Physical teacher కి ఫోన్ చేసి ఇంటికి పిలిచి.. కాసేపటికి బాత్‌రూంలోకి వెళ్లిన మహిళ.. మరుక్షణంలో దిమ్మదిరిగే షాక్..

ABN , First Publish Date - 2022-07-29T23:39:00+05:30 IST

అతనో ప్రభుత్వ పాఠశాల (Government school) లో పీఈటీ (PET) గా పని చేస్తున్నాడు. అతడికి ఇటీవల ఓ మహిళతో ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. రోజూ ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకునే వారు..

Physical teacher కి ఫోన్ చేసి ఇంటికి పిలిచి.. కాసేపటికి బాత్‌రూంలోకి వెళ్లిన మహిళ.. మరుక్షణంలో దిమ్మదిరిగే షాక్..

అతనో ప్రభుత్వ పాఠశాల (Government school) లో పీఈటీ (PET) గా పని చేస్తున్నాడు. అతడికి ఇటీవల ఓ మహిళతో ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. రోజూ ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకునే వారు. ఇటీవల ఓ రోజు పీఈటీకి ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. ప్రియురాలిని కలవాలనే ఉద్దేశంతో ఎంతో ఆత్రుతగా వెళ్లాడు. ఆమె ఇంట్లోకి వెళ్లిన కాసేపటికి తలుపు చప్పుళ్లు వినబడ్డాయి. దీంతో మహిళ బాత్‌రూంలోకి వెళ్లింది. తర్వాత జరిగిన ఘటనతో ఉపాధ్యాయుడు షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం ఉదయ్‌పూర్‌లో హనీ ట్రాప్ (Honey trap) తరహా ఘటన చోటు చేసుకుంది. ఝడోల్ ఫలాసియాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 30ఏళ్ల ఓ వ్యక్తి పీఈటీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జూలై 22న మోనికా అనే మహిళ అతడికి వాట్సప్ కాల్ చేసింది. పరిచయం చేసుకున్న అనంతరం వరుసగా మూడు రోజుల పాటు గంటల పాటు ఫోన్లలో మాట్లాడుకున్నారు. మూడు రోజులకే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. జూలై 25న పీఈటీకి ఫోన్ చేసి.. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నానంటూ రావాలని చెప్పింది. దీంతో ఆమెను కలవాలనే ఆనందంలో ముందూ వెనుకా ఆలోచించకుండా వెళ్లిపోయాడు. మధ్యలో అతడి కోసం వేచి చూస్తున్న మహిళ.. పీఈటీని తన బైక్‌పై ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లింది.

Tragic incident: బాల్కనీలో ఆడుకుంటున్న చిన్నారులు.. ఒక్కసారిగా దభేల్‌మని శబ్ధం.. తల్లిదండ్రులు పరుగెత్తుకుంటూ వచ్చి చూడగా...


తలుపులు వేసుకుని ఇద్దరూ ఏకాంతంగా ఉండగా.. సడన్‌గా తలుపు చప్పుడు వినిపించింది. దీంతో ఆమె కంగారుగా బాత్‌రూంలోకి వెళ్లి దాక్కుంది. ముగ్గురు వ్యక్తులు లోపలికి వచ్చి వీడియోలు, ఫొటోలు తీసి.. సోషల్ మీడియా (Social media) లో షేర్ చేస్తామంటూ బెదిరించారు. అలా చేయకుండా ఉండాలంటే రూ.20లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. చివరకు రూ.10లక్షలకు చెక్ రాయించుకున్నారు. తర్వాత రోజూ ఫోన్లు చేసి మరింత డబ్బులు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరించేవారు. దీంతో బాధితుడు జూలై 26న ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 27న మోనికాతో పాటూ ఆమెకు సహకరించిన నిందితులను అరెస్ట్ చేశారు. వీరంతా కలిసి గతంలో ఇలాగే చాలా మందిని మోసం చేసినట్లు విచారణలో తేలింది.

Haryana woman shocking decision: కలిసిపోయిందిలే అనుకున్న కోడలు.. చివరకు ఎంత పని చేసింది.. చెత్త వేసి రమ్మని అత్తకు చెప్పి..



Updated Date - 2022-07-29T23:39:00+05:30 IST