చోరీకి గురయిన విగ్రహాలు.. మళ్లీ ఇంట్లో ప్రత్యక్ష్యం.. వాటితోపాటు దొరికిన లేఖలో ఆ దొంగ రాసింది చదివి..

Published: Tue, 17 May 2022 13:41:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చోరీకి గురయిన విగ్రహాలు.. మళ్లీ ఇంట్లో ప్రత్యక్ష్యం.. వాటితోపాటు దొరికిన లేఖలో ఆ దొంగ రాసింది చదివి..

తప్పు చేసిన తర్వాత చాలా మందిలో పశ్చాత్తాపం కనిపిస్తూ ఉంటుంది. తాము చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు తాపత్రయపడుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ దొంగ కూడా ఇలాగే చేశాడు. స్థానికంగా ఉంటున్న ప్రముఖ ఆలయంలో కొన్ని విగ్రహాలు చోరీకి గురయ్యాయి. అయితే మళ్లీ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యాయి. వాటితో పాటూ దొరికిన లేఖలో ఓ దొంద రాసింది చదివి... అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్వాలి పరిధిలోని తరౌహాన్‌ అనే ప్రాంతంలో ఉన్న బాలాజీ ఆలయాలనికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో మే 9న చోరీ జరిగింది. ఆలయ తాళాలు పగులగొట్టి వివిధ లోహాలతో చేసిన విగ్రహాలను ఎత్తుకెళ్లారు.  శ్రీరాముడు, రాధాకృష్ణ ఇత్తడి విగ్రహం, బాలాజీ విగ్రహం, లడ్డూ గోపాల్ విగ్రహంతో పాటు నగదు, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకుడు మహంత్ రామ్ బాలక్ దాస్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో కొందరు దుండగులు నిత్యం మందు పార్టీలు, జూదాలు నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. వారే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

పొలానికి తుపాకీ తీసుకెళ్లొద్దు.. అని సూచించిన అన్న... మాట్లాడుతుండగానే ఉన్నట్టుండి తమ్ముడు చేసిన నిర్వాకం..

ఈ క్రమంలో గత శనివారం మహంత్ రామ్.. తన ఇంటి బయట ఉన్న ఆవులకు మేత వేసేందుకు వెళ్లాడు. అక్కడ అతడికి ఓ లేఖ కనిపించింది. అందులో ’’విగ్రహాలను చోరీ చేసిన తర్వాత నాకు నిద్ర పట్టలేదు... భయంకరమైన కలలు వస్తున్నాయి... అందుకే విగ్రహాలను తిరిగి ఇస్తున్నాను.. దయచేసి వాటిని ఆలయంలో తిరిగి ప్రతిష్ఠించండి’’..అని రాసి ఉంది. తర్వాత చుట్టు పక్కల పరిశీలించగా.. విగ్రహాలతో కూడిన ఓ బుట్ట కనిపించింది. అయితే అందులో 12 ఇత్తడి, రాగి విగ్రహాలు ఉండగా.. అష్ట లోహాలతో తయారు చేసిన రెండు విగ్రహాలు కనిపించలేదని మహంత్ తెలిపాడు. విగ్రహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆకాశంలో ఉరుములు, మెరుపుల మధ్య దూసుకొచ్చిన భారీ ఇనుప బంతులు.. తీరా ఏంటా అని పరిశీలించగా..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

పెళ్లయిన మరుసటి రోజే నవ వధువు షాకింగ్ నిర్ణయం.. భర్తకు విడాకులు.. ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ..కాసేపట్లో పెళ్లనగా వరుడికి మైండ్‌బ్లాక్.. వధువుకు వేరే కుర్రాడితో పెళ్లి చేసిన తండ్రి.. అసలు కథేంటంటే..కోట్లు వద్దు.. ఒక్కసారైనా కూర్చుంటే చాలంటున్న మహిళ.. ఇదేం కోరిక అని ఆవాక్కవుతున్నారా..? ఆమె సమస్యేంటో తెలిస్తే..తాళి కట్టిన తర్వాత ఎంటరైన పోలీసులు... కాసేపటికి భర్త స్థానంలో మరిది ప్రత్యక్షం... జరిగిన విషయం తెలుసుకుని అవాక్కయిన బంధువులుViral video: రైలు నుంచి పిల్లలతో పాటూ కిందకు దూకేసిన మహిళ.. సమయానికి కానిస్టేబుల్ గమనించడంతో.. videoచలనం లేకుండా పడి ఉన్న తల్లి పక్కన 6నెలల చిన్నారి ఒకటే ఏడుపు.. స్థానికులు కంగారుగా వెళ్లి చూడగా..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.