గర్భిణిగా ఉన్న మూడో భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లిన భర్త.. డాక్టర్‌తో అతడు చెప్పిన మాట.. చివరకు ఎంతవరకు వెళ్లిందంటే..

Published: Thu, 20 Jan 2022 21:57:32 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గర్భిణిగా ఉన్న మూడో భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లిన భర్త.. డాక్టర్‌తో అతడు చెప్పిన మాట.. చివరకు ఎంతవరకు వెళ్లిందంటే.. ప్రతీకాత్మక చిత్రం

భార్యపై ప్రేమ చూపించే భర్తలతో పాటూ చిత్రహింసలు పెట్టే భర్తలు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే భర్త.. వీరిందరికీ భిన్నంగా ఉన్నట్టున్నాడు. అతడికి అప్పటికే రెండు సార్లు వివాహమైంది. ఇద్దరు భార్యలతో విభేదాల కారణంగా దూరంగా ఉంటూ మూడో భార్యను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలలకు ఆమె గర్భం దాల్చింది. డెలివరీ సమయం దగ్గర పడుతుండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తర్వాత డాక్టర్‌తో అతడు చెప్పిన మాట ఎంత వరకు వెళ్లిందంటే..

రాజస్థాన్ ఝలావర్‌కు చెందిన మంగళ్ సింగ్ లోహర్‌‌.. మూడో వివాహం చేసుకున్నాడు. గతంలో ఇద్దరు భార్యలతో విభేదాలు రావడంతో మూడేళ్ల క్రితం మూడో వివాహం చేసుకున్నాడు. ఇటీవల మూడో భార్య గర్భం దాల్చింది. డెలివరీ సమయం దగ్గరపడుతుండడంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. స్కానింగ్ చేసిన వైద్యులు, ఆమె కడుపులో కవలలు ఉన్నట్లు తెలిపారు. ఈ మాటకు సంతోషించాల్సిన భర్త.. అందుకు విరుద్ధంగా పిల్లలను చంపేయాలని వైద్యలుతో చెప్పాడు. అందుకుగాను వారికి రూ.2లక్షలు ఇస్తానని ఆశ చూపాడు. ఈ మాటలకు షాకైన వైద్యులు.. విషయం మొత్తం పోలీసులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు ఇలా ఎందుకు ప్రవర్తించాడనే విషయం ఇప్పటికీ తెలీదు. అయితే భార్యాభర్తల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయని మాత్రం పోలీసులకు తెలిసింది.

ప్రేమికుల రోజునే పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు.. ఓ రోజు టీవీ చూసి అతడు చేసిన పనికి అంతా అవాక్కయ్యారు.. చివరకు ఏమైందంటే..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

తండ్రి, అన్నపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన బాలిక.. రెండేళ్లుగా వారు చేసిన పని తెలుసుకుని.. చివరకు.. డబ్బుల కోసం ఔత్సాహిక దర్శకుడి హైటెక్ ప్లాన్.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బట్టబయలైన అసలు నిజం.. ప్రియురాలి కోసం రూ.4కోట్ల రింగ్ తీసుకున్నాడు.. ఇవ్వడానికి కాస్త ముందే ఆమె గురించి తెలిసి.. హమ్మయ్య అనుకున్నాడు..సెల్ఫీలను అమ్ముతూ రూ.కోట్లు సంపాదిస్తున్న యువకుడు.. ఎలాగో తెలుసుకుంటే అవాక్కవుతారు.. పెళ్లయిన కొన్ని నెలలకే భర్త ప్రవర్తనలో మార్పు.. చివరికి విషయం తెలుసుకుని భార్య ఏం చేసిందంటే..ఇంట్లోకి దొంగ దూరాడంటూ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు.. గదిలో షాకింగ్ దృశ్యం.. అసలు కథేంటో తెలిసి..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.