పుట్టిన రోజు సందర్భంగా ప్రియురాలిని ఇంటికి పిలిచాడు.. ప్రత్యేకంగా మాట్లాడాలంటూ గదిలోకి తీసుకెళ్లి..

Published: Sun, 24 Apr 2022 19:18:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పుట్టిన రోజు సందర్భంగా ప్రియురాలిని ఇంటికి పిలిచాడు.. ప్రత్యేకంగా మాట్లాడాలంటూ గదిలోకి తీసుకెళ్లి.. ప్రతీకాత్మక చిత్రం

తనను కాదన్నా ప్రియురాలి క్షేమం కోరే వారు.. నేటి సమాజంలో మచ్చుకైనా కానరావడం లేదు. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనే ధోరణిలో చాలా మంది దారుణాలకు పాల్పడడం రోజూ చూస్తూనే ఉన్నాం. కేరళలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. పుట్టిన రోజు ఉండడంతో ప్రియురాలిని ఇంటికి పిలిచాడు. ప్రత్యేకంగా మాట్లాడాలంటూ గదిలోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది...

కేరళలోని తిరువనంతపురం పాలక్కడ్ జిల్లాలోని  కొల్లెంగోడ్​ గ్రామానికి చెందిన బాలసుబ్రమణియం, స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇరు కుటుంబాల వారు మాత్రం వీరి పెళ్లికి నిరాకరించారు. అయినా బాలసుబ్రమణియం మాత్రం ఎలాగైనా ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం అతడి పుట్టిన రోజు కావడంతో వేడుకలు నిర్వహించి, తన ప్రియురాలిని కూడా ఆహ్వానించాడు.

ప్రియుడి కోసం భర్తను దూరం పెట్టింది... నాకు చేసినట్లు మరెవరికీ చేయొద్దంటూ భార్యకు లేఖ రాసిన భర్త..

యువతి రాగానే ప్రత్యేకంగా మాట్లాడాలంటూ ఆమెను వేరే గదికి తీసుకెళ్లాడు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ ఉన్నట్టుండి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటంబ సభ్యులు మంటలను ఆర్పేసి, ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. బాలసుబ్రమణియం తల్లి మాట్లాడుతూ.. ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నామని, అయితే తన కొడుకు ఎందుకు ఇలా చేశాడో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్నేహితుడితో కలిసి అత్త ఇంటికి వెళ్లిన యువకుడు.. దుస్తులు మార్చుకుని బయటికి వచ్చాడు.. స్థానికులకు అనుమానం వచ్చి వెళ్లి చూడగా..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

అరుదైన మేలు జాతి గుర్రాన్ని రూ.23 లక్షలకు కొనుగోలు చేశాడు.. ఇంటికెళ్లి స్నానం చేయించి చూస్తే..తండ్రి అంటే ఆ తొమ్మిది మంది కూతుళ్లకు ఎంతో అభిమానం.. అయితే అతను వారి పక్కన కూర్చుని చేసిన పనికి..పని నుంచి అలసిపోయి ఇంటికొచ్చిన భర్త.. బెడ్‌రూంలో ఎవరో ఉన్నట్లు అనుమానం వచ్చి.. తలుపు తీసి చూడగా..రాత్రి 10.30 గంటల సమయం.. రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ చివర ఓ ప్రేమజంట.. కానిస్టేబుల్ చూసి నిలదీస్తే..ఉద్యోగరీత్యా వేరు వేరు సిటీల్లో దంపతులు.. భార్య నివసిస్తున్న ఇంటి ఓనర్ భర్తకు ఫోన్ చేసి..కూతుర్ని బస్సు ఎక్కించి వచ్చిన తండ్రి.. ఇంట్లో నగ్నంగా వంట చేస్తున్న గుర్తు తెలియని మహిళను చూసి షాక్.. చివరకు..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.