ఇంట్లోకి గుట్టలు గుట్టలుగా పాములు.. యజమాని చేసిన పనికి చుట్టుపక్కల వారు షాక్..

ABN , First Publish Date - 2021-12-05T01:13:45+05:30 IST

అమెరికాలో ఓ ఇంట్లోకి పాములన్నీ ఒకేసారి వెళ్లాయి. బయటికి పంపాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఆ ఇంటి యజమాని చేసిన పనికి స్థానికులంతా షాక్ అయ్యారు.

ఇంట్లోకి గుట్టలు గుట్టలుగా పాములు.. యజమాని చేసిన పనికి చుట్టుపక్కల వారు షాక్..

చిన్న చిన్న పురుగులు, దోమలు ఇంట్లోకి వస్తేనే చిరాకుగా ఉంటుంది. వాటిని తరిమికొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. అవి పూర్తిగా బయటికి పోతోగానీ ప్రశాంతంగా నిద్రపట్టదు. అలాంటిది పాములు ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుంది. ఆలోచించడానికే భయంగా ఉంది కదా. ఒక్క పాము వస్తేనే అలా ఉంటే ఇక పాములన్నీ గుట్టలు గుట్టలుగా ఒకేసారి ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుందో.. ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అమెరికాలో ఓ ఇంట్లోకి ఇలాగే పాములన్నీ ఒకేసారి వెళ్లాయి. బయటికి పంపాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఆ ఇంటి యజమాని చేసిన పనికి స్థానికులంతా షాక్ అయ్యారు.


అమెరికాలోని మేరీల్యాండ్‌లోని మోంట్‌గోమెరీ కౌంటీ ప్రాంతంలో విష సర్పాల సంచారం ఎక్కువగా ఉంటుంది. దీంతో అక్కడి వారు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇలాగే ఓ ఇంటి యజమాని కూడా అవస్థలు పడేవాడు. తన ఇంట్లోకి రోజూ వందల కొద్దీ పాములు వస్తుండడంతో అతడికి ప్రశాంతంగా నిద్ర కూడా పట్టేది కాదు. దీంతో ఎలాగైనా పాములను తరిమికొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు కుంపట్లో నిప్పులు పోసి పొగ పెట్టాడు. ఈ ప్రయత్నం ఫలించి, పాములన్నీ బయటికి వెళ్లాయి. అయితే నిప్పు రవ్వలు ఎగిసిపడి ఇంటికి మంటలు అంటుకున్నాయి. అసలే చెక్క ఇల్లు కావడంతో క్షణాల్లోనే మొత్తం తగలపడింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే వారు వచ్చే లోపే మొత్తం తగలబడిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే సుమారు 1 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు.



Updated Date - 2021-12-05T01:13:45+05:30 IST