heart attack: గుండెపోటు వచ్చిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ABN , First Publish Date - 2022-09-23T20:13:29+05:30 IST

ఆరోగ్యకరమైన ఆహారం గుండె రక్తప్రసరణపై ఒత్తిని తగ్గించి, గుండెపోటు తర్వాత మరికాస్త కాలం మరోమారు గుండెపోటు రాకుండా కాపాడుతుంది.

heart attack: గుండెపోటు వచ్చిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

గుండెపోటు వచ్చిన తరువాత రోగి తీసుకునే ఆహారంలో చాలావరకూ జాగ్రత్త అవసరం. వీరు రోజువారి తీసుకునే ఆహారంలో స్కిమ్డ్ మిల్క్, పాల ఉత్పత్తులు, చిక్కుళ్ళు, పప్పులు, తృణధాన్యాలు, గుడ్డులోని తెల్లసొన, పౌల్ట్రీ , చేపలతో సహా తగినంత మొత్తంలో ప్రొటీన్‌లను తీసుకోవాలి. 


ఆరోగ్యకరమైన ఆహారం గుండె రక్తప్రసరణపై ఒత్తిని తగ్గించి, గుండెపోటు తర్వాత మరికాస్త కాలం మరోమారు గుండెపోటు రాకుండా కాపాడుతుంది. ఈ ఆహారాన్ని రుచికరంగా ఏలా తీసుకోవాలి..


1. గుండె ఆరోగ్యం గురించి ఏ ఆహారం ఆరోగ్యకరమో అర్థం చేసుకోవడం, అధిక రక్తపోటును కంట్రోల్ లో ఉంచుకోవడం ముఖ్యం.


2. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మంచి తాజా వాటిని ఎంచుకోవడం వల్ల ఆహారంలో మొక్కల స్టెరాల్స్ సమృద్ధిగా ఉంటాయి. 


3. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడటానికి జిడ్డుగా ఉండే చేపలు, బాదం, వాల్ నట్స్, అవిసె గింజలు వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటే ఆహారాన్ని తీసుకోవాలి.


4. బేకరీ ఉత్పత్తులు, ప్యాక్ చేసిన ఆహారాలను, ఎర్రటి మాంసం, వెన్న, నెయ్యి, డాల్డా వనస్పతితో సహా చాలా పదార్ధాలను తక్కువ మోతాదులో తీసుకోండి.


5. వేయించడానికి బదులుగా, బ్రాయిలింగ్, బాయిల్, స్టయింగ్, గ్రిల్లింగ్, బేకింగ్, రోస్టింగ్ వంటి పద్దతుల్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోండి.


6. వారానికి కనీసం ఐదు రోజులు 30-40 నిముషాలు వ్యాయామం చేయండి. 


7. డికాఫిన్ లేని కాఫీ నమూనాలపై జరిగిన అధ్యయనంలో 14 నుండి 20 కప్పుల కాఫీలో ఒక కప్పు సాధారణ కాఫీలో ఉన్నంత కెఫిన్ ఉంటుందని తేలింది. ఇది యాంటీ-ఆక్సిడెంట్ల (పాలీఫెనాల్స్ మరియు క్లోరోజెనిక్ యాసిడ్)  నియాసిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి కొన్ని పోషకాలను కలిగి ఉంది. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులను నివారిస్తుంది. అలాగే, కెఫిన్-సెన్సిటివ్, గర్భిణీ స్త్రీలు కొన్ని మందులు తీసుకునే రోగులకు డికాఫ్ మంచి ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. 

Updated Date - 2022-09-23T20:13:29+05:30 IST