కొవిడ్ సమయంలో వేలం ఏంటి: హైకోర్టు

Jun 15 2021 @ 15:50PM

అమరావతి: కొవిడ్ సమయంలో వేలం ఏంటని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ఏపీలో దేవాదాయ భూములను బహిరంగ వేలం వేయాలన్న ఆదేశాలు సవాల్‌ చేస్తూ ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. కొవిడ్, కర్ఫ్యూ ఉండగా ఎలా బహిరంగ వేలం నిర్వహిస్తారని ప్రశ్నించింది. వేలం కోసం కృష్ణా జిల్లా పెద్ద కళ్లెపల్లిలో ఆలయం పిలిచిన టెండర్ ఆదేశాలు హైకోర్టు రద్దు చేసింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా తదుపరి విచారణ జులై7కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.