భర్తను వదిలి పుట్టింటికి వచ్చిన కూతురు.. 4 నెలల తర్వాత కూతురి నిర్వాకం గురించి తెలిసి ఆ తండ్రి ఎంత పనిచేశాడంటే..

ABN , First Publish Date - 2021-10-23T00:49:55+05:30 IST

తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడి సమీపంలోని నాందుపట్టి గ్రామానికి చెందిన తెన్నారాసు, అమృతవల్లి దంపతులకు కౌసల్య అనే కూతురు ఉంది. కుమార్తెకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లు సవ్యంగా సాగిన వీరి సంసారంలో మనస్పర్థలు

భర్తను వదిలి పుట్టింటికి వచ్చిన కూతురు.. 4 నెలల తర్వాత కూతురి నిర్వాకం గురించి తెలిసి ఆ తండ్రి ఎంత పనిచేశాడంటే..

కూతురు కాపురం బాగుండాలనే ఉద్దేశంతో అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తుంటారు తల్లిదండ్రులు. అయితే కొన్నిసార్లు కూతుళ్ల కాపురం.. వివిధ కారణాలతో సమస్యలకు నిలయంగా మారుతుంటుంది. ఇలా జరిగినప్పుడు కొందరు మహిళలు ఆత్మహత్య చేసుకోవడమో లేక తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోవడమో చేస్తుంటారు. ఇలాగే చెన్నైలో ఓ మహిళ తన భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చింది. తర్వాత ఆమె చేసిన పనులకు.. తల్లిదండ్రులు కూడా ఛీదరించుకునే పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళితే..


తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడి సమీపంలోని నాందుపట్టి గ్రామానికి చెందిన తెన్నారాసు, అమృతవల్లి దంపతులకు కౌసల్య అనే కూతురు ఉంది. కుమార్తెకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లు సవ్యంగా సాగిన వీరి సంసారంలో మనస్పర్థలు తలెత్తాయి. ఈ కారణంగా భార్యభర్తలు తరచూ గొడవపడేవారు. చివరకు భర్తతో విభేదించిన ఆమె.. నాలుగు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే ఇటీవల గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారితీసింది.


కూతురి వివాహేతర సంబంధం విషయం తల్లిదండ్రులకు తెలిసి, పద్ధతి మార్చుకోవాలని మందలించారు. అయినా ఆమె వారి మాట వినకుండా అతడితో సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయమై శుక్రవారం మళ్లీ గొడవ జరిగింది. తల్లిదండ్రులు తీవ్రంగా మందలించడంతో మనస్థాపానికి గురైన కౌసల్య.. పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు చికిత్స ప్రారంభించక ముందే ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత గొంతు నులిమి చంపి.. పురుగుల మందు కారణంగానే చనిపోయినట్లు నమ్మించారు. అంత్యక్రియలు కూడా చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-23T00:49:55+05:30 IST