పొట్ట కొవ్వు తగ్గించే డైట్‌ ఏది?

ABN , First Publish Date - 2022-06-14T16:36:43+05:30 IST

బరువు తగ్గడం కోసం వ్యాయామం చేయడం, సమతులాహారం తీసుకోవడం, సరిపడా నీళ్లు తాగడంతోనే సరిపెట్టుకోకూడదు. బరువు తగ్గడానికి అవరోధంగా నిలిచే పదార్థాల గురించి తెలుసుకుని, వాటికి దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా పొట్ట కొవ్వు కరగడం కోసం, బ్రెడ్‌ లాంటి ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాలి...

పొట్ట కొవ్వు తగ్గించే డైట్‌ ఏది?

బరువు తగ్గడం కోసం వ్యాయామం చేయడం, సమతులాహారం తీసుకోవడం, సరిపడా నీళ్లు తాగడంతోనే సరిపెట్టుకోకూడదు. బరువు తగ్గడానికి అవరోధంగా నిలిచే పదార్థాల గురించి తెలుసుకుని, వాటికి దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా పొట్ట కొవ్వు కరగడం కోసం, బ్రెడ్‌ లాంటి ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాలి.


ఎన్‌రిచ్‌డ్‌ బ్రెడ్‌... 

వద్దుపొట్ట దగ్గరి కొవ్వు కరగాలంటే, రిఫైన్డ్‌ కార్బ్స్‌ తినడం మానేయాలి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడంతో పాటు, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ కూడా పెరుగుతుంది. బజార్లో మనకు వైట్‌ బ్రెడ్‌తో పాటు, ఎన్‌రిచ్‌డ్‌ బ్రెడ్స్‌ కూడా దొరుకుతున్నాయి. ఇవన్నీ రిఫైనింగ్‌ ప్రాసె్‌సను ముగించుకున్న తర్వాతే మార్కెట్లోకి అడుగు పెడతాయి.ఈ రిఫైనింగ్‌ ప్రక్రియలో భాగంగా వీటి నుంచి ప్రయోజనకరమైన పీచు, పోషకాలను తొలగించి, సింథటిక్‌ రూపంలోని పోషకాలను జోడించడం జరుగుతుంది. కాబట్టి బ్రెడ్‌ను కొనే సమయంలో, ప్యాకెట్ల మీద ‘ఎన్‌రిచ్‌డ్‌’ అనే పదం కోసం వెతికి, ఆ కోవకు చెందిన బ్రెడ్స్‌ను కొనడం మానుకోండి. వీటికి బదులుగా హోల్‌ వీట్‌ లేదా హోల్‌ గ్రెయిన్‌ బ్రెడ్స్‌ను ఎంచుకోండి. 


మరికొన్ని మెలకువలు

పొట్ట దగ్గరి మొండి కొవ్వు కరగాలంటే, రిఫైన్డ్‌ కార్బ్స్‌ను వదిలి, హోల్‌ గ్రెయిన్స్‌ను ఎంచుకోవడంతో పాటు, లీన్‌ ప్రొటీన్‌ను కూడా తీసుకోవాలి. ఈ రకం ప్రొటీన్‌తో మెటబాలిజం పెరగడంతో పాటు, ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంటుంది. మెటబాలిజం పెరగడం వల్ల బరువు తగ్గడంతో పాటు, ఆకలి తగ్గడం వల్ల క్యాలరీలు, చక్కెరలతో నిండిన చిరుతిళ్లకు దూరంగా ఉండగలుగుతాం. అతి తక్కువ క్యాలరీలతో, అత్యంత నిష్ఠగా డైటింగ్‌ చేయడంతో ఒరిగే ప్రయోజనం కంటే, ప్రతిరోజూ క్రమం తప్పకుండా సరిపడా లీన్‌ ప్రొటీన్‌ తినడం దక్కే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఇలా నిష్ఠగా చేసే డైట్లు దీర్ఘకాలం పాటు కొనసాగించడానికి వీలుగా ఉండదు. దాంతో డైట్‌ను ఆపిన వెంటనే తిరిగి బరువు పెరగడం మొదలుపెడతాం. కాబట్టి లేత కోడి మాంసం, చేపలు, నట్స్‌, గుడ్లు, కొవ్వు తక్కువగా ఉండే కాటేజ్‌ చీజ్‌, గ్రీక్‌ యోగర్ట్‌, షియా విత్తనాలు, పప్పుధాన్యాలు, క్వినోవా తీసుకోవాలి. బ్రెడ్స్‌కు బదులుగా ఈ తరహా లీన్‌ ప్రొటీన్‌కు అలవాటు పడితే, పొట్ట దగ్గరి కొవ్వు తగ్గి,  సన్నబడతాం. 

Updated Date - 2022-06-14T16:36:43+05:30 IST