ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి వార్న్ ఏమన్నాడంటే?

ABN , First Publish Date - 2022-03-05T03:14:00+05:30 IST

ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్‌గా ఖ్యాతికెక్కిన ఆసీస్ క్రికెటర్ షేన్ వార్న్ థాయిలాండ్‌లోని ఓ విల్లాలో గుండెపోటుతో

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి వార్న్ ఏమన్నాడంటే?

సిడ్నీ: ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్‌గా ఖ్యాతికెక్కిన ఆసీస్ క్రికెటర్ షేన్ వార్న్ థాయిలాండ్‌లోని ఓ విల్లాలో నేడు (శుక్రవారం) గుండెపోటుతో హఠాన్మరణం చెందడం క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 52 ఏళ్ల చిన్నవయసులోనే వార్న్ ఇక లేడన్న వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి తెగబడడంపై వార్న్ ఇటీవల స్పందిస్తూ.. ఇది చాలా అన్యాయమంటూ రష్యా చర్యను తప్పుబట్టాడు. 



రష్యా అన్యాయమైన దాడికి గురవుతున్న ఉక్రెయిన్ ప్రజలకు ఈ ప్రపంచం మొత్తం అండగా ఉందని వార్న్ ట్వీట్ చేశాడు. అక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉందని, యుద్ధానికి సంబంధించిన ఫొటోలు చాలా భయంకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.


యుద్ధాన్ని ఆపేందుకు ఇప్పటి వరకు ఏమీ చేయకపోవడాన్ని తాను నమ్మలేకపోతున్నానని అన్నాడు. ఉక్రెయిన్‌కు చెందిన తన స్నేహితుడు, అతడి కుటుంబానికి ప్రేమను పంపుతున్నట్టు.. తన స్నేహితుడు, ఉక్రెయిన్ ఫుట్‌‌బాల్ జట్టు మేనేజర్ ఆండ్రీ షెవ్‌‌చెంకోవ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.  



Updated Date - 2022-03-05T03:14:00+05:30 IST