Viral Video: భర్తతో బైక్‌పై వెళ్తుండగా సడన్‌గా కిందపడిన తల్లీకొడుకు.. ఎదురుగా దూసుకొస్తున్న కంటైనర్.. ఒక్క క్షణంలో..

Published: Wed, 27 Apr 2022 13:23:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: భర్తతో బైక్‌పై వెళ్తుండగా సడన్‌గా కిందపడిన తల్లీకొడుకు.. ఎదురుగా దూసుకొస్తున్న కంటైనర్.. ఒక్క క్షణంలో..

రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడడం చూస్తూనే ఉంటాం. అలాంటి వీడియోలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో కూడా ఈ కోవకు చెందినదే. భర్తతో  బైక్‌పై వెళ్తుండగా తల్లీకొడుకు సడన్‌గా కిందపడ్డారు. అదే సమయంలో ఎదురుగా ఓ ట్రక్కు దూసుకొస్తోంది. ఒక్క క్షణంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

వియాత్నాంలోని నామ్ దిన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, కొడుకుతో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. దీనికితోడు బైక్‌కు వెనుకవైపు ఖాళీ క్యాన్లను కూడా కట్టుకున్నాడు. వేగంగా వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఓ కారు బైకును తాకుతూ వెళ్లింది. దీంతో బైకు ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో వెనుకవైపు కూర్చున్న భార్య, కొడుకు కిందపడ్డారు. అదే సమయంలో ఎదురుగా ఓ ట్రక్కు వేగంగా దూసుకొస్తోంది. కిందపడ్డ మహిళ తన కొడుకును లారీ కింద పడకుండా పక్కకు లాగడంతో పాటూ తాను కూడా అప్రమత్తమైంది. రెప్పపాటు కాలంలో ఇదంతా జరిగిపోయింది. బైకుపై అలాగే ముందుకు వెళ్లిన భర్త.. వెనుక భార్య లేకపోవడాన్ని గమనించాడు.

వెళ్లి వేడుకలో వరుడి ప్రవర్తన చూసి వధువు తండ్రి షాకింగ్ నిర్ణయం.. అదే ముహూర్తానికి కూతురికి వేరే వ్యక్తితో..

కొంతదూరం ముందుకు వెళ్లి ఆగి వెనక్కి తిరిగిచూశాడు. అయితే భార్యా, కొడుక్కి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆ సమయంలో వెనుక వస్తున్న వాహనంలోని వారు ఈ ఘటనను మొత్తం వీడియో తీశారు. ఈ ఘటన 2019లో జరగ్గా..  ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌.. ఈ వీడియోను  'మదర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అని ఓ క్యాప్షన్ ఇస్తూ.. సోమవారం తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. తల్లి తన ప్రాణాలను లెక్క చేయకుండా కొడుకును రక్షించుకుంది.. అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

తన సోషల్ మీడియా అకౌంట్‌లో అసభ్యకర వీడియోలను చూసి ఖంగుతిన్న టీచర్.. దీనిపై ఆరాతీయగా చివరకు ఏం తెలిసిందంటే..



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.