విటమిన్‌ ‘సి’ లోపం ఏర్పడితే.. శరీరంలో ఏం జరుగుతుంది?

ABN , First Publish Date - 2022-03-15T16:55:50+05:30 IST

రక్తనాళాల ఆరోగ్యం కోసం, గాయాలు తేలికగా మానడం కోసం సరిపడా ‘సి’ విటమిన్‌ అవసరం.

విటమిన్‌ ‘సి’ లోపం ఏర్పడితే.. శరీరంలో ఏం జరుగుతుంది?

ఆంధ్రజ్యోతి(15-3-2022)

రక్తనాళాల ఆరోగ్యం కోసం, గాయాలు తేలికగా మానడం కోసం సరిపడా ‘సి’ విటమిన్‌ అవసరం. ఎముకల దృఢత్వానికీ, శరీరంలో కొల్లాజెన్‌ వృద్ధికి కూడా ఈ విటమిన్‌ తోడ్పడుతుంది. ఇన్ని జీవక్రియలకు సహాయపడుతుంది కాబట్టే విటమిన్‌ ‘సి’ లోపం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.


స్కర్వీ: తేలికగా చర్మం ఒరుసుకుపోవడం, చిగుళ్ల నుంచి రక్తస్రావం, బలహీనత, చర్మం మీద దద్దుర్లు, ఆకలి లేకపోవడం, కీళ్ల నొప్పులు ‘సి’ విటమిన్‌ లోపం లక్షణాలు. ఈ సమస్యను సరిదిద్దకపోతే చిగుళ్ల వ్యాధి ‘జింజివైటిస్‌’, అనీమియా (రక్తహీనత), చర్మం తేలికగా చిట్లిపోతూ రక్తస్రావం జరగడం లాంటి ఇబ్బందులు మొదలవుతాయి.  


హైపర్‌ థైరాయిడిజం: విటమిన్‌ ‘సి’ లోపం వల్ల, థైరాయిడ్‌ గ్రంథి అవసరానికి మించి హార్మోన్‌ను స్రవిస్తుంది. ఫలితంగా నెలసరిలో అవకతవకలు, బరువు తగ్గడం, గుండె వేగం పెరగడం, ఆకలి పెరగడం, ఆందోళన, వణుకు మొదలైన లక్షణాలు మొదలవుతాయి.  


అనీమియా: ఆహారంలోని ఐరన్‌ శోషణకు ‘సి’ విటమిన్‌ అవసరం. ఈ విటమిన్‌ లోపించినప్పుడు శరీరం ఐరన్‌ను శోషించుకోలేదు. ఫలితంగా ఎర్ర రక్తకణాలు తగ్గి, రక్తహీనత మొదలవుతుంది. నిస్సత్తువ, చర్మం పాలిపోవడం, ఊపిరి అందకపోవడం, తల తిరుగుడు, బరువు కోల్పోవడం మొదలైన లక్షణాలు వేధిస్తాయి. వీటిలో పుష్కలంగా...విటమిన్‌ ‘సి’ లోపాన్ని భర్తీ చేయడం కోసం సిట్రస్‌ జాతి పండ్లను తింటూ ఉండాలి. అలాగే ఆకుపచ్చని కూరగాయలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. నారింజ, నిమ్మ, బత్తాయి, ద్రాక్ష, బ్రొకొలి, స్ట్రాబెర్రీల్లో విటమిన్‌ ‘సి’ ఎక్కువ.

Updated Date - 2022-03-15T16:55:50+05:30 IST