IPL2022: Wide ball ఇచ్చిన అంపైర్.. విసుగుతో Sanju Samson ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-05-03T21:16:19+05:30 IST

ముంబై : IPL 2022లో భాగంగా సోమవారం రాత్రి Kolkata Knight Ridersతో తలపడిన Rajasthan Royals వరుసగా రెండవ ఓటమిని చవిచూసింది.

IPL2022: Wide ball ఇచ్చిన అంపైర్.. విసుగుతో Sanju Samson ఏం చేశాడంటే..

ముంబై : IPL 2022లో భాగంగా సోమవారం రాత్రి Kolkata Knight Ridersతో తలపడిన Rajasthan Royals వరుసగా రెండవ ఓటమిని చవిచూసింది. 7 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. 153 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి కలకత్తా నైట్ రైడర్స్‌ను నితీష్ రాణా, రింకూ సింగ్ విజయ తీరాలకు తీర్చారు. వీరిద్దరూ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ఎంత శ్రమించిన వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీయలేకపోయారు. ఎంతకీ వికెట్లు పడకపోవడంతో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌లో ఒత్తిడి, విసుగు కనిపించాయి.


ప్రసిద్ధ క్రిష్ణ వేసిన 19వ ఓవర్‌లో శాంసన్ విసుగు మరింత స్పష్టంగా కనిపించింది. కలకత్తా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్‌కు ప్రసిద్ కృష్ణ వేసిన బంతి వైడ్‌లైన్‌ను దాటి పక్కకు వెళ్లింది. రింకూ సింగ్ కొట్టేందుకు ప్రయత్నించినా బ్యాట్‌ను తాకలేదు. దీంతో అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. అప్పటికే ఒత్తిడిలో ఉన్న సంజూ శాంసన్.. అంపైర్ వైడ్ బాల్ ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశాడు. వైడ్ బాల్ కాదని భావించిన ఆర్ఆర్ కెప్టెన్ వెంటనే రివ్యూ కోరాడు. థర్డ్ అంపైర్ ఈ బంతిని పరిశీలించగా.. బ్యాట్‌, బాల్ మధ్య చాలా దూరం ఉందని తేలింది. థర్డ్ అంపైర్ కూడా వైడ్‌గా నిర్ధారించాడు. ఆ తర్వాత మ్యాచ్ కూడా పూర్తయింది. అయితే సంజూ శాంసన్ రివ్యూ కోరిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శాంసన్ లాంటివాడు అంపైర్‌పై విసుగు చెందాడంటే ఏదో అసంతృప్తి ఉండే ఉంటుందని చెబుతున్నారు. కాగా అంతకుముందే రెండు వైడ్ బంతుల విషయంలో సంజూ శాంసన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇవెలా వైడ్‌బాల్స్ అనే ఎక్స్‌ప్రెసెన్ ఇచ్చాడు. రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు అందరూ వైడ్ బాల్స్ ప్రకటనపై అసంతృప్తి చెందినట్టు  వారి హావభావాలు స్పష్టం చేశాయి.

Read more