అభివృద్ధి ఏది ?

ABN , First Publish Date - 2022-05-21T06:43:22+05:30 IST

ఒక అడుగు ముందుకు.. ఏడడుగుల వెనక్కు అన్న చందంగా మారింది బాసర సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ది తీరు. రాష్ట్రంలోని ప్రసిద్ద దేవాలయాల్లో ఒకటైన ఈ క్షేత్రం అభివృద్ది మాత్రం నీటిమీద రాతలా మారింది.

అభివృద్ధి ఏది ?
ఉత్సవాల రోజుల్లో ఇదీ భక్తుల పరిస్థితి ... క్యూ కాంప్లెక్స్‌ లేక రోడ్డుపై వేచి చూస్తున్న భక్తులు

అభివృద్ధికి నోచుకోని బాసర పుణ్యక్షేత్రం

ఏళ్లు గడుస్తున్నా అమలు కాని మాస్టర్‌ ప్లాన్‌ 

నేతల హామీలెక్కువ  .. పనులు తక్కువ.. 

ఎనిమిదేళ్లుగా భర్తీకి నోచుకోని ఆలయ ఈవో, ఇంజనీరింగ్‌ పోస్టులు 

భక్తులకు తాగేందుకు మంచినీరూ కరువే..!

బాసర, మే 20 : ఒక అడుగు ముందుకు.. ఏడడుగుల వెనక్కు అన్న చందంగా మారింది బాసర సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ది తీరు. రాష్ట్రంలోని ప్రసిద్ద దేవాలయాల్లో ఒకటైన ఈ క్షేత్రం అభివృద్ది మాత్రం నీటిమీద రాతలా మారింది. ఏళ్లు గడు స్తున్నా అమ్మవారి నిలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఎనిమిదేళ్లుగా అది గో ఇదిగో అంటూ నేతలు హామీలి స్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. రాష్ట్రంలో మిగితా పుణ్యక్షేత్రాల్లో అభివృది జరుగుతుంటే సాక్షాత్తు దేవాదాయశాఖ మంత్రి జిల్లా ఇలాకాలోని అమ్మవారి ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవడంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం... 

దేశంలోని రెండు ప్రాచీన సరస్వతి దేవాలయాల్లో బాసర ఒకటి. మ రొకటి కశ్మీర్‌లో ఉంది. అందరికీ అందుబాటులో ఉన్న బాసర అమ్మ వారిని దర్శించుకునేందుకు తెలుగు రెండు రాష్ట్రాలు, మహారాష్ట్ర నలు మూలల నుండి భక్తులు వస్తుంటారు. ఒకరకంగా చెప్పాలంటే పిల్లలు బడికి వెళ్లాలంటే ముందుగా  ఓనమాలు దిద్దేందుకు బాసర అమ్మవారి చెంతకు వస్తారు. ఇకపరీక్షల సమయంలో, ప్రతీయేటా చదువుల మాతను ద ర్శించుకునే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రద్దీకి అనుగుణంగా మాత్రం ఇక్కడ వసతిసౌకర్యాలు పెరగడం లేదు. 20 సంవత్సరాల క్రిందట ఉన్న సదుపాయాలే.. ఇప్పటికీ అవే భక్తుల అవసరాలను తీర్చుతున్నాయి. కొత్తగా ఒకటి, రెండు తప్ప చెప్పుకోదగ్గ స్థాయిలో బాసరలో అభివృద్ధి జరగలేదు. కనీసం తాగేందుకు నీరు దొరకని పరిస్థితి ఉందంటే ఇక్కడ భక్తుల కష్టాలు ఏమిటో అర్థం చేసు కోవచ్చు. గదులకోసం, నీటికోసం క్యూలైన్లలో అసౌకర్యాలు, ఇరుకైన ఆలయం, క్యూకాంప్లెక్స్‌ లేక ఇలా ప్రతీచోట భక్తులు వసతులు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రద్దీదినాల్లో, ఉత్సవాల రోజుల్లో ఇక భక్తులకష్టాలు వర్ణనాతీతం. చిన్నపిల్లలతో భక్తులు పడే ఇబ్బం దులు అనేకం. 


