నూతన విద్యా విధానంలో కొత్తదనమేదీ?

ABN , First Publish Date - 2022-05-23T16:43:43+05:30 IST

కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న జాతీయ నూతన విద్యా విధానంలో కొత్తదనం ఏమీ లేదని తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖామంత్రి డాక్టర్‌ పొన్ముడి

నూతన విద్యా విధానంలో కొత్తదనమేదీ?

-మంత్రి పొన్ముడి విమర్శ

అడయార్‌, మే 22: కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న జాతీయ నూతన విద్యా విధానంలో కొత్తదనం ఏమీ లేదని తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖామంత్రి డాక్టర్‌ పొన్ముడి తెలిపారు. తిరుచ్చిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యా విధానం ప్రకారం 3, 5, 8 తరగతుల్లో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ విద్యా విధానంలో కొత్తదనం లేదన్నారు. అందుకే ముఖ్యమంత్రి స్టాలిన్‌ రాష్ట్రానికంటూ ప్రత్యేకంగా కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చారని చెప్పారు. అదేసమయంలో యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో చేరేందుకు కూడా కేంద్రం ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించిందన్నారు. వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పరీక్షలను రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్రంలో సీఎం స్టాలిన్‌ సారథ్యంలో డీఎంకే ప్రభుత్వ పాలన భేషుగ్గా ఉందన్నారు. ద్రవిడియన్‌ రూల్‌ రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. అసలు ద్రావిడ పాలన అంటే ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని భాషల వారు మనుషులే అన్న భావనతో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించడమే ద్రావిడ పాలన అన్నారు. ఇలాంటి సమానత్వమే ద్రావిడ పాలన అని మంత్రి పొన్ముడి వివరించారు. 

Updated Date - 2022-05-23T16:43:43+05:30 IST