కుక్కకాటుకు గురైన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Published: Fri, 25 Mar 2022 14:07:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కుక్కకాటుకు గురైన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ఆంధ్రజ్యోతి(25-03-2022)

ప్రశ్న: కుక్కకాటుకు గురైన తర్వాత యాంటీరేబిస్‌ వ్యాక్సిన్‌ తీసుకునే సమయంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? ఎన్ని రోజులు పాటించాలి? వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకూ మాంసాహారానికి దూరంగా ఉండాలా? 


- షమీమ్‌, అనంతపూర్‌


డాక్టర్ సమాధానం: యాంటీరేబిస్‌ వ్యాక్సిన్‌ తీసుకునే సమయంలో, తీసుకున్న కొద్ది  రోజుల వరకు వివిధ రకాల ఆహారం మానెయ్యాలనేది అపోహ మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయాధారాలు లేవు. సాధారణంగా ఆరోగ్యం కోసం ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వ్యాక్సిన్‌ తీసుకునేప్పుడు కూడా అవే పాటించాలి. వివిధ రకాల ధాన్యాలు, పప్పులు, ప్రోటీన్‌ కోసం మాంసాహారం, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, అన్ని రకాల కూరగాయలు, పండ్లు తినవచ్చు. ఎక్కువ నూనెలో వండినవి, ఫాస్ట్‌ ఫుడ్స్‌, బేకరీఫుడ్స్‌, స్వీట్లు, చాక్‌లెట్లు మొదలైనవన్నీ మితంగా తీసుకోవడం లేదా మానెయ్యడం మంచిది. ఫిల్టర్‌ చేసిన లేదా కాచిచల్లార్చిన నీటిని తీసుకోవాలి. వ్యాక్సిన్‌ ప్రణాళిక ప్రకారం సమయానికి తప్పని సరిగా తీసుకోవాలి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.