డబ్బులు నష్టపోయానని కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసిన మహిళ.. చివరగా అకౌంట్ బ్యాలెన్స్ పరిశీలిస్తే..

Published: Sun, 16 Jan 2022 19:56:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
డబ్బులు నష్టపోయానని కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసిన మహిళ.. చివరగా అకౌంట్ బ్యాలెన్స్ పరిశీలిస్తే.. ప్రతీకాత్మక చిత్రం

సోషల్‌మీడియా అందుబాటులోకి వచ్చాక.. మంచి ఎంత జరుగుతుందో, చెడు కూడా అంతే స్థాయిలో జరుగుతోంది. ఆన్‌లైన్‌లో వివిధ సైట్ల ద్వారా ఇటీవల చాలా మంది నష్టపోతున్నారు. ఇందులో నిరక్ష్యరాస్యులతో పాటూ ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా.. ఏదో ఒక సందర్భంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోతున్నారు. డబ్బులు నష్టపోయానని, తిరిగి పంపించాలని ఇటీవల ముంబైలో ఓ మహిళ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసింది. చివరగా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకుని ఖంగుతింది. వివరాల్లోకి వెళితే..

ముంబై అంధేరి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఈ అనుభవం ఎదురైంది. గత ఏడాది జూలైలో ఆమె ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్ చేసింది. డబ్బులు పంపించే క్రమంలో రూ.9,999 నష్టపోయింది. అలాగే అక్టోబర్‌లో ఆన్‌లైన్‌లో డ్రై ఫ్రూట్స్ కోసం ఆర్డర్ చేస్తుండగా.. రూ.1,496 నష్టపోయింది. పోయిన డబ్బులను ఎలా పొందాలో ఆమెకు అర్థం కాలేదు. ఈ క్రమంలో ఆమె కస్టమర్ నంబర్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసింది. అక్కడ వారు సూచించిన నంబర్‌కు ఫోన్ చేసింది. అవతలి వ్యక్తి మాట్లాడుతూ డబ్బులు పంపిస్తామని, అందుకోసం ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించాడు.

బీకాం విద్యార్థినిని ఆమె తల్లితో సహా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంతకీ వీళ్లిద్దరూ కలిసి ఏం చేసేవాళ్లంటే..

అవతలి వ్యక్తి పంపించిన యాప్‌ను మహిళ తన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంది. దీంతో ఆమె బ్యాంకు వివరాలన్నీ సైబర్ నేరగాళ్లకు చేరిపోయాయి. గత ఏడాది నవంబర్ 14 నుంచి డిసెంబర్ 1 మధ్యలో మహిళ ఖాతా నుంచి సుమారు రూ.11.78 లక్షలు మాయమయ్యాయి. చివరగా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న మహిళ ఖంగుతింది. లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

15 రోజుల క్రితం పెళ్లి.. గంటల తరబడి చాటుగా భార్య ఫోన్ కాల్స్.. నిఘా వేసి భర్త ఇచ్చిన ట్విస్ట్‌తో ఆమెకు మైండ్‌బ్లాంక్..!

ఇవి కూడా చదవండిLatest News in Telugu

12 సార్లు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్న 84 ఏళ్ల వృ‌ద్ధుడి విషయంలో సీన్ రివర్స్.. తాజా అప్‌డేట్ ఏంటంటే..టికెట్ కౌంటర్ ఒక రాష్ట్రంలో.. బాత్రూం మరో రాష్ట్రంలో.. భారత్‌లోనే అరుదైన రైల్వేస్టేషన్ కథ ఇదీ..!రాత్రికి రాత్రే ట్యాంకర్లలోంచి 3000 లీటర్ల డీజిల్ మాయం.. సీసీ కెమెరాలను చెక్ చేస్తే..18 ఏళ్ల కూతురు కనిపించడం లేదంటూ ఓ తండ్రి ఫిర్యాదు.. పోలీసులు చెప్పింది విని అంతా షాక్.. మరో యువతితో కలిసి..ఈ సారి నిన్ను దేవుడు కూడా కాపాడలేడు.. ఇదీ ఆస్పత్రిలో ఉన్న భర్తకు ఓ భార్య వార్నింగ్.. ఇంతకీ అసలేం జరిగిందంటే..9నెలల క్రితం కొడుక్కు పెళ్లి.. కాపాడండంటూ రాత్రిపూట కోడలి కేకలు.. కంగారుగా గదిలోకి ఆ తండ్రి వెళ్లి చూస్తే..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.