నిరుద్యోగ భృతి ఏమైంది?

ABN , First Publish Date - 2022-03-10T08:42:03+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టేవరకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి ఏడాది గడిచినా నిరుద్యోగులకు పైసా కూడా ఇవ్వలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు.

నిరుద్యోగ భృతి ఏమైంది?

1.91 లక్షల పోస్టులు భర్తీచేయండి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌/కవాడిగూడ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టేవరకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి ఏడాది గడిచినా నిరుద్యోగులకు పైసా కూడా ఇవ్వలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద జీవన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడే నాటికే ఉన్న ఉద్యోగ ఖాళీలు, రిటైర్మెంట్‌తో ఏర్పడ్డ ఖాళీల భర్తీకి ఇంత హంగామా అవసరమాఅని ప్రశ్నించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే 1.91 లక్షల పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-03-10T08:42:03+05:30 IST