నిధులు వాడుకోకపోతే ఎలా?

ABN , First Publish Date - 2022-01-25T04:52:13+05:30 IST

గ్రామ పంచాయతీలకు మం జూరు అయిన నిధులను వినియోగించుకోకపోతే ఎలా అని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి ప్రశ్నించా రు.

నిధులు వాడుకోకపోతే ఎలా?
మండల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

- పంచాయతీ కార్యదర్శులపై చర్యలు  

-  మండల సమావేశంలో 

  ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

కృష్ణ, జనవరి 24: గ్రామ పంచాయతీలకు మం జూరు అయిన నిధులను వినియోగించుకోకపోతే ఎలా అని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి ప్రశ్నించా రు. సోమవారం కృష్ణ మండల పరిషత్‌ కార్యాలయం లో ఎంపీపీ పూర్ణిమ అధ్యక్షతన  మండల సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మె ల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కృష్ణ మండలంలో 13గ్రామ పంచాయతీలో హిందూపూర్‌ రూ.88లక్షలు, ముడుమాల్‌లో రూ.40ల క్షలు, కృష్ణ జీపీలో రూ.5లక్షల నిధులు ఉన్నా ఎందు కు వాడుకోవడం లేదని ప్రశ్నించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పంచాయతీ కార్యదర్శులు తూతూ మంత్రంగా పని చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న నిధులు ఖర్చు చేస్తే, అవసర మైన నిధులు మంజూరు చేస్తామని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా సాకులు చెబుతున్నారన్నారు. ఇకపై ఇలాంటివి చేయకుండా గ్రామాల్లో సీసీ రోడ్లు, క్రమా టోరియం, వైకుంఠధామాలు, ఇంకుడు గుంతలు, ప్ర భుత్వ పాఠశాలలో కిటికీలు, తలుపులు, రంగులు, అంగన్‌వాడీ భవనం, డ్రైనేజీలు నిర్మించుకోవాలన్నారు.   పని చేయని పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళా సంఘాల కు రుణాలు పంపిణీ చేసే సమయల్లో స్థానిక ప్ర జాప్రతినిధులు హాజరయ్యే విధంగా చూడాలని కోరా రు. వచ్చే సర్వసభ్య సమావేశంలో ప్రతీ శాఖల అధి కారులు పూర్తిస్థాయిలో నివేదికలను తయారు చేసుకు ని రావాలని ఆదేశించారు. అంతకు ముందు రైతు వేదిక భవనాలల్లో 37కల్యాణలక్ష్మి,  షాదీముబా రక్‌ చెక్కులు పంపిణీ చేశారు. సమావేశంలో జడ్పీ టీసీ సభ్యురాలు అంజనమ్మపాటిల్‌, ఎంపీడీవో శ్రీని వాస్‌,  సర్పంచులు లక్ష్మీనారాయణగౌడ్‌, శివప్ప, రామ కృష్ణ, దేవేంద్రప్ప, విజయలక్ష్మి, తాయమ్మ, ఎంపీటీసీ సభ్యు లు, విద్యుత్‌, విద్య, వ్యవసాయ, ఐసీడీఎస్‌, ఉపాధి హామీ పథకం అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T04:52:13+05:30 IST