ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగితో నర్సు చాటింగ్.. ఓ రోజు ఫోన్‌లో ఆమె మాటలు విని..

Published: Sat, 01 Jan 2022 18:03:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగితో నర్సు చాటింగ్.. ఓ రోజు ఫోన్‌లో ఆమె మాటలు విని.. ప్రతీకాత్మక చిత్రం

చాలారకాల ప్రేమకథలు చూస్తూ ఉంటాం. కొందరు స్వచ్ఛమైన మనసుతో ప్రేమిస్తే.. మరికొందరు కేవలం అవసరం కోసమే ప్రేమ నాటకం ఆడుతుంటారు. ధనవంతులను టార్గెట్ చేసి ప్రేమిస్తున్నామంటూ వెంటబడతారు. మొదట్లో ప్రేమగా ఉంటూ.. తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజే వారిని ఎంతో మందిని చూస్తుంటాం. పూణేలో ఓ నర్సు.. రోగిని ప్రేమించింది. రోజూ అతడితో చాటింగ్ చేసేంది. చివరకు వారి వ్యవహారం ఎంత వరకు వెళ్లిందంటే..

పూణేకి చెందిన ఓ వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం డయాలసిస్ చేయించుకునేందుకు తరచూ ఆస్పత్రికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఓ నర్సుతో పరిచయం ఏర్పడింది. ఆమె కూడా ఇతడితో రోజూ ఫోన్లలో మాట్లాడుతూ ఉండేది. రోజూ ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారు. ఆస్పత్రికి వెళ్లినప్పుడల్లా ఆమెతో చనువుగా ఉండేవాడు. ఇలా కొన్నాళ్లు ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. అయితే ఇటీవల ఆమె ఒక్కసారిగా తన అసలు రూపం బయటపెట్టింది. ‘‘అర్జంటుగా రూ.20లక్షలు ఇవ్వాలని.. లేదంటే చాటింగ్ మొత్తం సోషల్ మీడియాలో పెట్టి, ప్రేమ పేరుతో వేధిస్తున్నావంటూ పరువు తీస్తాను’’.. అంటూ బెదిరించింది.

ప్రియురాలిని డిన్నర్‌కు తీసుకెళ్లిన ప్రియుడు... అక్కడ ఆమె చేసిన పనికి షాక్.. తెలిసిన వారి ముందు పరువు తీశావంటూ...

అంతవరకూ మంచిగా ఉన్న నర్సు.. ఒక్కసారిగా బెదిరింపులకు దిగడంతో రోగి షాక్ అయ్యాడు. బయట ఎవరికైనా చెబితే తన పరువు పోతుందని భయపడ్డాడు. నర్సు మాత్రం రోజూ బెదిరించడం మొదలెట్టింది. వేధింపులు ఎక్కువవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సలహా మేరకు ఆమెకు ఫోన్ చేసి, డబ్బులు ఇస్తానని చెప్పి రమ్మన్నాడు. దీంతో గురువారం ఆమె పుణేలోని రహత్నీలోని శివర్ చౌక్ వద్దకు రాగానే.. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వకాడ్‌ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

కింగ్‌కోబ్రాపై గ్రామస్తుల దాడి.. అడ్డుకున్న వైద్యులు.. దానికి ఎలాంటి వైద్యం చేశారంటే..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఆ కుక్కంటే యజమానికి చాలా ఇష్టం.. ఇంట్లో ఉంచుకోవద్దన్న తల్లి.. కుక్కను వదిలి ఉండలేక చివరకు.. ఆన్‌లైన్‌లో పరిచయమైన యువకుడిని ఇంటికి పిలిచిన మహిళ.. చివరకు ఆమె అలా చేస్తుందని తెలుసుకోలేకపోయాడు.. 35వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం.. ఒక్కసారిగా దభేల్ మని శబ్ధం.. అద్దం పగలడంతో అంతా ఆశలు వదులుకున్నారు.. అయితే.. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు.. భర్తతో విడిపోయి ఒంటిరి జీవితం.. చివరగా జిమ్ ట్రైనర్ పరిచయంతో..మండపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చిన వధువు.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన పాకిస్తానీ పెళ్లికూతురు..videoఇనుప రాడ్ కోసం బావిలో వెతకగా.. బంగారు మూట దొరికింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.