ఇంకెన్నాళ్లీబాదుడు?

ABN , First Publish Date - 2022-05-26T05:40:49+05:30 IST

‘ప్రజల ఇబ్బందులను గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించారు.

ఇంకెన్నాళ్లీబాదుడు?
ద్విచక్ర వాహనాలకు తాళ్లు కట్టి లాగుతున్న టీడీపీ నేతలు

  1.   సోమిశెట్టి వెంకటేశ్వర్లు
  2.    టీడీపీ ఆధ్వర్యంలో నిరసన

కర్నూలు (అగ్రికల్చర్‌), మే 25: ‘ప్రజల ఇబ్బందులను గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటి ధరలు తగ్గించలేదని..ఇంకా బాదుడు ఎన్నాళ్లు కొనసాగిస్తారని?’ టీడీపీ కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. బుధవారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోడుమూరు ఇనచార్జి ఆకెపోగు ప్రభాకర్‌ ఆధ్వర్యంలో జగనరెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ద్విచక్ర వాహనాలకు తాళ్లు కట్టి లాగుతూ ఆందోళన చేశారు.  ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా... సీఎం తన బాదుడు ఆపడం లేదని అన్నారు. దీన్నిబట్టి జగనకు ప్రజలపై ఎంత కక్ష ఉందో తెలుస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా జగనరెడ్డి ప్రజల ఆదరణ పొందాలంటే బాదుడు నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బాస్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు.  

 

దారుణ పాలన

 మద్దికెర, మే 25: రాష్ట్రంలో జగన్‌ పాలన చాలా దారుణంగా... నీచంగా తయారైందని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకా్‌షరెడ్డి ఆరోపించారు. బుధవారం మద్దికెర గ్రామంలో విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం జిల్లాలో వేదవతి, గుండ్రేవులు, ఎల్‌ఎల్‌సీ, మరో ప్రాజెక్టుకు రూ.26 కోట్ల ప్రతిపాదనలు తయారు చేసి నిధులు మంజూరు చేస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని అన్నారు. రాష్ట్రం దాదాపు రూ.8లక్షల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంఽధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాకుండా జగన చేశారని అన్నారు.  ముఖ్యమంత్రి,  మంత్రులు,  ఎమ్మెల్యేలు  పోలీసులు లేకుండా బయటకు రాలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం పత్తికొండ నియోజకవర్గంలో సచివాలయాలు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. తన  తండ్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలోనే మద్దికెర మండలం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు.  వచ్చే ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి  చంద్రబాబునాయుడు సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒంగోలులో జరిగే మహానాడుకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో వెళుతున్నారని తెలిపారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ జమేదార్‌ రాజన్నయాదవ్‌, జిల్లా పార్లమెంట్‌ కార్యదర్శి గూడూరు ధనుంజయుడు, సర్పంచ్‌ బొమ్మనపల్లి అంజనయ్య, టీడీపీ నాయకులు లక్ష్మీనారాయణ, రంగయ్య, బెంగుళూరు మల్లికార్జున, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్‌, ప్రమోద్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-26T05:40:49+05:30 IST