విదేశాలల్లో ఆ కోర్సు చేయాలంటే ఏం చేయాలి?

ABN , First Publish Date - 2022-06-22T22:09:51+05:30 IST

నేను ఇంటర్‌ చదువుతున్నాను. జర్మనీలో ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ చదవాలని నా కోరిక. దీనికి సంబంధించిన వివరాలు తెలుపగలరు?

విదేశాలల్లో ఆ కోర్సు చేయాలంటే ఏం చేయాలి?

నేను ఇంటర్‌  చదువుతున్నాను. జర్మనీలో ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ చదవాలని నా కోరిక. దీనికి సంబంధించిన వివరాలు తెలుపగలరు? 

- ఫణీంద్ర, నల్లగొండ


జర్మనీలో ఆటోమోబైల్‌ ఇంజనీరింగ్‌ చేయాలంటే జిఆర్‌ఇ, టోఫెల్‌ ఐబిటి పరీక్ష రాయాలి. జిఆర్‌ఇలో 327, టోఫెల్‌లో 105 అలా వస్తే మంచి స్కోరుగా భావించవచ్చు. జర్మనీలోని చాలా పబ్లిక్‌ యూనివర్సిటీలు చాలా తక్కువ ఫీజుతో లేదంటే  ఉచితంగా విద్యను అందిస్తాయి. నివసించడానికి అవసరమైన వ్యయాన్ని మాత్రం సొంతంగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సులు ఇంగ్లీషులో బోధించినప్పటికీ జర్మన్‌ భాష నేర్చుకుని ఉండడం మంచిది. ఏ1, ఏ2, బి1, బి2 పరీక్షల్లో కనీసం రెండు లెవల్స్‌లో పాస్‌ కావాల్సి ఉంటుంది. ఉచితంగా విద్యను అందిస్తున్న కారణంగా ఆ దేశానికి వెళుతున్నట్లుగా కాకుండా, అక్కడ కోర్సులను నిజాయతీగా చేయాలనుకుంటున్నట్లు అడ్మిషన్‌ అధికారికి నమ్మకం కలిగించగలగాలి. 

Updated Date - 2022-06-22T22:09:51+05:30 IST