పంట పరిహారమేదీ?

ABN , First Publish Date - 2022-05-02T05:19:18+05:30 IST

జిల్లా లో రైతులు నాసిరకం వి త్తనాలు, ఎరువులతో పాటు ప్రకృతి వైప రీత్యాల కారణం గా తల్లడిల్లిపోతున్నారు. ప్రతీ ఏటా ఖరీఫ్‌, ర బీ సీజన్లలో పంటలను సా గు చేస్తున్న రైతు కు పూర్తిస్థాయి గి ట్టుబాటు లభించకపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. నాలుగైదు సంవత్సరాల నుంచి జిల్లా రైతుల పరిస్థితి అడ కత్తెరలో పోకల మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ ఏటా అకాల వర్షాలు, ఈదురు గాలులతో పంటలకు నష్టం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నష్టపోయిన పంటలకు పరిహా రం విషయంలో దోబూచులాడుతోందన్న విమర్శలున్నాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన పంట నష్టంపై రెవెన్యూ, వ్యవసా య శాఖలు ఆగమేఘాల మీద క్షేత్రస్థాయిలో సర్వే చేసి అంచనా నష్టాన్ని లె క్కిస్తూ ఆ లెక్కలను సర్కారుకు నివేదిస్తున్నా రు. నష్టపోయిన పంటలకు సంబంధించి మాత్రం రైతుల కు పరిహారం అందించడం లేదు.

పంట పరిహారమేదీ?
అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలు (ఫైల్‌)

నాసిరకం సోయా విత్తనాల వ్యవహారంపై చర్యలు కరువు 

కంపెనీలకు నోటీసులిచ్చి వదిలేసిన అధికారులు 

ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన నష్టంపై ఊసేలేదు 

కూరగాయల పంటలకు లేని ప్రోత్సాహం 

ప్రణాళికలు లోపించిన ఉద్యానవన శాఖ 

నిర్మల్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా లో రైతులు నాసిరకం వి త్తనాలు, ఎరువులతో పాటు ప్రకృతి వైప రీత్యాల కారణం గా తల్లడిల్లిపోతున్నారు. ప్రతీ ఏటా ఖరీఫ్‌, ర బీ సీజన్లలో పంటలను సా గు చేస్తున్న రైతు కు పూర్తిస్థాయి గి ట్టుబాటు లభించకపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. నాలుగైదు సంవత్సరాల నుంచి జిల్లా రైతుల పరిస్థితి అడ కత్తెరలో పోకల మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ ఏటా అకాల వర్షాలు, ఈదురు గాలులతో పంటలకు నష్టం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నష్టపోయిన పంటలకు పరిహా రం విషయంలో దోబూచులాడుతోందన్న విమర్శలున్నాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన పంట నష్టంపై రెవెన్యూ, వ్యవసా య శాఖలు ఆగమేఘాల మీద క్షేత్రస్థాయిలో సర్వే చేసి అంచనా నష్టాన్ని లె క్కిస్తూ ఆ లెక్కలను సర్కారుకు నివేదిస్తున్నా రు. నష్టపోయిన పంటలకు సంబంధించి మాత్రం రైతుల కు పరిహారం అందించడం లేదు. నాలుగైదు సంవత్సరాల నుంచి ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో ఇలా ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరుగుతున్న పంట నష్టానికి చిల్లిగవ్వ కూడా పరిహారం రూపంలో అందలేదు. గత ఏడాది క్రితం ముథోల్‌ నియోజకవర్గంలో నాసిరకం సోయాబీన్‌ విత్తనాల కారణంగా రైతులు పెద్దమొత్తంలో పంటలు నష్టపోయారు. నాసిరకం విత్తనాల వ్యాపారులు, కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు ఆందో  ళనలు చేశారు. రైతుల ఆందోళనలకు స్పందించిన అధికారులు ఆ విత్తనాలను సరఫరా చేసిన కంపెనీలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుందే తప్పా రైతులకు చిల్లి గవ్వ పరిహారం చెల్లించలేదు. జిల్లా లో సంప్రదాయ పంటలకే రైతులు మొగ్గు చూపుతుండగా, అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను ఆశించిన మేరకు ప్రోత్సాహించడం లేదంటున్నారు. పుష్కలంగా సాగునీటి వనరులు జి ల్లాలో అందుబాటులో ఉన్నా ఉద్యానవన శాఖ కూరగాయలు, పండ్ల మొ క్కల సాగును ఆశించిన రీతిలో ప్రోత్సాహించడం లేదన్న విమర్శలున్నా యి. నాలుగైదు సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని పంట చేనుల ను కోతులు, అడవి పందులు నష్టాల పాలు చేస్తున్నాయి. కోతులు, అడ వి పందుల దాడులకు తట్టుకోలేక కొంతమంది రైతులు పంటల సాగుకు స్వస్థి పలికిన సంఘటనలున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు అప్పు ల బాధలతో ఐదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీ వ్రతకు అద్దం పడుతోందంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి నిర్మల్‌ జిల్లా కేం ద్రంలో సోమవారం పర్యటిస్తుండడమే కాకుండా ఆదిలాబాద్‌, నిర్మల్‌ జి ల్లా అధికారులతో నిర్వహించనున్న సమీక్ష సమావేశం రైతుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపిస్తుందో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

