పరిహారం జాడేది?

ABN , First Publish Date - 2021-09-18T04:38:31+05:30 IST

ప్రకృతి పగబట్టడంతో రైతులు కుదేలవుతున్నారు. వ్యవసాయాన్ని

పరిహారం జాడేది?

  • ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతింటున్న పంటలు 
  • రైతులకు అందని నష్ట పరిహారం
  • ఏళ్ల తరబడి ఎదురుచూపులు 
  • నివేదికలకే పరిమితమవుతున్న అంచనాలు


ప్రకృతి పగబట్టడంతో రైతులు కుదేలవుతున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని పంటలు సాగు చేస్తున్న అన్నదాతలు అతివృష్టి, అనావృష్టిలతో తీవ్రంగా నష్టపోతున్నారు. భారీ వర్షాలకు పంట తీవ్రంగా నష్టపోయిన వారికి పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. కేవలం సర్వేలకే పరిమితమైన అధికారులు పరిహారం చెల్లించడంలో శ్రద్ధ వహించడం లేదు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : అతివృష్టి, అనావృష్టిలతో పంటలు తీవ్రంగా దెబ్బతింటు న్నాయి. పంటలకు నష్టం జరిగిన ప్పుడు అధికారులు, నాయకులు వచ్చి పరిశీలించి.. పరిహారం అం దించేందుకు చర్యలు తీసుకుంటామని హామీలు ఇస్తున్నారు. కానీ, రైతులకు పరి హారం అందించడంలో విఫలమవుతున్నారు. ఏటా పంటలకు నష్టం వాటిల్లుతున్నప్పటికీ వ్యవసాయ అధికారులు పొలాల వద్దకు వెళ్లడం.. అంచనాలు రూపొందించి ప్రభు త్వానికి నివేదించడం జరుగుతుంది. అయితే నష్టపరిహారం అందించడంలో మాత్రం ప్రభు త్వాలు శ్రద్ధచూపడం లేదు. తొమ్మిదేళ్లుగా పం టల నష్టపరిహారం అందిన దాఖలాలు లేవు. ఫలితంగా రైతులకు కన్నీరే మిగులుతోంది. ఏళ్లతరబడి పంట నష్టపరిహారం అందక అవ స్థలు పడుతున్నారు. పరిహారం అందక పోతుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాది భారీ వర్షాలకు నీట మునిగిన ఇళ్లకు రూ. 10 వేల చొప్పున అందించిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతన్నకు పరిహారం చెల్లించడానికి మాత్రం వెనుకాడుతుంది. అతివృష్టి అనా వృష్టితో వ్యవసాయ పంటలతోపాటు దెబ్బతిన్న ఉద్యాన పంటలకు ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ పరిహారం అందలేదు. రెండేళ్లుగా పంటలకు బీమా సౌకర్యం కల్పించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పంట లతోపాటు ఉద్యాన పంటలు కూడా అతివృష్టి, అనావృష్టి కారణంగా దెబ్బతిన్నాయి. జిల్లాలో మొత్తం రూ.166 కోట్లు పరిహారం ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది. 


వ్యవసాయ పంటలకు రూ .144కోట్ల నష్టం

గతేడాది కురిసిన భారీ వర్షాలకు వరి, పత్తి, కంది, మొక్కజొన్న, జొన్న, చెరుకు సాగు చేసిన 1,02,875 మంది రైతులు 1,44,097.38 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అంచనా వేస్తే.. రూ.144 కోట్ల పంట నష్టం జరిగనట్లు తెలుస్తోంది. 


ఉద్యాన పంటల నష్టం రూ.22 కోట్లు

భారీ వర్షాలకు ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2015 సంవత్సరం నుంచి 2020 వరకు 35,797 మంది రైతుల పూలు, పండ్లు, కూరగాయ పంటలు 17,010.53 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. 2013 సంవత్సరంలో డ్రాట్‌ కారణంగా 8,645 రైతులు 3,436.75 ఎకరాలు రూ.465.330 నష్టం జరిగినట్లు అధికారులు అంచనాలు తయారు చేశారు. 2013 నుంచి 2020 వరకు జరిగిన  పంట నష్టానికి సంబం ధించి మండల స్థాయిలో రెవెన్యూ అధికారులు, ఉద్యానశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్య టించి నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభు త్వానికి నివేదించారు. కానీ.. ఇప్పటివరకు పైసా పరిహారం విడుదలైన దాఖలాలు లేవు. 


