love marriage: తన కంటే 12ఏళ్లు చిన్న వయసున్న యువకుడితో ప్రేమ వివాహం.. ఆమె తండ్రి మరణించిన నెల రోజులకు.. ఊహించని ఘటన..

Published: Wed, 10 Aug 2022 19:38:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
love marriage: తన కంటే 12ఏళ్లు చిన్న వయసున్న యువకుడితో ప్రేమ వివాహం.. ఆమె తండ్రి మరణించిన నెల రోజులకు.. ఊహించని ఘటన..

ఆమెకు అప్పటికే వివాహమై ఓ కుమార్తె ఉంది. భర్త చనిపోవడంతో కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తన కంటే 12ఏళ్లు చిన్న వయసున్న యువకుడు పరిచయమయ్యాడు. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరకు ఇద్దరూ వివాహం (love marriage) చేసుకున్నారు. నాలుగేళ్లు ఆనందంగా జీవించారు. ఈ క్రమంలో మహిళ తండ్రి మరణించిన నెల రోజులకు ఊహించని ఘటన చోటు చేసుకుంది. మహిళ రెండో భర్త చేసిన నిర్వాకంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే..

love marriage: తన కంటే 12ఏళ్లు చిన్న వయసున్న యువకుడితో ప్రేమ వివాహం.. ఆమె తండ్రి మరణించిన నెల రోజులకు.. ఊహించని ఘటన..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం మీరట్ పరిధి శాస్ట్రి నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న హెడ్ కానిస్టేబుల్ రతన్ సింగ్ సిరోహి, కౌశల్ చౌదరి దంపతులకు స్నేహ అనే కుమార్తె ఉంది. స్నేహ భర్త ఐదేళ్ల క్రితం చనిపోయాడు.  దీంతో ఆమెకు తన అత్తమామల తరపు నుంచి కోటి రూపాయల (Crore rupees Property) విలువైన ఇల్లు, భూమి వచ్చింది. ప్రస్తుతం స్నేహ.. తన కూతురు తమన్నాతో కలిసి అత్తగారి వద్దే ఉంటోంది. కోటి రూపాయల ఆస్తి మొత్తం కూతురి పేరు మీద బదిలీ చేశారు. ఇదిలావుండగా స్నేహ.. శాస్త్రినగర్‌లోని జిమ్‌కు వెళ్లే క్రమంలో 2017 అక్టోబర్‌లో, ఆమెకు తన కంటే 12ఏళ్ల చిన్న వయసున్న ఇషు అనే యువకుడు పరిచయమయ్యాడు.

అర్ధరాత్రి.. లైట్ల వెలుగుపడి రోడ్డు పక్కన కనిపించిందో ఆకారం.. అనుమానంతో బస్సును ఆపి ఆ డ్రైవర్ వెళ్లి చూస్తే..

కొన్నాళ్లకు ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇంట్లో వారిని ఒప్పించి 2018లో ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత నుంచి యువకుడి కళ్లు ఆమె ఆస్తిపై పడ్డాయి. స్నేహ అత్తగారి పేరు మీద కూడా ఆస్తులు ఉండడంతో ఎలాగైనా కొట్టేయాలని ఆలోచించేవాడు. స్నేహ కూతురు తమన్నాను, ఆమె అత్తను చంపేస్తే.. ఆస్తి సొంతమవుతుందని కుట్రపన్నాడు. అంతకు ముందు అతడికి పలువురు నేరస్థులతో స్నేహం ఉండేది. దీంతో ఇదే విషయంపై వారితో చర్చించాడు. ఈ క్రమంలో స్నేహ తండ్రి 2022జూలై 7న మరణించాడు. దీంతో యువకుడికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది.

extramarital affair: ప్రియుడిని రోజూ కలవాలనే ఉద్దేశంతో.. ఇంట్లో పిల్లలు చూస్తుండగా మహిళ చేసిన నిర్వాకం..

సరిగ్గా నెల రోజుల తర్వాత ఆగస్టు 7న వృద్ధురాలు, ఆమె మనువరాలి హత్యకు ప్లాన్ వేశారు. ఆ రోజు భార్యను వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. పథకం ప్రకారం అతడి ముగ్గురు స్నేహితులు స్నేహ అత్తగారి ఇంటికి వెళ్లి.. వృద్ధురాలిని, ఆమె మనువరాలిని హత్య చేశారు. అనంతరం అల్మారాలో ఉంచిన రూ.22 లక్షలతో అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. చివరకు స్నేహ భర్త ఇషూతో పాటూ అతడి స్నేహితులైన రింకు, దీపక్, విశాంత్‌లను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

Atrocity on girlfriend: రాత్రి వేళ ఇంట్లోకి వచ్చిన ప్రియుడు, అతడి స్నేహితుడు.. కాసేపటికి యువతి కాళ్లు, చేతులు కట్టేసి మరీ..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Funny video: పెళ్లి పీటల మీదే ఇలా ఉంటే.. వివాహానంతరం వీళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో... videoSuspicious Women: ఆటో కోసం వేచి చూస్తున్న మహిళ.. పోలీసులకు అనుమానం వచ్చి.. ఆమె సూట్‌కేస్‌ను తెరచి చూడగా.. Dubai jobs scam: దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. పాకిస్థాన్‌కు పంపించిన ఏజెంట్.. 20ఏళ్ల తర్వాత వృద్ధురాలి పరిస్థితి ఏంటంటే.. drunk woman: యువకుడితో పాటూ ఫుల్‌గా మందుకొట్టిన మహిళ.. అదే సమయంలో పిల్లలు వీడియో తీయడంతో.. చివరకు..Marriage funny video: పాపం ఏ పెళ్లికూతురికీ రాని కష్టం వచ్చిందే.. పక్కనున్న వారంతా నవ్వుతుంటే.. చివరకు ఎలాగోలా.. videoShyam Rangeela: ఎవరీ శ్యామ్ రంగీలా.. సోషల్ మీడియాలో స్టార్ కమెడియన్ అయిన ఇతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..!
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.