక ఒత్తిడి తీవ్రమయ్యే దశలో.. కొందరికి చివరకు మతిస్థిమితం కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది. మరికొందరు ఒత్తిడిని భరించలేక చివరకు హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఢిల్లీ పరిధిలో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఆమె భర్త నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న భార్య.. చివరకు అనూహ్య నిర్ణయం తీసుకుంది. నా కూతుర్ని నువ్వే చూసుకో.. అంటూ తల్లికి రాసి ఆమె చేసిన పని.. స్థానికులందరినీ కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ పరిధిలోని గురుగ్రామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాంధీనగర్ సెక్టార్ 11లోని ఓ అద్దె ఇంట్లో 32ఏళ్ల మహిళ.. పదేళ్ల కూతురితో కలిసి నివాసం ఉంటోంది. ఈమె భర్త నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి భార్యకు సమస్యలు తలెత్తాయి. ఇంటి పెద్ద లేకపోవడంతో ఆర్థికంగానూ ఆమెను అనేక సమస్యలు చుట్టుముట్టాయి. మరోవైపు తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా ఆమెకు జీవితంపైనే విరక్తి పుట్టింది. ఈ క్రమంలో ఆమె బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

పెరుగు తేవడానికి వెళ్లిన భర్త.. ఇంటికి చేరుకునేలోపు లోపలి నుంచి కటింగ్ మిషన్ శబ్ధాలు.. తీరా కిటికీ తలుపు తీసి చూస్తే..

నా కూతురిని నువ్వే చూసుకో.. అంటూ తల్లికి లేఖ రాసి, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు.. లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మృతికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. 

కడుపునొప్పి అని కూతుర్ని ఆస్పత్రికి తీసుకెళ్తే గర్భవతి అని చెప్పిన డాక్టర్లు.. ఏం జరిగిందని ఆ తల్లి ఏడుస్తూ అడిగితే..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఐదో అంతస్తు ఎక్కి.. చిట్టచివరన కూర్చుని దూకేస్తానంటూ భార్య బెదిరింపులు.. పోలీసులు వచ్చి కారణం అడిగితే ఆమె చెప్పింది విని..విపరీతంగా మద్యానికి అలవాటు పడిన భార్య.. ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేకపోవడంతో ఆ భర్త ఏం చేశాడంటే..రాత్రికి రాత్రే ఇంట్లోంచి అదృశ్యమైన అత్త, అల్లుడు.. కంగారుగా ఊరంతా వెతికిన భార్య.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!వాసన వస్తోందేంటని అడిగిన మరిది.. ఎలుక చచ్చిందన్న వదిన.. బాత్రూంలో భర్త శవాన్ని దాచి ఓ భార్య నిర్వాకమిదీ..!యువతులు తోటలో ఉండగా వీడియో తీసిన యువకుడు.. చెల్లెళ్ల వీడియోను డిలీట్ చేయమన్న అన్న.. చివరకు..ప్రేయసిని కొండపై నుంచి తోసేసిన ప్రియుడు.. కింద పడుతూ గాలిలోనే ప్రియుడికి బ్రేకప్ చెప్పిన యువతి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..video
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.