నివేదికలకే పరిమితం

జిల్లాలో ప్రతీ సీజన్‌లో ప్రకృతి వైపరీత్యా లకు పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. భారీ వర్షాలు వడగళ్లకు పంటలు దెబ్బతిన్నప్పుడు వ్యవ సాయాధికా రులు పంట పొలాలకు వెళ్లి సర్వేలు చేపట్టి కాగితాల్లో లెక్కిస్తున్నారు. సుమారు తొమ్మిదేళ్ల నుంచి నష్టం జరుగు తూనే ఉంది. అంచనాలు తయారు చేస్తు న్నారు.. ప్రభుత్వానికి నివేదిస్తు న్నారు. కానీ.. పంట నష్టపరిహారం మాత్రం ఇవ్వడం లేదు. రైతుల పంటలకై ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నట్లు చెబుతున్నా... పంట నష్టపరిహారంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తు న్నాయని రైతుల సంఘాలు మండిపడుతున్నాయి. 


తొలగించిన బీమా పథకాలు

జిల్లాలో 80 శాతం ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. ఏటా రైతన్నలను అతివృష్టి అనా వృష్టి వెంటాడుతూ వస్తోంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల కోసం బీమా పథకాలను గతేడాది తొలగించింది. దీంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. 


ప్రభుత్వానికి నివేదించాం..

తీవ్ర వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు, జరిగిన నష్టానికి సంబంధించి అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించామని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, ఉద్యానశాఖ అధికారి సునందరాణి తెలిపారు. ప్రభుత్వం నుంచి పరిహారం డబ్బులు రాగానే రైతులకు అందజేస్తామని చెప్పారు.


చేతకాని ప్రభుత్వాలు

కష్ట పడిన రైతులకు ఏటా కన్నీళ్లే మిగులు తున్నాయి. అతివృష్టి అనావృష్టితో పంటలు కోల్పో తున్న రైతులకు పరిహారం ఇవ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. పరిహారం అంది వ్వని చేతకానీ.. సీఎం కేసీఆర్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. లేదా పరిహారం అందివ్వాలి.

- చల్లా నర్సింహారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు 


పరిహారం అందివ్వాలి..

ప్రభుత్వం పరిహారం అందివ్వాలి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈసారి కూడా మొక్కజొన్న రెండు ఎకరాల్లో సాగు చేశాను. వర్షానికి పాడవటంతో పంటను పూర్తిగా దున్నేశాను. దీంతో రూ.40వేల వరకు పెట్టుబడిని నష్టపోయాను.

- వడ్ల లింగాచారి, రైతు, మల్కాపూర్‌


దెబ్బతిన్న పత్తి పంట 

వర్షాలు విస్తారంగా కురువడంతో పత్తి పంట అంతా నీరుపట్టింది. దీంతో పత్తి మొక్కలు పైకి ఎదగడం లేదు. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి అందే పరిస్థితి లేదు. చాలామంది రైతుల పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. రెండో పంట వేసుకునేందుకు పొలాలను సాగు చేస్తున్నాను.

- గోపాల్‌రెడ్డి, రైతు, మల్కాపూర్‌

---------------------------------------

2020లో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు

పంట నష్టం (ఎకరాల్లో)

వరి 30394.18

పత్తి 105201.2

కందులు 6798

మొక్కజొన్న 1,503

జొన్న 192

చెరుకు 09

మొత్తం 1,44,097.38

నష్టం అంచనా 144,09,70,000 

రైతులు 1,02,875మంది

-------------------------------------------

పంటల నష్టం వివరాలు

రైతుల నష్టం అంచనా

సంఖ్య (హెక్టార్లు) (లక్షల్లో)

2013-అక్టోబర్‌- అధిక వర్షాలు 12,942 4,695.63 469.731

2015- డ్రాట్‌ 8,645 3,436.75 465.330

2016-ఎప్రిల్‌,మే-అధిక వర్షాలు 788 413.56 66.365

2016-సెప్టెంబర్‌, అక్టోబర్‌ అధిక వర్షాలు 12,216 7,182.87 969.681

2018-ఎప్రిల్‌,మే-అధిక వర్షాలు 830 920.68 159.653

2020-ఎప్రిల్‌,మే-అధిక వర్షాలు 240 238.72 41.23

2020-అక్టోబరు-అధిక వర్షాలు 136 123.32 16.64

మొత్తం 35,797 17,011.53 2,188.630

Updated Date - 2021-09-18T04:38:31+05:30 IST