ఏళ్లుగా.. ఇన్‌చార్జీ అధికారులే దిక్కు 

అభివృద్ది మాట దేవుడెరుగుగాని కనీసం బాసర ఆలయంలో ఖాళీ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. జిల్లాలో దేవాదాయశాఖ మంత్రి  ఉన్నప్పటికీ అమ్మవారి ఆలయంలో భక్తులకు ఇన్‌చార్జీ అధికారులే దిక్క వుతున్నారు. దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేసే వినోద్‌ రెడ్డికి బాసర ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదే విధం గా ఇంజనీర్‌ విభాగంలోని డీఈ, ఏఈ పోస్టుల్లో కూడా ఇన్‌చార్జీ అధి కారులే కొనసాగుతున్నారు. ఏఈవో పోస్టు ఖాళీగా ఉంది. పరిపాలనలో కీలకంగా ఉన్న ఈ ఉన్నతాధికారుల పోస్టుల్లో భర్తీకి నోచుకోకపోవడం బాసర అభివృద్దికి, భక్తుల సమస్యల పరిష్కారానికి ఆటంకంగా మారిం ది. ఇక ఇంచార్జీ అధికారుల పాలన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్ప నక్కర్లేదు. తప్పనిసరి అయితే తప్ప కార్యాలయంలో కనిపించే పరిస్థితి లేదు. 

హామీలెక్కువ.. అమలు తక్కువ

ప్రత్యేకరాష్ట్రం ఏర్పడగానే, అందులో జిల్లాకు దేవాదాయశాఖ మంత్రి ఉండడంతో బాసర అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. ప్రజలు అను కున్నట్లుగానే నాయకులు కూడా హామీలివ్వడం ప్రారంభించారు. దేవా దాయశాఖ మంత్రి బాసర వచ్చినప్పుడల్లా అనేక సందర్భాల్లో బాసరను యదాద్రి తరహాలో అభివృద్ది చేస్తామని త్వరలోనే సీఎం బాసరకు వస్తారని చెప్పారు. 2018 ఫిబ్రవరి నెలలో జరిగిన ఆదిలాబాద్‌ సభలో బాసరపుణ్యక్షేత్ర అభివృద్దికి రూ.50కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఆ నిధులు ఇప్పటి వ రకు బాసరకు చేరుకోలేదు. ఇలా ప్రతి సందర్భంలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు నాయ కులు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. 

ఎన్నికల హామీగా మిగిలిపోతుంది 

బాసర అభివృద్ది గురించి ముఖ్యమంత్రి గత ఎన్నికల కంటే ముందు ఆదిలాబాద్‌ సభలో హమీ ఇచ్చారు. రూ. 50 కోట్లు ఇస్తున్నట్లు ప్రక టించారు. ఇప్పటి వరకు ఒక్కపైసా రాలేదు. ఇక దేవాదాయశాఖ మంత్రి, ఇతర నాయకులు అనేక సార్లు బాసరకు వచ్చినప్పుడు అమ్మ వారి సాక్షిగా ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు జరగడం లేదు. ప్రతీ ఎన్నికల సమయంలో బాసర అభివృద్ధిపై హామీలిస్తూ ఆ తర్వాత మరిచిపోతున్నారు. ఇది ఎన్నికల హామీగా మిగిలిపోతుంది. 

సాయినాథ్‌, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి

మంత్రి ఇలాకాలో అభివృద్ధి జరగకపోవడం బాధాకరం 

జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రిగా రెండుసార్లు అయ్యారు. ఐదేళ్లుగా బాసర ఆలయానికి రెగ్యులర్‌ అధికారులు నియామకం జరగడం లేదు. రాష్ట్రంలో యాదాద్రితో పాటు ఽధర్మపురి, వేములవాడ వంటి ఆలయాల వద్ద అభివృద్ది జరుగుతుంటే మంత్రి స్వంత జిల్లాలోని బాసర అభివృద్దికి నోచుకోకపోవడం బాధాకరం. 

Updated Date - 2022-05-21T06:43:22+05:30 IST