యూరియా పెరిగితే?

ABN , First Publish Date - 2022-02-08T05:30:00+05:30 IST

ప్రతి ఒక్కరి రక్తంలో యూరియా ఉంటుంది. అయితే శరీరంలోని

యూరియా పెరిగితే?

ప్రతి ఒక్కరి రక్తంలో యూరియా ఉంటుంది. అయితే శరీరంలోని నిర్దిష్ట ప్రదేశంలో పనితీరు క్రమం తప్పడం మూలంగా రక్తంలోని అధిక యూరియాను శరీరం తొలగించలేకపోతూ ఉంటుంది. దాంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ ఇబ్బందులను తొలగించాలంటే యూరియా ప్రభావాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. 


రక్తంలో యూరియా స్థాయి పెరిగితే మూత్రపిండాలు, ఇతర అంతర్గత అవయవాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఫలితంగా హార్ట్‌ ఫెయిల్యూర్‌, మూత్రసంబంధ సమస్యలు, వాంతులు, పల్చని విరేచనాలు, మధుమేహం వేధిస్తాయి. ఇదే పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే తీరని దాహం, ఒంట్లో నీరు నిల్వ ఉండిపోవడం, తలనొప్పి, నీరసం, తలతిరుగుడు, పొట్టలో నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఇబ్బందులను తొలగించాలంటే రక్తంలో యూరియా స్థాయిని నియంత్రించాలి.


మూలిక ఔషధాలు

మూత్రక్రిచంతక చూర్ణం, పునర్నవ మందుర్‌, వరుణాధి వటి లాంటివి యూరియా వల్ల పెరిగిన  మూత్రపిండాల మీది ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్తంలోని యూరియాను తగ్గించి, మూత్ర వ్యవస్థ పనితీరును సరి చేస్తాయి.


పునర్నవ: పున, నవ అనే రెండు పదాల నుంచి పునర్నవ జనించింది. పున అంటే మళ్లీ అనీ, నవ అంటే కలిసి అనీ అర్థం. రెండు ఔషధాలు కలిసి మూత్ర వ్యవస్థ పనితీరును మెరుగు చేస్తాయని చెప్పడమే ఈ మందు పేరు వెనక ఉన్న ఉద్దేశం. ఈ ఔషధం మూత్రపిండాల్లో నిల్వ ఉండిపోయిన అత్యధిక ద్రవాలను బయటకు వెళ్లగొట్టి, మూత్రపిండాల వాపును తగ్గిస్తుంది. ఈ ఔషధానికి ఎటువంటి దుష్ప్పభావాలూ ఉండవు.


వరుణ: మూత్ర పిండాల్లోని సూక్ష్మ రాళ్లను విరగ్గొట్టి మూత్రం ద్వారా బయటకు వెళ్లగొట్టే శక్తి ఈ ఔషఽధానికి ఉంది. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లను కూడా ఈ మందు నయం చేయగలదు. మూత్రనాళంలో పేరుకుపోయి మూత్రవిసర్జనకు ఆటంకంగా మారిన అంశాలను బయటకు వెళ్లగొట్టగలదు. మూత్రపిండాల వాపు, నొప్పులను కూడా నయం చేయగలదు. 


గోషుర: మూత్రపిండాల్లో బలహీనపడిన కణాలకు కొత్త జీవం అందిస్తుంది. కొత్త కణాల పుట్టుకకు తోడ్పడుతుంది. 


హైగ్రోఫిలియా ఆరిక్యులేటా: రక్తంలో పెరిగిన యూరిక్‌ ఆమ్లాన్ని తగ్గించే ఔషధమిది. ఈ ఔషధాలతో పాటు ఆహారంలో మాంసకృత్తుల స్థాయిని తగ్గించి, ఎక్కువగా ద్రవాహారం తీసుకుంటూ మర్దన, యోగాసనాలను అనుసరించాలి. 


Updated Date - 2022-02-08T05:30:00+05:30 IST