Viral Video: పోట్లాడుకుంటున్న రెండు జింకలు.. మధ్యలో సడన్‌గా పులి ఎంట్రీ.. చివరకు ఏమైందో మీరే చూడండి

ABN , First Publish Date - 2022-03-05T01:49:16+05:30 IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రెండు జింకలు పోట్లాడుకుంటుండగా మధ్యలో ఓ పులి ఎంటరవుతుంది. వాటిని చూసి ఆవురావురుమంటూ తినడానికి వెళ్తుంది...

Viral Video: పోట్లాడుకుంటున్న రెండు జింకలు.. మధ్యలో సడన్‌గా పులి ఎంట్రీ.. చివరకు ఏమైందో మీరే చూడండి

టైం బాగోలేనప్పుడు కొన్నిసార్లు ఎంత పెద్ద బలవంతుడికైనా పరాభవం తప్పదు. కాలం కలిసిరానప్పుడు ఒక్కోసారి పిల్లి కూడా పులి అవొచ్చు. అలాగే పులి కూడా పిల్లి అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రెండు జింకలు పోట్లాడుకుంటుండగా మధ్యలో ఓ పులి ఎంటరవుతుంది. వాటిని చూసి ఆవురావురుమంటూ తినడానికి వెళ్తుంది. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ అడవిలో జింకలు మేత మేస్తూ ఉంటాయి. ఈ సమయంలో రెండు జింకల మధ్య పోరు మొదలవుతుంది. కొమ్ములతో ఒకదానికొకటి పోటాపోటీగా తలబడుతుంటాయి. ఈ పోరు జరుగుతుండగానే.. మధ్యలో ఓ పులి అక్కడకు ఎంటరవుతుంది. వెతకబోయే ఆహారం కాళ్ల దగ్గరికే వచ్చిందనుకుంటూ వాటి దగ్గరకు వెళ్తుంది. ఆ సమయంలో జింకల కొమ్ములు ఒకదానికొకటి మెలిపడిపోవడంతో విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. పులి మాత్రం వాటి మీద దాడి చేయాలని ముందు ప్రయత్నించినా.. తర్వాత కాస్త వెనకడుగు వేస్తుంది.

కాలువలో చేప కనపడిందని సంబరపడ్డారు.. కాసేపు ఆగాక చూసి ఖంగుతిన్నారు..


రెండు జింకల మధ్యలోకి వెళ్తే.. ఎక్కడ తనను కొమ్ములతో కుమ్మేస్తాయని అనుకుందో ఏమో గానీ.. ముందుకు ఒక అడుగు, వెనక్కు అడుగు వేస్తూ ఉంటుంది. సమీపంలోని కొన్ని జింకలు పులిని చూసి భయపడినా.. ఈ రెండు జింకలు మాత్రం వాటి పోరును మాత్రం ఆపవు. ఒకదానిని ఒకటి తోసుకుంటూ అటూ ఇటూ వెళ్తుంటాయి. పులి మాత్రం వేటాడటం అటుంచి.. ప్రేక్షక పాత్ర వహిస్తూ వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు చమత్కరిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

వామ్మో ఈ ఎద్దు ఎంత పని చేసింది.. యువకుడిపై ఇలా దాడి చేసిందేంటి.. చివరకు ఏమైందంటే..





Updated Date - 2022-03-05T01:49:16+05:30 IST