Action: కర్ర, బియ్యం, పచ్చిమిర్చితో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న మహిళ.. పోలీసుల నెత్తిపై అక్షింతలు చల్లి మరీ.. ఆమె చేసిన నిర్వాకం..

ABN , First Publish Date - 2022-07-08T21:55:11+05:30 IST

భర్త తప్పు చేస్తే కొందరు భార్యలు మొదట మందలిస్తారు. మాట వినకపోతే కుటుంబ సభ్యులకు తెలియజేస్తారు. అప్పటికీ వినకపోతే పుట్టింటికి వెళ్లిపోవడం సాధారణంగా జరుగుతుంటుంది. భర్త..

Action: కర్ర, బియ్యం, పచ్చిమిర్చితో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న మహిళ.. పోలీసుల నెత్తిపై అక్షింతలు చల్లి మరీ.. ఆమె చేసిన నిర్వాకం..

భర్త తప్పు చేస్తే కొందరు భార్యలు మొదట మందలిస్తారు. మాట వినకపోతే కుటుంబ సభ్యులకు తెలియజేస్తారు. అప్పటికీ వినకపోతే పుట్టింటికి వెళ్లిపోవడం సాధారణంగా జరుగుతుంటుంది. భర్త ప్రవర్తనలో మార్పు రాని సందర్భంలో కొందరైతే చివరకు విరక్తి పుట్టి.. విడాకులు తీసుకోవడానికి కూడా వెనుకాడరు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ.. ఇందుకు పూర్తిగా విరుద్ధం. బీహార్‌లో ఓ మహిళ.. తన తాగుబోతు భర్త కోసం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి, రచ్చ రచ్చ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..


బీహార్ రాష్ట్రం జాముయి పరిధి సికింద్రా పోలీస్  స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సికింద్రా పరిధిలో బుధవారం అర్ధరాత్రి పోలీసులు నైట్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న పలువురిని అరెస్ట్ చేశారు. రాత్రంతా అందరినీ స్టేషన్‌లోనే ఉంచారు. గురువారం ఉదయం సంజూ దేవి అనే మహిళ.. చేతిలో కర్ర, పచ్చిమిర్చి, బియ్యంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ముందుగా పోలీసుల నెత్తిమీద బియ్యం, పచ్చిమిర్చిని చల్లింది. తర్వాత ఒక్కసారిగా తలను అటూ ఇటూ ఊపడం మొదలెట్టింది. ‘‘నేను దుర్గామాత ప్రతి రూపాన్ని రా.. నా ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు.. మీరంతా క్షేమంగా ఉండాలంటే, వెంటనే నా భర్తను విడుదల చేయండి’’.. అంటూ అరవడం మొదలెట్టింది. ఆమె వింత ప్రవర్తన చూసి పోలీసులంతా అవాక్కయ్యారు. అరెస్ట్ చేసిన మందుబాబుల్లో కార్తీక్ మాంఝీ అనే వ్యక్తి ఉన్నాడు.

ఏమైందమ్మా! మౌనంగా ఉన్నావ్.. అని అడిగిన తండ్రి.. పొలంలో ఒంటరిగా ఉండగా కొందరు.. అంటూ చెప్పుకొచ్చిన బాలిక..


భర్తను ఎలాగైనా విడిపించుకెళ్లాలని సంజూ దేవి.. ఈ డ్రామా మొదలెట్టిందని పోలీసులకు చివరకు అర్థమైంది. గంటల తరబడి స్టేషన్‌లో ఆమె హల్‌చల్ చేసింది. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. చివరకు ఆమె ఉంటున్న ప్రాంతానికి చెందిన వారిని పిలిపించి, మహిళను వారితో పాటూ బలవంతంగా పంపించాల్సి వచ్చింది. భర్తపై ఎంత ప్రేమ ఉంటే మాత్రం.. తాగడం తప్పని చెప్పాల్సింది పోయి.. ఇంత డ్రామా చేయాలా.. అంటూ స్థానికులు చర్చించుకున్నారు. గతంలో సికంద్రా ప్రాంతంలోని లచ్చార్ పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ కత్తి, త్రిశూలంతో పోలీసులపై దాడికి ప్రయత్నించిందని స్థానికులు తెలిపారు.

రైల్వే ట్రాక్‌పై మహిళ మృతదేహం.. క్లూ కోసం వెతుకుతుండగా అరచేతిలో కనిపించిన అక్షరాలు.. ఇంతకీ ఆమె ఏం రాసుకుందంటే..

Updated Date - 2022-07-08T21:55:11+05:30 IST