పెళ్లయిన వ్యక్తితో ప్రేమాయణం.. ఓ రోజు కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వెళ్లి.. బాత్‌రూంలో ఆమె చేసిన పనికి అంతా..

Dec 7 2021 @ 21:10PM
నిందితురాలు ప్రియదర్శిని

బాగా చదువుకుని, మంచి స్థానంలో స్థిరపడాలని చాలా మంది యువతులకు ఉంటుంది. కొందరు యువతులు మాత్రం చదువును పక్కన పెట్టి ప్రేమ,గీమా అంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి తప్పటడుగు వేస్తే.. తర్వాత వెనక్కు తీసుకోలేమనే సత్యాన్ని మరచి ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో చాలామంది యువతులు తమ ప్రాణాలు కూడా పొగొట్టుకుంటూ ఉంటారు. తమిళనాడులో ఓ యువతికి పెళ్లయిన వ్యక్తిపై ప్రేమ పుట్టింది. తర్వాత ఓ రోజు కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమె చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

తమిళనాడు తంజావూరు జిల్లా పుతలూరు పరిధి అలక్కుడికి చెందిన ప్రియదర్శిని(24).. తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. ఈమెకు భవిష్యత్‌లో ఉన్నత స్థానంలో స్థిరపడాలనే కోరిక ఏకోశానా లేదు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తించాలనే ఆలోచనను పక్కన పెట్టి.. పెళ్లయిన వ్యక్తిపై ప్రేమ పెంచుకుంది. ఓ రోజు తన మనసులోని మాట చెప్పడం ద్వారా ఇద్దరూ దగ్గరయ్యారు. ఇంట్లో వారికి తెలీకుండా రోజూ అతడితో శారీరకంగా కలిసేది. కొన్నాళ్లకు ఆమె గర్భం దాల్చింది. ఇంట్లో తెలిస్తే తిడతారని భయపడింది. ఎలాగైనా అనుమానం రాకుండా బయటపడాలని ఆలోచించింది.

తాళి కట్టే సమయంలో వరుడి ముందే పెళ్లికూతురి నుదటి మీద.. ఇంతకీ ఎవరా యువకుడు.. అసలేం జరిగిందంటే..

ఈ క్రమంలో డిసెంబర్ 3వ తేదీన కడుపు నొప్పి ఉందంటూ ఇంట్లో చెప్పి తంజావూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. తర్వాత అక్కడే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే వైద్యులు, నర్సులకు తెలీకుండా రాత్రి వేళ.. బిడ్డను తీసుకుని ఆస్పత్రి బాత్‌రూంకు వెళ్లింది. లోపల ప్లష్ ట్యాంక్‌లో పాపను పడేసి .. ఏమీ తెలీనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరుగుదొడ్లు శుభ్రం చేసే క్రమంలో సిబ్బంది.. పాపను గుర్తించి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా విషయం బయటపడింది. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

ఆశయం కోసం ఒకే రోజు 900మందితో శృంగారం.. చివరగా ఆమె తన అనుభవాలను ఇలా పంచుకుంది..

ఇవి కూడా చదవండిImage Caption

భర్తతో సుఖం దొరకలేదని.. పరాయి మగవారిపై మనసు పడింది.. ఓ రోజు చెత్త ఏరుకునే వ్యక్తి ఇంట్లోకి రాగానే..క్షణకాల సుఖ కోసం భర్తను జైలుకు పంపాలనుకుంది.. ఆఖరికి కూతురని కూడా చూడకుండా గొంతు నులిమింది.. చివరికి..వారిద్దరూ అన్నదమ్ముల కొడుకులు.. ఒకరి బంధువుతో మరో వ్యక్తి రాసలీలలు.. చివరకు ఏమరపాటులో ఉండగా ఏం జరిగిందంటే..జాకెట్ సరిగా కుట్టలేదంటూ భర్తపై మండిపడిన భార్య.. అయితే నువ్వే కుట్టుకో అని భర్త అన్నందుకు.. ఎంత పని చేసింది..వారికి ఇద్దరు పిల్లలు.. సడన్‌గా భర్త లింగమార్పిడి.. తర్వాత యువకుడితో ఆమె చేసిన సహజీవనం.. అంతవరకు వెళ్తుందని ఊహించలేదు.. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లిన మహిళ.. పనుందని పక్కకు తీసుకెళ్లిన ఎస్ఐ.. ఆమె బలహీనతను గమనించి..
Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.