వందకోట్లు ఏమయ్యాయి?

ABN , First Publish Date - 2021-03-01T04:45:48+05:30 IST

జోగుళాంబ ఆలయ అభివృద్ధికి వంద కోట్లు కేటాయిస్తానని చెప్పి ఏడు సంవత్సరాలు గడిచినా సీఎం కేసీఆర్‌కు ఆ విషయం గుర్తుకు రావటం లేదని ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థి జిల్లెల చిన్నారెడ్డి ఎద్దేవా చేశారు.

వందకోట్లు ఏమయ్యాయి?
అమ్మవారి దర్శనం అనంతరం విలేకర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి

- జోగుళాంబను మరిచిన ప్రభుత్వం

- కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి జిల్లెల చిన్నారెడ్డి 

- అలంపూర్‌ ఆలయాల్లో పూజలు

గద్వాల(ఆంధ్రజ్యోతి)/అలంపూర్‌/ఇటిక్యాల/ గద్వాల క్రైం, ఫిబ్రవరి 28 : జోగుళాంబ ఆలయ అభివృద్ధికి వంద కోట్లు కేటాయిస్తానని చెప్పి ఏడు సంవత్సరాలు గడిచినా సీఎం కేసీఆర్‌కు ఆ విషయం గుర్తుకు రావటం లేదని ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థి జిల్లెల చిన్నారెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆది వారం ఆయన అలంపూర్‌ చౌరస్తాతో పాటు, గద్వాల పట్టణంలోని ప్యారడైజ్‌ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నారు. ముం దుగా అలంపూర్‌ను సందర్శించిన ఆయన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల తో మాట్లాడుతూ యాదాద్రి, భద్రాద్రి అంటూ శక్తిపీఠమైన జోగుళాంబదేవిని మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపిస్తే అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపుపై కౌన్సిల్‌ సమావేశంలో గళం విప్పుతానని హామీ ఇచ్చారు. అలంపూర్‌ చౌరస్తాలో నిర్వహించిన సమావే శానికి వెళ్తున్న చిన్నారెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ నాయకుడు మధుసూధన్‌రెడ్డిలకు ఎర్రవల్లి చౌరస్తాలో నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, ఎర్రవల్లి సర్పంచు జోగుల రవి, శ్యాంసుందర్‌రావు, అనంతరెడ్డి, మహేష్‌, నరసింహులు, సంధ్యబాబు తదితరులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, మాజీ ఎంపీ మల్లురవి, అలంపూర్‌ కాంగ్రెస్‌ నాయకులు, రాజన్న, రాము, దుబ్బ వెంకటేశ్వర్లు, న రసింహ, పరశురాం, పాండు పాల్గొన్నారు. 

ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వ నిర్లక్ష్యం

ఉద్యోగాల కల్పన, పట్టభద్రుల సమస్యల పరిష్కా రంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్‌ ఎ మ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి అన్నారు. అలంపూర్‌ చౌరస్తా లోని ఏజీఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎ మ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నిరుద్యోగులకు ఉ పాధి కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నా రు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ నేటికీ నెరవేర్చ లేదన్నారు. నిరుద్యోగుల కోసం కేసీఆర్‌ ఇంటి ముందు  అమరణ నిరాహార దీక్షా చేస్తానని పేర్కొన్నారు. ఏఐ సీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రతిప క్ష పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని నిలదీసే అవ కాశం ఉంటుందన్నారు.

ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి   ఎమ్మెల్సీ ఎన్నికలలో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి జి.చిన్నారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్యారడైజ్‌ పంక్షన్‌ హాల్‌లో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎ మ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో చిన్నారెడ్డి మాట్లాడారు. గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన బీజేపీ అభ్య ర్థి ఆరేళ్లలో ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేద న్నారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఎనిమిదేళ్లు పదవిలో ఉ న్నా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీ దే వి ఓడిపోతుందని, అది కల్వకుంట్ల ఖాతాలో పడకుం డా ఉండేందుకే ఆమెను రంగంలోకి దించారని ఆరో పించారు. ఈ సందర్భంగా ఆల్‌మేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ ఫారూక్‌ హుస్సేన్‌ చిన్నారెడ్డికి మద్దతు ఇస్తూ లేఖ సమర్పించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, నాయకులు మధుసూధన్‌రెడ్డి, కిషన్‌, జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, వీరుబాబు, శంకర్‌, ఇసాక్‌, కృష్ణ తదితరులున్నారు.

Updated Date - 2021-03-01T04:45:48+05:30 IST