సోయాబీన్‌ పరిహారంపై స్పందన ఏదీ? 

కొద్దిరోజుల క్రితం జిల్లాలోని ముథోల్‌ నియోజకవర్గంలో రై తులు దాదాపు 32 వేల ఎకరాల్లో సాగు చేసిన సోయాబీన్‌ పం ట పూర్తిగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నష్టానికి ప్రఽధా న కారణం నాసిరకం విత్తనాలేనని సంబంధిత అధికారులు ని ర్ధారించారు. ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై నామమాత్రపు చర్యలు తీసుకున్నప్పటికీ రైతులకు పరిహారాన్ని అందించలేకపోయారు. పలుసార్లు ఆందోళనలు చేసినా స్పందన లేదని బాఽధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రాధాన్యతను సంతరించుకోనున్న మంత్రి పర్యటన..

జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సోమవారం పర్యటన ప్రాధాన్యతను సంతరించుకోబోతోంది. కొన్ని సంవత్సరాల నుంచి జిల్లాలో పేరుకుపోయిన రైతుల సమస్యల పరిష్కారానికి మంత్రి పర్యటన తోడ్పాడాలని కోరుతున్నారు. ముఖ్యంగా నష్టపరిహారంతో పాటు రుణమాఫీ, వన్య మృగాల నుంచి పంటలను కాపాడేందు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన వంటి అంశాలపై సమావేశంలో సమీక్ష జరిగితే రైతులకు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. మొదటి నుంచి వ్యవసాయ సమస్యలపై అప్పటికప్పుడే స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్న మంత్రి నిరంజన్‌ రెడ్డి జిల్లా వ్యవసాయ సమస్యలకు దిశా నిర్దేశం చూపుతారన్న ఆశాభాశాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.

ప్రకృతి వైపరీత్యాలపై నష్ట పరిహారం శూన్యం..

ఏటా అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా జరుగుతున్న పం టల నష్టానికి ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారాన్ని అందించడం లేదు. పంట నష్టం జరగగానే అఽధికారులు ఉరుకులు, పరుగులపై వచ్చి సర్వే లు చేయడం, నష్టం అంచనాలన్నీ లెక్క గట్టడం సంప్రదాయంగా మారుతోంది. నష్టానికి మాత్రం ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా అందించలేదన్న విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు బాధిత రైతులను మాట వరుస ఓదార్పులతో ఊరడిస్తున్నారే తప్పా పరిహారం విషయంలో ఆశించిన రీతిలో స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. 

అడవి పందులు, కోతుల నుంచి పంటలకు రక్షణేదీ?

గ్రామీణ ప్రాంతాల్లో అడవి పందులు, కోతులు పంటలను నష్టపరుస్తున్నాయి. ప్రతిరోజూ రైతులు తమ పంటలను వీటి నుంచి కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. రాత్రివేళల్లో పంటలపై దాడి చేసి నాశ నం చేస్తున్నాయి. ప్రభుత్వం, సంబంధిత శాఖలు ఇప్పటి వరకు పంట నష్ట పరిహారంపై నోరు మెదపకపోవడం బాఽధిత రైతాంగాన్ని ఆగ్రహానికి గురి చేస్తోందంటున్నారు.

Updated Date - 2022-05-02T05:19:18+05:30 IST